CM Jagan : చంద్రబాబు, పవన్ నా వెంట్రుక కూడా పీకలేరు : సీఎం జగన్
Jagananna Vasathi Deevena : ప్రజల దీవెనలతో "జగన్ అనే నేను" ఈ స్థాయికి వచ్చానని సీఎం జగన్ అన్నారు. నంద్యాల సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Jagananna Vasathi Deevena : నంద్యాల సభలో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై విరుచుకుపడ్డారు. తన మీద ఎన్ని కుట్రలు పన్నినా వెంట్రుక కూడా పీకలేరంటూ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం(Ysrcp Govt)పై రాష్ట్రంలో చేడుగా ప్రచారం చేయడమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా చేడుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కడుపు మంట అసూయతో బీపీ పెరిగి గుండె పోటుతో పోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష నేతలు పార్లమెంట్(Parliament) లో వారి రాష్ట్రాల్లోని ప్రభుత్వాల గురించి గొప్పగా చెబుతున్నారని సీఎం జగన్(CM Jagan) గుర్తుచేశారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే మన ప్రతిపక్ష నేతలు ఏపీ గురించి పార్లమెంట్ లో చేడుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
జగనన్న వసతి దీవెన నిధులు విడుదల
ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలలో పర్యటిస్తున్నారు. నంద్యాల(Nandyal) బహిరంగ సభలో పాల్గొన్న జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులు తల్లుల ఖాతాల్లో జమచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్ల నగదును జమ చేశారు. ఈ సభలో మాట్లాడుతూ పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందని చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు మేనమామగా చదివించే బాధ్యత తీసుకున్నానని తల్లిదండ్రులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. టీడీపీ(TDP) నేతల కడుపు మంట, అసూయకు మందే లేదన్నారు. పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో తక్కువగా ఉన్న జీఈఆర్, పిల్లల సంఖ్యను వైసీపీ ప్రభుత్వం గణనీయంగా పెంచిందని సీఎం జగన్ అన్నారు.
బెదిరింపులకు భయపడను
నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేశామని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ బడులకు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రాష్ట్రం పరువు కోసం ఆరాటపడుతుంటే ఏపీలో మాత్రం దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాష్ట్రం పరువుతీస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి బెదిరింపులు తననేమీ చేయలేవన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యానని జగన్ అన్నారు. ప్రజల దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చానని గుర్తు చేశారు.