Nellore News: నెల్లూరు జిల్లాలో కరోనా భయం... మూతపడ్డ సూళ్లూరుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
నెల్లూరు జిల్లాలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. సూళ్లూరుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకడంతో ఆఫీస్ ను మూసివేశారు. శానిటైజ్ చేసి తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో కోవిడ్ కేసుల వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం సెంచరీ దాటి పరుగులు పెడుతున్నాయి కేసులు. ఒమిక్రాన్ భయాలేవీ లేకపోయినా పాత వేరియంట్ జిల్లా వాసుల్ని ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కోవిడ్ వ్యాప్తి మాత్రం తగ్గడంలేదు. తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కోవిడ్ కారణంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి తాళం పడింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్టు నిర్థారణ కావడంతో ఆఫీస్ కి తాళం వేశారు అధికారులు. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆఫీస్ ని శానిటైజ్ చేసి తిరిగి తెరిచే ప్రయత్నం చేస్తామంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే.. సంతకాలు, వేలిముద్రలు, దస్తావేజులు.. ఇలా చాలా పనులు కోవిడ్ వ్యాప్తికి అవకాశం కలిగించేవే. దీంతో అధికారులు వెంటనే ఆఫీస్ మూసివేశారు.
Also Read: ఏపీలో కొత్తగా 984 కోవిడ్ కేసులు... 5 వేలు దాటిన యాక్టివ్ కేసులు
ప్రికాషన్ డోసు పంపిణీ
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోన్న వేళ ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభమైంది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లుపైబడి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కొవిడ్ టీకా మూడో డోసు ఇస్తున్నారు. దిల్లీ, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ అర్హులైన వారంతా ఈ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు టీకా కేంద్రాలకు తరలివస్తున్నారు. మరి ఈ ప్రికాషన్ డోసు తీసుకునేవారు ఇవి గమనించండి.
కొత్తగా రిజిస్ట్రేషన్ వద్దు..
ప్రికాషన్ డోసు లబ్ధిదారులు ప్రత్యేకంగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లేదని కేంద్ర ఆరోగ్య శాఖ్య పేర్కొంది. కొవిన్ పోర్టల్‌లోనే మొదటి డోసు, రెండో డోసుతో పాటు ప్రత్యేకంగా ప్రికాషన్ డోసు అనే ఆప్షన్ ఉంటుదని తెలిపింది. సెకండ్ డోసు వ్యాక్సిన్ తీసుకుని 9 నెలలు గడిచిన వారు.. ఈ ప్రికాషన్ డోసు కోసం రిజిస్టర్ చేసుకోవచ్చని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: ఏపీలో నైట్ కర్ఫ్యూ... థియేటర్లలో 50 శాతం సిట్టింగ్... కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
1.05 కోట్ల ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల ఫ్రంట్లైన్ వర్కర్లు, 2.75 కోట్ల 60 ఏళ్ల పైబడినవారు ప్రికాషన్ డోసు వేసుకోనున్నారని అంచనా. ప్రికాషన్ డోసు కింద గతంలో తీసుకున్న వ్యాక్సిన్నే ఇవ్వనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కొవాగ్జిన్ తీసుకున్న వారికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్నవారికి కొవిషీల్డ్నే ఇవ్వనున్నారు.
ఏ వ్యాక్సిన్ ఇస్తారు?
ప్రికాషన్ డోసుకు ప్రస్తుతం సరైన నిర్వచనం లేదు. టీకా రెండు డోసులు తీసుకున్నవారు.. మూడో డోసుగా వేరే రకం వ్యాక్సిన్ను తీసుకోవడాన్ని ప్రికాషన్ డోసు అనొచ్చని కొవిడ్ వ్యాక్సినేషన్ సాంకేతిక బృందం అంటోంది. ఉదాహరణకు కొవాగ్జిన్ టీకాలు తీసుకున్నవారికి మరో డోసుగా.. ఇతర వ్యాక్సిన్లు ఇస్తారు.
Also Read: ఒమిక్రాన్ అయినా ఏమైనా.. తమిళనాడు తగ్గేదేలే! జల్లికట్టుకు పచ్చజెండా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి