Jawan video: జవాన్ భూమి కబ్జా చేసిన వైసీపీ నేత- కశ్మీర్ నుంచి లోకేష్‌కు రిక్వెస్ట్ - వీడియో వైరల్
Nara Lokesh: వైసీపీ నేతలు తన భూమిని కబ్జా చేశారని ఓ జవాన్ లోకేష్‌కు వీడియో ద్వారా ఫిర్యాదు చేశారు. తన భూమిని కాపాడాలని కోరారు.

YCP leaders encroached jawan Land : దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతూంటే ఇక్కడ తన కుటుంబానికి చెందిన భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని ఓ జవాన్ నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారు. నరసింహమూర్తి అనే జవాన్ బీఎస్ ఎఫ్ జవాన్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు.
నరసింహమూర్తి భార్య, మామకుచెందిన భూమిని వైసీపీకి చెందిన నాగరాజు అనే వ్యక్తి కబ్జా చేశాడని వీడియో రిలీజ్ చేశారు. మామ భూమి లో సాగు చేయడానికి పోతే వాళ్ళ మీద దాడులు చేస్తున్నాడని ఎన్ని సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగిన ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. కోర్టు తీర్పు ఇచ్చిన ఆర్డర్ కాపీ , పిల్ ప్రతి డాక్యుమెంట్ కూడా మాతో ఉన్నాయన్నారు. అతని వద్ద ఏ డాక్యుమెంట్ కూడా లేవు మా భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వే నంబర్ 366-6, 366-7, 366-8, 366-9. స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళకు న్యాయం జరగట్లేదని.. రేయింబవళ్లు లు పాకిస్తాన్ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం నేను కాపలాకాస్తుంటే నా ఫ్యామిలీకి రక్షణ లేకుండా పోతుందోని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని లోకేష్ ను కోరారు.
నమస్తే సార్ నేను డి. నరసింహమూర్తి. బి ఎస్ ఎఫ్(BSF) జవాను జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నను. హుడుగురు ( vi),
— Swathi Reddy (@Swathireddytdp) June 2, 2025
హాలుకూరు(po), మడకశిర తాలూకా, శ్రీ సత్య సాయి జిల్లా,
సారు నా భార్య వాళ్ళ నాన్న భూమిని YSR ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు అనే అతను మా భూమినీ కబ్జా చేయడం… pic.twitter.com/0WlxqE9FT2
జనావ్ల కుటుంబాలకు చెందిన భూముల్నికబ్జా చేస్తున్న ఘటనలు ఇటీవలపెరిగిపోయాయి. కడపలో నిర్వహించిన మహానాడు వద్దకు ఓ జవాన్ వచ్చి....లోకేష్ కు మొర పెట్టుకున్నారు. తన భూమిని కాపాడాలని కోరారు. దానికి లోకేష్.. వ్యక్తితంగా ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
I will personally take care of this issue and ensure justice is served to this brother of mine. https://t.co/CqXZ9BD03o
— Lokesh Nara (@naralokesh) May 29, 2025
జవాన్లు సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతల్లో ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం వారి కుటుంబాలకు చెందిన భూముల్ని కొంత మందికబ్జా చేస్తున్నారు. వరుసగా సైనికల భూముల వివాదాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో ప్రత్యేక డ్రైవర్ నిర్వహించి అయినా వారి భఊ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.





















