Nara Lokesh: జగన్ ఎన్ని అడ్డుంకులు సృష్టించినా యువగళాన్ని నడిపించేది అదే: నారా లోకేష్
Nara Lokesh: ఏపీ సీఎం జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం పాదయాత్ర ఆగేదే లేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
Nara Lokesh: యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తన పాదయాత్ర ఆరంభం కాకూడదని జీవో 1 తెచ్చినా యువగళాన్ని ఆపలేకపోయారని చెప్పుకొచ్చారు. ప్రజల సహకారంతో యువగళం జనగళమై గర్జించిందన్నారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నా జనజైత్ర యాత్రగా ముందుకు సాగిందని గుర్తు చేశారు. మళ్లీ యువగళం ఆరంభిస్తామని చెప్పగానే.. తన శాఖకి సంబంధంలేని, అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో తనను ఏ14గా చేర్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపేర్ల పేరుతో రాజమహేంద్రవరం బ్రిడ్జి మూసేయించారని ఆరోపించారు. సీఎం జగన్ తనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, అక్రమ అరెస్టులు చేసినా తన యువగళం పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు.
అలాగే విజయనగరం కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రదర్శించిన దాష్టీకాన్ని ఖండిస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు. నిర్దాక్షిణ్యంగా బట్టలూడదీసి మరీ విద్యార్థుల పట్ల రాక్షసంగా ప్రవర్తించిన పోలీసుల తీరు దారుణం అంటూ మండిపడ్డారు. కొట్టండి, లోపలేయండి అంటూ పోలీసులకు హుకూం జారీ చేస్తూ చెలరేగిపోయిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
విజయనగరం కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రదర్శించిన దాష్టీకాన్ని ఖండిస్తున్నాను. నిర్దాక్షిణ్యంగా బట్టలూడదీసి మరీ విద్యార్థుల పట్ల రాక్షసంగా ప్రవర్తించిన పోలీసుల తీరు దారుణం. కొట్టండి, లోపలేయండి… pic.twitter.com/ayHHX69Qne
— Lokesh Nara (@naralokesh) September 26, 2023
నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నాడు!
— Lokesh Nara (@naralokesh) September 26, 2023
రోడ్డెక్కిన అంగన్ వాడీలపై అంత కర్కకశమా?
రాష్ట్రం లో దమనకాండను ప్రజలు అంతా గమనిస్తున్నారు...త్వరలోనే ఈ ప్రభుత్వానికి పాడెకడతారు
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా… pic.twitter.com/YGNbNkLz4Z