Nara Lokesh Vs YS Jagan: ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే రాజీనామా - వైఎస్ జగన్‌కు నారా లోకేష్ బంపర్ ఆఫర్
Ursa Lands ఉర్సా కంపెనీ విషయంలో జగన్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. చూపించలేకపోతే క్షమాపణ చెప్పాలన్నారు.

Nara Lokesh challenges Jagan: నారా లోకేష్ రాజీనామా చాలెంజ్ విసిరారు. పోటీగా జగన్ రాజీనామా చేయాల్సింది లేదని క్షమాపణ చెబితే చాలన్నారు. ఈ చాలెంజ్ ఉర్సా క్లస్టర్ అనే కంపెనీ విషయంలో విసిరారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఉర్సా కంపెనీలు రూపాయికి ఎకరం భూములు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అది నిజం కాదని మార్కెట్ రేటుకే ఇచ్చామని నారా లోకేష్ అంటున్నారు. ఓ సారి క్లారిటీ ఇచ్చినా జగన్ ఆపకపోవడంతో మరోసారి నారా లోకేష్ సవాల్ చేశారు.
ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి గారికి కొత్తేమీ కాదు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ - 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు.
#PsychoFekuJagan
— Lokesh Nara (@naralokesh) June 2, 2025
Challenge No. 1@ysjagan గారికి ఓపెన్ ఛాలెంజ్.. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి గారికి కొత్తేమీ కాదు. ఉర్సా… pic.twitter.com/2fJos6TNle
విశాఖపట్నంలోని కాపులుప్పాడలో 56.36 ఎకరాలు, ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు కలిపి మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని ఎకరానికి 99 పైసలు చొప్పున కేటాయించారంటూ ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఆరోపమలు చేస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితేఈ అంశంపై ఉర్సా క్లస్టర్స్ గతంలోనే వివరణ ఇచ్చింది. ఎకరా కోటి రూపాయలు చొప్పున 3.5 ఎకరాలు.. ఎకరా 50 లక్షల రూపాయలు చొప్పున 56.5 ఎకరాల భూమిని తీసుకున్నట్లు తెలిపింది. ఉర్సా టీమ్ సభ్యులకు సిలికాన్ వ్యాలీలో 1995 నుంచి సంస్థలను నెలకొల్పిన అనుభవం ఉందని పేర్కొంది.FDI ద్వారా పెట్టుబడులు పెడుతున్నట్లు ఉర్సా క్లస్టర్‌కు చెందిన సతీష్ అబ్బూరి మీడియాకు తెలిపారు.
భారత దేశ నిబంధనల ప్రకారం, ఇక్కడ కంపెనీ రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్పటంతో, టెంపరరీ అడ్రెస్‌తో రిజిస్ట్రేషన్ చేసామని.. అప్రూవల్ అయిన తరువాత కొత్త ఆఫీసు ప్రారంభిస్తామన్నారు. రెండేళ్లలో పెట్టుబడులు పెట్టకపోతే భూములు వెనక్కి తీసుకోవచ్చన్న క్లాజ్ ఉందన్నారు. ఆ భూముల్ని ఇతర అవసరాలకు వినియోగించినా వెనక్కి తీసుకోవచ్చన్నారు. అటు ఉర్సా క్లస్టర్స్, ఇటు ప్రభుత్వం తమకు భూములు కేటాయించిన ధరలపై ఆదారాలు చూపిస్తున్నా... వైసీపీ వైపు నుంచి మాత్రం.. రూపాయికే ఎకరం అనే వాదన .. ప్రచారం మాత్రం ఆగడం లేదు. దాంతో లోకేష్ సవాల్ చేశారు.





















