CM Jagan: సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీకి ఆరు అంశాలతో ఏపీ రెడీ.. ప్రత్యేక హోదా ప్రస్తావించాలన్న సీఎం జగన్
తిరుపతిలో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆరుకుపైగా అంశాలు ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభజన టైం నుంచి కొలిక్కి రాని అంశాలు, పెండింగ్ బకాయిలు చర్చించాలని నిర్ణయించింది.
ఈనెల 14న తిరుపతిలో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని సీఎం జగన్ నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో అమిత్‌షా భేటీ కానున్నారు. ఈ వేదికపైనే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇచ్చిన హామీలపై గట్టిగా అడగాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. రాష్ట్ర విభజన అంశాన్ని మరోసారి లైమ్‌లైట్‌లోకీ తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన హామీలతోపాటు పెండింగ్ అంశాలు, బకాయిలు గురించి ప్రస్తావించాలని సూచించారు.
సదరన్ కౌన్సిల్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన ఆరుకుపైగా అంశాలు ప్రస్తావించేందుకు రెడీగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి మేలు జరిగే కీలక అంశాలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు. విభజజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను అజెండాలో ఉంచాలన్నారు. రూ. 6,300 కోట్ల విద్యుత్ బకాయిలు,ు రెవెన్యూబ లోటు, రేషన్ బియ్యం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిలు, పోలవరం రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఎఫ్‌డీ ఖాతాల సమస్య, ఆస్తుల విభజనలో పెండింగ్ ఉన్న అంశాలను ప్రస్తావించేందుకు రెడీగా ఉండాలన్నారు సీఎం జగన్.
ALSO READ: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ
నధుల అనుసంధానం అంశాన్ని కూడా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలన్నారు జగన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రెడీగా ఉండాలని ఆధికారులకు చెప్పారు. ఈ భేటీలో వేరే రాష్ట్రాల ప్రస్తావించే అంశాల్లో ఏపీకి రిలేటెడ్ ఉంటే తగిన రీతిలో రియాక్ట్ కావాలన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆధ్యక్షతన జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ముఖ్మమంత్రులు, పుదుచ్చేరీ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు పాల్గొంటారు. ఏపీ నుంచి మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా ఇతర అధికారులు పాల్గొంటారు.
ALSO READ: దీపావళి వేళ భారీగా తగ్గిన పసిడి.. వెండి కూడా.. ఏకంగా రూ.1,300 తగ్గుదల
ALSO READ: ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు నమోదు.. నలుగురు మృతి
ALSO READ: నెల్లూరులో మొదలైన నామినేషన్ల సందడి