News
News
X

AP CM YS Jagan: ముఖ్యమంత్రిగారూ, నెల్లూరుకిచ్చిన హామీలు ఏమయ్యాయి ! ఎంతవరకు అమలు చేశారు ?

వరద సాయం రెండు రకాలు. తక్షణ సాయంగా డబ్బులివ్వడం, నిత్యావసరాలివ్వడం ఇందులో ఒకటి. మరోసారి వరదలు వచ్చినా వారికి నష్టం కలుగకుండా చేయడం రెండో రకం. ఇక్కడ జగన్ మొదటి సాయంలో పాసయ్యారు, కానీ..

FOLLOW US: 

AP CM Jagan Flood Promises: గోదావరి వరదల విషయంలో అధికార, విపక్షాలు మీరేం చేశారంటే, మీరేం చేశారంటూ విమర్శలు గుప్పించుకుంటున్నాయి. గతంలో హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల విషయాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అంత దూరం అవసరం లేదు, ఏడాది క్రితం నెల్లూరు జిల్లాలో పెన్నాకు వచ్చిన వరదలనే ఉదాహరణ తీసుకుందాం. అప్పట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయి..? ఎంతవరకు అమలయ్యాయి..? ఏబీపీ న్యూస్ పరీశీలనలో తేలిన నిజానిజాలివి..

రెండు రకాలుగా వరద సాయం.. 
వరద సాయం రెండు రకాలు. తక్షణ సాయంగా డబ్బులివ్వడం, నిత్యావసరాలివ్వడం ఇందులో ఒకటి. మరోసారి వరదలు వచ్చినా వారికి నష్టం కలుగకుండా చేయడం రెండో రకం. ఇక్కడ జగన్ మొదటి సాయంలో పాసయ్యారు, కానీ రెండో సాయంలో ఫెయిలైనట్లు కనిపిస్తున్నారు. గతేడాది నెల్లూరు నగర వాసులు పెన్నా వరదతో అష్టకష్టాలు పడినప్పుడు ఆయా ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. అప్పటి జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలతో కలసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి హామీల వర్షం కురిపించారు.

వరదలొస్తే ప్రజల సంగతేంటి..? 
అందులో ప్రధాన హామీ నెల్లూరు నగర పరిధిలో పెన్నా ఒడ్డున బండ్ నిర్మాణం. ఈ గట్టు నిర్మాణాన్ని 2022 సంక్రాంతికి మొదలు పెడతామని అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు జగన్. కట్ చేస్తే.. క్యాలెండర్లో నెలలు గిర్రున తిరిగాయి. అప్పటి మంత్రికి పదవి పోయింది, కొత్తగా మరొకరికి మంత్రి పదవి వచ్చింది. తీరా జగన్ సర్కారు చేసిందేంటంటే.. ఇదే నెలలో శంకుస్థాపన జరపడం. శంకుస్థాపనకే దాదాపు ఏడాది పడితే.. ఇక వర్షాకాలంలో పనులు సాగేదెలా, గట్టు నిర్మాణం పూర్తయ్యేలోపు వరదలొస్తే ప్రజల సంగతేంటి..?

పెన్నాలో నీరు లేకపోతే కరకట్టలపై చాలామంది పేదలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటారు. వారంతా వరద వచ్చిన సమయాల్లో పెట్టేబేడా సర్దుకుని పరుగులు పెడుతుంటారు. అలాంటి వారికి శాశ్వత నివాసాల పేరుతో జగనన్న కాలనీలు ఇచ్చారు. కానీ ఇక్కడ ఇప్పుడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. కనీసం వచ్చే వర్షాకాలానికయినా తమకు ఇళ్లు మంజూరు చేసి తరలిస్తే.. వరదలతో హడలిపోయే ప్రమాదం తప్పుతుందని అంటున్నారు ప్రజలు.

పెండింగ్‌లో పెన్నా వారధి, సంగం వారధి 
నెల్లూరు నగర పరిధిలో పెన్నా వారధి, సంగం మండలంలో సంగం వారధి కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని కూడా వరదల సమయంలో హామీ ఇచ్చారు జగన్. కానీ ఆ రెండూ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. పనులు పూర్తయినట్టే అనిపిస్తున్నా రెండూ ప్రస్తుతం ఉపయోగంలో లేవు. ఈ రెండు వారధులు ఉపయోగంలోకి వస్తే, పెన్నా నీటిని కనీసం కొంతమేరయినా సముద్రంపాలు కాకుండా ఆపవచ్చు. సంగం వారధితో నీటిని ఉత్తర కాల్వలకు మళ్లించవచ్చు, కావలి తీరాన్ని కూడా సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది.

2022 సంక్రాంతికి ఈ రెండు వారధులు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు జగన్. ఇప్పటి వరకూ పనులు పూర్తి కాకపోవడం విశేషం. ఈలోగా జలవనరుల శాఖ మంత్రి కూడా మారిపోవడంతో పనులు మరింత ఆలస్యమవుతున్నాయి. ఎప్పటికప్పుడు సమీక్షలకే కానీ ఈ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఈ రెండు వారధులు ఉపయోగంలోకి వస్తే, సోమశిలనుంచి నీటిని విడుదల చేసినా.. నెల్లూరు నగర వాసులు మరింత హడావిడి పడే అవకాశముండదు. ఒకేసారి వారిపై వరద ప్రవాహం విరుచుకుపడదు. ఈలోగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశముంటుంది.

మొత్తమ్మీ పెన్నాకు వరదలు వచ్చి ఏడాది కావొస్తోంది. ఇప్పటి వరకూ సీఎం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఇప్పుడు కొత్తగా గోదావరికి వరదలొచ్చాయి. ఈ వరదల్లో అధికార, ప్రతిపక్షాలు బురద రాజకీయాలకు తెరతీశాయి.

Published at : 30 Jul 2022 08:24 AM (IST) Tags: YS Jagan cm jagan Nellore news Nellore Update nellore floods

సంబంధిత కథనాలు

ABP Desam Anniversary: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం- మొదటి అడుగుతోనే మరింత ముందుకు

ABP Desam Anniversary: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం- మొదటి అడుగుతోనే మరింత ముందుకు

Nellore News : రోడ్డు కోసం నిలదీసిన జనం, నోరు మూసుకోమని సమాధానమిచ్చిన ఎమ్మెల్యే

Nellore News : రోడ్డు కోసం నిలదీసిన జనం, నోరు మూసుకోమని సమాధానమిచ్చిన ఎమ్మెల్యే

Rains in AP Telangana: తీవ్రరూపం దాల్చుతోన్న అల్పపీడనం - భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్

Rains in AP Telangana: తీవ్రరూపం దాల్చుతోన్న అల్పపీడనం - భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్

Nellore News : నెల్లూరు జిల్లాలో దారుణం, తల్లి, కూతురు అనుమానాస్పద మృతి, భర్త ఆత్మహత్య!

Nellore News : నెల్లూరు జిల్లాలో దారుణం, తల్లి, కూతురు అనుమానాస్పద మృతి, భర్త ఆత్మహత్య!

SSLV Launch: అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ డి1 రాకెట్, ఆఖరి స్టేజ్‌లో ట్విస్ట్ - ఏం జరిగిందంటే

SSLV Launch: అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ డి1 రాకెట్, ఆఖరి స్టేజ్‌లో ట్విస్ట్ - ఏం జరిగిందంటే

టాప్ స్టోరీస్

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!