AP Rains Alert: రేపు ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు సోమవారం నాడు ఏపీని తాకనున్నాయి. రాయలసీమలోకి రుతుపవనాలు మే 26న ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rains In Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. ఇటీవల కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) చురుకుగా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు సోమవారం (మే 26న) ఏపీని తాకనున్నాయి. మరో 24 గంటల్లో రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దాని ప్రభావంతో రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ తెలిపారు. 2, 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం వెల్లడించింది.
తీరం వెంట బలమైన ఈదురుగాలులు
మంగళవారం నాటికి పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఇప్పటినుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
రేపు అల్లూరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,కర్నూలు,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. pic.twitter.com/8Qkaf01Umy
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 25, 2025
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆదివారం రాత్రి వర్షం కురుస్తోంది. సూర్యపేట, ఖమ్మం జిల్లాల్లోనూ వర్షం పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. హైదరాబాద్ రాత్రి 9 గంటల వరకు వర్షం పడదని, తరువాత అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మే 24న కేరళలో ప్రవేశించాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 8 రోజుల ముందుగా కేరళలో ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. గతంలో మే 23, 2009న సైతం ఇలానే రుతుపవనాలు కాస్త ముందుగా కేరళలో ప్రవేశించాయి. దాంతో ఏపీలోకి సైతం నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే ప్రవేశిస్తున్నాయి. దీని ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు త్వరగా ప్రారంభం కావడంతో పాటు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
#WATCH | South West Monsoon has advanced in Karnataka.
— ANI (@ANI) May 25, 2025
The Met department has issued a red alert in the coastal belt—rough seas, relentless rain, gusty winds, and uprooted trees can be seen in Dakshin Kannada. pic.twitter.com/IemHVCFh11
2009 నుంచి రుతుపవనాలు కేరళను తాకిన తేదీలు
2009 మే 23
2010 మే 31
2011 మే 29
2012 జూన్ 5
2013 జూన్ 1
2014 జూన్ 6
2015 జూన్ 5
2016 జూన్ 8
2017 మే 30
2018 మే 29
2019 జూన్ 8
2020 జూన్ 1
2021 జూన్ 3
2022 మే 29
2023 జూన్ 8
2024 మే 30






















