అన్వేషించండి

Balineni Srinivasa Reddy: ఒంగోలులో వద్దు, మంగళగిరికి ఒక్కరే రండి- బాలినేని జనసేన ఎంట్రీలో సూపర్ ట్విస్ట్

Janasena: ర్యాలీలు వద్దు, ఒంగోలులో చేరికల ప్రోగ్రామ్ అసలే వద్దు అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఈరోజు బాలినేని ఒక్కరే హడావిడి లేకుండా మంగళగిరి కార్యాలయంలో జనసేనలో చేరతారు.

Andhra Pradesh: బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) అనుకున్నది ఒకటి, అయింది మరొకటి అన్నట్టుగా సాగుతోంది ఒంగోలు రాజకీయం. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాసులరెడ్డి భారీ బలప్రదర్శనతో జనసేన(Janasena)లో చేరాలనుకున్నారు. తాను కండువా వేయించుకోడానికి పవన్ దగ్గరకు వెళ్లడం కాదు, పవనే తనకు కండువా వేసేందుకు ఒంగోలు(Ongole) రావాలని కోరుకున్నారు. కానీ చివరకు ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. కనీసం మంగళగిరి వరకు తన అనుచరులతో ర్యాలీగా వెళ్లి పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం నిర్వహించేందుకైనా అనుమతివ్వాలని కోరారు. అదీ కుదరదంది జనసేన అధిష్టానం. దీంతో బాలినేని ఒక్కరే ఒంటరిగా మంగళగిరి వెళ్తున్నారు. జనసేన కండువా మెడలో వేసుకోబోతున్నారు. ఈమేరకు బాలినేనితో జనసేన పార్టీ నేత వేములపాటి అజయ్ కుమార్ ఒంగోలులో చర్చలు జరిపారు. బాలినేని ఒక్కరే మంగళగిరి వెళ్లేందుకు ఒప్పించారు. 

హడావిడి వద్దు..
బాలినేని వంటి సీనియర్ నేత, మాజీ మంత్రి చేరిక ప్రకాశం జిల్లాలో జనసేనకు బలమే. కానీ అది అనూహ్యంగా జరిగిన పరిణామం. బాలినేనికి వైసీపీలో కొనసాగడం ఇష్టం లేదు, అదే సమయంలో ఆయనకు టీడీపీలో చోటు లేదు, ఆ దిశగా ప్రయత్నాలు జరిగినా టీడీపీ నేతలు ఆయన రాకను అడ్డుకున్నారు. ఓ దశలో తనపై ఉన్నవి లేనివి టీడీపీ అధిష్టానానికి కొంతమంది చాడీలు చెప్పారని కూడా బాలినేని సన్నిహితుల వద్ద వాపోయారు. చివరిగా ఆయన జనసేనను ఎంపిక చేసుకున్నారు. అయితే కాస్త ముందుగానే దీనికి సంబంధించి లీకులు వదిలారు బాలినేని. అంతా తాను అనుకున్నట్టుగానే సీన్ క్రియేట్ చేసి, వైసీపీ తనను నమ్మడం లేదని, తనపై తప్పుడు ప్రచారం చేస్తుందనే నిందలు వేసి బాలినేని జనసేనకు దగ్గరయ్యారు. ఆల్రడీ ఓసారి పవన్ ని కలసి వచ్చారు. కండువా పండగకు మాత్రం ఈరోజు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 

టీడీపీ వర్శెస్‌ బాలినేని

బాలినేని జనసేనలో చేరడం ఖాయమైన తర్వాత ఒంగోలులో ఆయన అనుచరులు భారీ ఫ్లెక్సీలు వేశారు. ఈ ఫ్లెక్సీలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఎవరో అనడం కంటే.. టీడీపీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచరులే అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. బాలినేని కూటమిలోకి రావడం ఆయన ప్రత్యర్థి దామచర్లకు ఇష్టం లేదు. తాజా ఎన్నికల్లో ఒంగోలులో దామచర్ల, బాలినేని మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ పోరులో దామచర్ల జనార్దన్ గెలుపొందారు. తన ప్రత్యర్థి అయిన బాలినేని తిరిగి కూటమిలోకి రావడం, మిత్రపక్షమైన జనసేనలో చేరడం ఆయనకు ఇష్టం లేదు. బాలినేని పార్టీ మారినా గత పాపాల నుంచి తప్పించుకోలేరంటూ ఆయన ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి బాలినేని కూడా కౌంటర్ ఇచ్చారు. తాను ఏ పార్టీలో ఉన్నా, అన్యాయాన్ని ప్రశ్నించడం మాత్రం మానుకోను అని తేల్చి చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 

ఇక ఫ్లెక్సీల గొడవపై బాలినేని ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం విశేషం. నగరంలో ఏర్పాటు చేసిన తన ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించేశారని ఆయన ఆరోపించారు. వారిని గుర్తించి శిక్షించాలని ఎస్పీకి కంప్లయింట్ ఇచ్చారు. 

ఓ వైపు బాలినేని, దామచర్ల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంటే, మరోవైపు పార్టీ అధిష్టానాలు శాంతిమంత్రం పఠిస్తున్నాయి. గొడవలు మరింత ముదరకుండా బాలినేని చేరికకు హైప్ ఇవ్వకుండా ఉండాలనుకుంటోంది జనసేన అధిష్టానం. అందుకే ర్యాలీలు వద్దు, ఒంగోలులో చేరికల ప్రోగ్రామ్ అసలే వద్దు అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఈరోజు బాలినేని  ఒక్కరే హడావిడి లేకుండా మంగళగిరి కార్యాలయంలో జనసేనలో చేరతారు. 

Also Read: వైసీపీకి కలసిరాని నెల్లూరు కార్పొరేషన్, గెలుపు సంబరం మూణ్ణాళ్ల ముచ్చటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎనీ ప్లేస్, ఎనీ టైం రెడీ - సమస్యల పరిష్కారంలో లోకేష్‌ ప్రత్యేకత !
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎనీ ప్లేస్, ఎనీ టైం రెడీ - సమస్యల పరిష్కారంలో లోకేష్‌ ప్రత్యేకత !
Dil Raju Appointed As TFDC Chairman: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Congress One Year Rule: రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABPతిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎనీ ప్లేస్, ఎనీ టైం రెడీ - సమస్యల పరిష్కారంలో లోకేష్‌ ప్రత్యేకత !
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎనీ ప్లేస్, ఎనీ టైం రెడీ - సమస్యల పరిష్కారంలో లోకేష్‌ ప్రత్యేకత !
Dil Raju Appointed As TFDC Chairman: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Congress One Year Rule: రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
Yadadri Accident News: యాదాద్రి జిల్లాలో తీవ్ర విషాదం- చెరువులోకి కారు దూసుకెళ్లి ఐదుగురు మృతి 
యాదాద్రి జిల్లాలో తీవ్ర విషాదం- చెరువులోకి కారు దూసుకెళ్లి ఐదుగురు మృతి 
Pushpa 2 Collection Day 2: రెండో రోజూ అల్లు అర్జున్ జోరు... బాక్సాఫీస్ బరిలో 400 కోట్లు దాటేసిన 'పుష్ప 2', టోటల్ ఎంతో తెలుసా?
రెండో రోజూ అల్లు అర్జున్ జోరు... బాక్సాఫీస్ బరిలో 400 కోట్లు దాటేసిన 'పుష్ప 2', టోటల్ ఎంతో తెలుసా?
Allu Arjun: మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Embed widget