అన్వేషించండి

Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం

అరుదైన జన్యు వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA TYPE-1)తో పోరాడుతున్న చిన్నారి పునర్విక ఘటనపై చలించిపోయిన మంత్రి నారా లోకేష్ ప్రాజెక్టు పునర్విక చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఒక మానవీయ కోణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అరుదైన జన్యు వ్యాధితో పోరాడిన  చిన్నారి పునర్విక ఘటన మంత్రిని తీవ్రంగా ఆలోచింపజేసింది. ఈ క్రమంలో అరుదైన జన్యు వ్యాధులతో బాధపడే పిల్లలందరికీ అండగా నిలిచేందుకు ఆయన 'ప్రాజెక్ట్ పునర్విక'ను అధికారికంగా ప్రకటించారు. అత్యంత ఖరీదైన చికిత్సలు అందక ఏ చిన్నారి ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.

ఈ ప్రాజెక్ట్ పునర్వికలో భాగంగా అరుదైన వ్యాధులకు అవసరమైన ఖరీదైన మందుల ధరలను తగ్గించేందుకు అంతర్జాతీయ ఔషధ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని మంత్రి లోకేష్ నిర్ణయించారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన విధానపరమైన మద్దతును పొందేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేవలం చికిత్స అందించడమే కాకుండా, వైద్యులు, నిపుణులతో కలిసి ఈ వ్యాధులకు దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు మానసిక ధైర్యాన్ని అందించేందుకు ఒక ప్రత్యేక సపోర్ట్ సిస్టమ్‌ను కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు చేయనున్నారు. అరుదైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, ప్రతి చిన్నారికి సామాజిక హోదాతో సంబంధం లేకుండా సమానంగా, సులభంగా చికిత్స అందేలా చూడటమే ప్రాజెక్ట్ పునర్విక ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

నారా లోకేష్ ఆలోచనకు కారణం ఈ ఘటన..

అరుదైన జన్యు వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA TYPE-1)తో పోరాడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ మానవీయతతో స్పందించారు. ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన జోల్‌జెన్‌స్మా (Zolgensma) ఇంజెక్షన్ ధర రూ. 16 కోట్లు కాగా, సోషల్ మీడియా ద్వారా ప10 కోట్ల రూపాయల క్రౌడ్ ఫండింగ్ సమకూరింది. మిగిలిన బాధ్యతను మంత్రి లోకేష్ స్వయంగా తీసుకుని, ఈ ఖరీదైన మెడిసిన్‌ను  అమెరికా నుండి తెప్పించడంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో ఏప్రిల్ 18న చిన్నారికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో లోకేష్ స్వయంగా హాజరై పాప తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.

అసలు ఈ SMA Type-1 వ్యాధి, దానికి వాడే ఇంజెక్షన్ ఇంత ఖరీదు ఎందుకు అనే అంశంపై చర్చ జరుగుతోంది. SMA అనేది 10 వేల మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన జన్యు లోపం. పుట్టుకతోనే SMN1 అనే జీన్‌లో వచ్చే మార్పుల వల్ల వెన్నెముకలోని నరాల కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల కండరాలు క్షీణించి పిల్లలు కనీసం ఊపిరి తీసుకోలేక, ఆహారం మింగలేక 2ఏళ్ల వయసులోపే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం ఈ ఇంజెక్షన్ మాత్రమే.

జోల్‌జెన్‌స్మా (Zolgensma) అనేది సాధారణ మందు కాదు. ఇది ఒక అద్భుతమైన బయోలాజికల్ ఇంజనీరింగ్ ప్రక్రియ. ఈ ఇంజెక్షన్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లాగా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు హాని చేయని ఒక వైరస్‌ను వాడుకుని, దాని ద్వారా ఆరోగ్యకరమైన SMN1 జన్యువును నేరుగా వెన్నుపాములోని నరకణాల కేంద్రకంలోకి పంపిస్తారు. అక్కడ ఇది పాడైపోయిన జన్యువు స్థానాన్ని భర్తీ చేసి, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

ఈ ఇంజెక్షన్ ధర 16 కోట్లు ఉండటానికి కారణం దాని తయారీలో ఉండే క్లిష్టత, అది అందించే రిజల్ట్. ఇది జీవిత కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఇచ్చే డోస్. సాధారణ మందులు కేవలం వ్యాధి లక్షణాలను తగ్గిస్తే, ఈ జీన్ థెరపీ వ్యాధి మూలాన్నే సరిచేస్తుంది. అందుకే దీని తయారీకి అయ్యే పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ ఖర్చుల కారణంగా దీని ధర భారీగా ఉంటుంది. చిన్నారి పునర్విక ప్రాణాల కోసం 10 కోట్లు క్రౌండ్ ఫండింగ్ ద్వారా వచ్చినా, మిగతా రూ.6 కోట్లను నారా లోకేష్ భరించి సమయానికి ఔషధాన్ని అందించడం ద్వారా ఆ కుటుంబంలో ఆశలు చిగురించేలా చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget