Nellore: నెల్లూరులో టపాసుల విక్రయాలు అంతంతమాత్రమే.. వ్యాపారులు లబోదిబో, కారణం ఏంటంటే..

నెల్లూరు జిల్లాలో వర్షం దెబ్బతో దుకాణదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పండగ రోజు కూడా ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు.

FOLLOW US: 

దీపావళికి ప్రధానంగా టపాసుల వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. ఈ కాలంలో వ్యాపారం బాగా చేసుకోవాలని ఆశిస్తుంటారు. కానీ, ఈసారి నెల్లూరు జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. దీపావళి టపాకాయల వ్యాపారంపై గతేడాది కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించింది. అమ్మకాలు, కొనుగోళ్లు లేవు, అసలు దీపావళి సందడే కనిపించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గిందని కాస్త ఊపిరి పీల్చుకున్నా.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నెల్లూరు జిల్లాలో వర్షం దెబ్బతో దుకాణదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పండగ రోజు కూడా ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి ముసురు తొలగలేదు. ఈ నేపథ్యంలో దీపావళి సందడి కూడా తగ్గినట్టు కనిపిస్తోంది.

Also Read: CM Jagan: సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ భేటీకి ఆరు అంశాలతో ఏపీ రెడీ.. ప్రత్యేక హోదా ప్రస్తావించాలన్న సీఎం జగన్

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో టపాకాయల అమ్మకాలు జరుపుతున్నారు. అయితే వర్షానికి గ్రౌండ్ పూర్తిగా తడిచిపోయింది. కొనుగోలు దారులు రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. దీంతో అమ్మకాలపై ప్రభావం పడింది. గతేడాది కరోనా వల్ల అమ్మకాలు తగ్గిపోతే, ఈసారి వర్షం తమను ముంచేసిందని అంటున్నారు అమ్మకందారులు. ధైర్యం చేసి స్టాక్ మిగిలిపోతుందని ఆవేదన చెందుతున్నారు.

Also Read: Nellore Corporation: నెల్లూరులో మొదలైన నామినేషన్ల సందడి

నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అమ్మకాలు ఈ ఏడాది అంతంతమాత్రంగానే ఉన్నాయి. టపాకాయల గోడౌన్ల నిర్వహణ, అనుమతుల ధరలు అన్నీ పెరిగిపోవడంతో దాని ప్రభావం వాటి ధరలపై పడింది. దీంతో కొనుగోలుదారులు కూడా పెద్దగా ఆసక్తి చూపించడంలేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద టపాకాయల అమ్మకాలపై గతంలో కరోనా ప్రభావం పడితే, ఈ ఏడాది మాత్రం వర్షం ప్రభావంతో పండగ కళ తప్పింది.

Also Read: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?

Also Read: Weather Updates: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ

Also Read: Gold-Silver Price: దీపావళి వేళ భారీగా తగ్గిన పసిడి.. వెండి కూడా.. ఏకంగా రూ.1,300 తగ్గుదల

Also Read:  ఫ్రెండ్స్‌తో కలిసి రాత్రిపూట సిట్టింగ్.. ఇంతలో పోలీస్ సైరన్, ముంచుకొచ్చిన మృత్యువు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Nov 2021 12:14 PM (IST) Tags: Nellore news Deepavali 2021 Crackers Business Nellore Crackers Business Heavy Rains in Nellore

సంబంధిత కథనాలు

Nellore Gas leakage: పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు- నెల్లూరు గ్యాస్ లీకేజీ ఘటనలో నిజానిజాలు

Nellore Gas leakage: పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు- నెల్లూరు గ్యాస్ లీకేజీ ఘటనలో నిజానిజాలు

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు

PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు

Kakani On Pawan Kalyan : పవన్ కి మూడు కాదు 30 ఆప్షన్లు ఉన్నా వైసీపీని ఏంచేయలేరు- మంత్రి కాకాణి

Kakani On Pawan Kalyan : పవన్ కి మూడు కాదు 30 ఆప్షన్లు ఉన్నా వైసీపీని ఏంచేయలేరు- మంత్రి కాకాణి

టాప్ స్టోరీస్

Tax on Petrol, Diesel: పెట్రోల్‌, డీజిల్‌పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?

Tax on Petrol, Diesel: పెట్రోల్‌, డీజిల్‌పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?

Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!

Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!

10th Class Diaries Movie Review - 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ: స్కూల్ డేస్ లవ్వే కాదు, అంతకు మించి - శ్రీరామ్, అవికా గోర్ నటించిన సినిమా ఎలా ఉందంటే?

10th Class Diaries Movie Review - 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ: స్కూల్ డేస్ లవ్వే  కాదు, అంతకు మించి - శ్రీరామ్, అవికా గోర్ నటించిన సినిమా ఎలా ఉందంటే?

Tracking Tigers: పులులు దొరక్కుండా ఎలా తప్పించుకుంటాయ్, వాటిని ఎలా ట్రాక్ చేస్తారు?

Tracking Tigers: పులులు దొరక్కుండా ఎలా తప్పించుకుంటాయ్, వాటిని ఎలా ట్రాక్ చేస్తారు?