Nara Lokesh: తాలిబన్ల తాతల్లా.. వైకాపాబన్లు.. సారా నుంచి తుపాకుల వరకూ.. నారా లోకేశ్ కామెంట్స్
పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు ఓ వ్యక్తి దగ్గర నాటుతుపాకులు పట్టుకున్నారు. అయితే దీనిపై నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.
నాటు తుపాకులను విక్రయించినందుకు పశ్చిమ గోదావరి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏలూరుకు చెందిన వెంకటేశ్ సింగ్ అనే వ్యక్తి.. తన ఇంట్లో నాటు తుపాకులు తయారుచేస్తున్నాడని.. అతడి నుంచి కొనుగోలు చేసినట్టు చెప్పాడు. అతడి ఇంట్లో.. తనిఖీ చేయగా.. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 12 నాటు తుపాకులు, 6 ఇతర తుపాకులు, గన్ పౌడర్, 33 కిలోల చిన్న ఇనుప షాట్లు దాడిలో స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవి కిరణ్ చెప్పారు.
తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైకాపాబన్లు. వాళ్లు ఓపీయం (నల్లమందు) ఒక్కటే పండిస్తారు. వైకాపాబన్ల పాలనలో వాలంటీర్ వాసు సారా తయారీ నుంచి మొదలై, నేడు నాటు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేసారు.(1/2) https://t.co/esIHjXlUAM
— Lokesh Nara (@naralokesh) September 2, 2021
అయితే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఏపీలోనూ వైసీపీ నాయకులు.. తాలిబన్ల తాతల్లా తయారయ్యారంటూ నారా లోకేశ్ విమర్శించారు. వైసీపీ శ్రేణులను తాలిబన్లతో పోలుస్తూ.. వైకాపాబన్లు అంటూ పేరుపెట్టారు. సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. 'తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైకాపాబన్లు. వాళ్లు ఓపీయం (నల్లమందు) ఒక్కటే పండిస్తారు. వైకాపాబన్ల పాలనలో వాలంటీర్ వాసు సారా తయారీ నుంచి మొదలై, నేడు నాటు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేసారు.' అని ట్వీట్ చేశారు.
చంద్రబాబు నెలకొల్పిన మెడ్‌టెక్ జోన్‌లో కరోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే.. జగన్ విధ్వంసక పాలనలో ఫ్యాక్షన్ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్రా అయ్యాయంటూ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వెంకటేశ్ అనే వ్యక్తి 18 నాటు తుపాకులు తయారు చేయగా.. అతన్ని పోలీసులు పట్టుకున్న న్యూస్ క్లిప్పింగ్‌ను తన ట్వీట్‌కు జత చేశారు నారా లోకేశ్.
మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మహిళలకున్న నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తోందంటో మరో ట్వీట్ కూడా చేశారు లోకేశ్. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ నాయకుల నిర్బంధం, అక్రమ అరెస్టుల పై పెడుతున్న శ్రద్ధ మహిళల రక్షణ కోసం పెట్టాలంటూ మండిపడ్డతూ కొన్ని ఫోటోలు జత చేశారు.
ఇంత కాలం దిశ చట్టాన్ని @ysjagan రాజకీయ లబ్ది కోసం వాడుకున్నారని, మహిళల్ని మోసం చేసారని స్వయంగా హోంమంత్రి @SucharitaYSRCP గారు అంగీకరించారు. హోంమంత్రి గారి హక్కులు హరించిన షాడో హోంమంత్రి ఆమెను ఇంటికే పరిమితం చెయ్యడంతో నిజాలు బయటపెట్టడం అభినందనీయం.(1/2)#JusticeForRamya pic.twitter.com/MfYgCskA7x
— Lokesh Nara (@naralokesh) September 2, 2021
Also Read: Crime News: ఏంటమ్మా.. ఇది పద్ధతేనా.. కత్తితో కూరగాయలు కోయమంటే.. అత్తను కోసేశావ్