News
News
X

Nellore: జనాలు బుద్ధివాడట్లేదు... ఓటీఎస్ పై ఎంపీడీవో వివాదాస్పద వ్యాఖ్యలు... వైరల్ అవుతోన్న వీడియో

ఓటీఎస్ పై ప్రజలు బుద్ధివాడట్లేదని మర్రిపాడు ఎంపీడీవో సుస్మితారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

FOLLOW US: 
Share:

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల ఎంపీడీవో సుస్మితారెడ్డి ఓటీఎస్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మర్రిపాడు సచివాలయంలో జరిగిన ఓటిఎస్ అవగాహన కార్యక్రమంలో ఆమె ప్రజలు బుద్ధి వాడట్లేదంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వానికి ప్రజలపై ప్రేమ ఉంటే ఉచిత పట్టాలు, రుణమాఫీలు ఎందుకు ఇవ్వలేదంటూ ఎంపీడీవో విమర్శలు గుప్పించారు. ప్రజలు తమ బుద్ధిని ఉపయోగించాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోనే అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైసీపీ పాలనను ప్రశంసల్లో ముంచెత్తారు. ఇటీవలే ఎంపీడీవో ఓటీఎస్ పై ఇచ్చిన ఓ ఆడియో మెసేజ్ వైరల్ గా మారింది. ఓటీఎస్ కి డబ్బులు చెల్లించని వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయొద్దంటూ ఆమె అధికారుల గ్రూపుల్లో ఆడియో మెసేజ్ పెట్టారు. అది కాస్తా వైరల్ గా మారడంతో జాయింట్ కలెక్టర్ ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ క్రమంలో మరోసారి ఓటీఎస్ పై ఎంపీడీవో సుస్మితారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలంగా మారింది. 

Also Read:  2024 తరవాత పొలిటికల్ రిటైర్మెంట్ .. సోము వీర్రాజు నిర్ణయం !

ఓటీఎస్ పై టార్గెట్లు 

మర్రిపాడు ఎంపీడీవో సుస్మితారెడ్డి ఓటీఎస్ కు గతంలో టార్గెట్ పెట్టారు. గ్రామ కార్యదర్శుల, వీర్వోలకు, డిజిటల్ అసిస్టెంట్లకు టార్గెట్లు పెడుతూ మూడ్రోజుల క్రితం ఓ హుకూం జారీ చేశారు. ప్రతి సచివాలయంలో రోజుకు కనీసం పది చొప్పున ఓటీఎస్​లు పూర్తి చేయాలన్నారు. ఓటీఎస్ కట్టని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు పెట్టవద్దన్నారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ ఆడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్ వివరణ ఇవ్వాలని మర్రిపాడు ఎంపీడీవో సుస్మితా రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎంపీడీవో తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఓ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వాన్ని విమర్శించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

Also Read: ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !

Also Read: ఓటీఎస్ బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదు... మైక్ కనిపిస్తే చాలు చంద్రబాబు రెచ్చిపోతారు.... మంత్రి బొత్స ఫైర్

Also Read:  ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Dec 2021 06:30 PM (IST) Tags: AP News Viral video nellore one time settlement Marripadu mpdo AP OTS

సంబంధిత కథనాలు

AP High Court On Advisers :  ప్రభుత్వ సలహాదారుల రాజ్యాంగ బద్ధతపై తేలుస్తాం, హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP High Court On Advisers : ప్రభుత్వ సలహాదారుల రాజ్యాంగ బద్ధతపై తేలుస్తాం, హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Breaking News Live Telugu Updates: ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా, లక్ష్మీనారాయణతో మంతనాలు 

Breaking News Live Telugu Updates: ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా,  లక్ష్మీనారాయణతో మంతనాలు 

Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ కేడెట్స్- ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ

Republic Day Celebrations 2023:  రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ కేడెట్స్- ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

Anganwadi Jobs: వైఎస్సార్‌ కడప జిల్లాలో 115 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలివే!

Anganwadi Jobs: వైఎస్సార్‌ కడప జిల్లాలో 115 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలివే!

టాప్ స్టోరీస్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్

Unstoppable NBK PSPK: దేశంలోనే తొలిసారి - కొత్త రికార్డులు సృష్టిస్తున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్!

Unstoppable NBK PSPK: దేశంలోనే తొలిసారి - కొత్త రికార్డులు సృష్టిస్తున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్!

Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్‌మెంట్ రేపే!

AP Govt Employees Union : జీతాల చెల్లింపుల చట్టబద్దతపై మరోసారి గవర్నర్ ను కలుస్తాం- సూర్యనారాయణ

AP Govt Employees Union : జీతాల చెల్లింపుల చట్టబద్దతపై మరోసారి గవర్నర్ ను కలుస్తాం- సూర్యనారాయణ