Weather Updates: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం బుధవారం రాత్రి వేళ వాతావరణ అంచనాల బులెటిన్‌ను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. గురువారం రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయి.
తెలంగాణలో దీపావళి నాడు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇంకొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం బుధవారం రాత్రి వేళ వాతావరణ అంచనాల బులెటిన్‌ను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. గురువారం రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయి.
ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం ఉదయం 08.30 నుంచి శుక్రవారం ఉదయం 08.30 వరకు.. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వానలు కురిసే అవకాశముంది. ఈ జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. ఇక నవంబరు 5న రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
బంగాళాఖాతంలో వారం క్రితం ఏర్పడిన అల్పపీడనం బుధవారం అరేబియా సముద్రం వైపునకు వెళ్లిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, ఉపరితల ద్రోణి కొమరిన్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్, తమిళనాడు తీరం మీదుగా పశ్చిమ బంగాళాఖాతంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు స్థిరంగా కొనసాగుతుందని పేర్కొన్నది. రాష్ట్రంలోకి ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 7 వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఏపీలో వాతావరణం ఇలా..
వచ్చే 5 రోజులకు సంబంధించి ఏపీలో వాతావరణ అంచనాలను అమరావతిలోని వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.
రాయలసీమలో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
7 Day Mid-day forecast for Andhra Pradesh in Telugu dated 03.11.2021 pic.twitter.com/PJS2OAJQp6
— MC Amaravati (@AmaravatiMc) November 3, 2021