Palnadu Double Murder: పల్నాడులో జంట హత్యలు, పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు చేసిన పోలీసులు
Pinnelli Ramakrishna Reddy | పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యల ఘటనలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Two TDP activists killed by rivals in Macherla | పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో శనివారం జరిగిన జంట హత్యల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలపై కేసు నమోదు అయింది. గుండ్లపాడు జంట హత్యల ఘటనలో 30 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ6గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పేర్లను చేర్చారు. ఈ కేసులో ఏ1 గా జవిశెట్టి శ్రీను, ఏ2గా తోట వెంకటరావు, ఏ3 గా తోట గురువయ్య, ఏ4 గా నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు ఉన్నారు.
పల్నాడులో టీడీపీ కార్యకర్తల హత్య
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు వద్ద గుండ్లపాడుకు చెందిన కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు అనే టీడీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు దారుణంగా హత్యచేశారు. తెలంగాణలోని హుజూర్ నగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన వీరిద్దరూ బైకు మీద వెళ్తుండగా స్కార్పియోతో కొందరు స్కార్పియో వాహనంతో ఢీకొట్టారు. అనంతరం వారిని అలానే కొంతదూరం ఈడ్చుకెళ్లారు. తరువాత స్కార్పియో కింద కొన ఊపిరితో ఉన్నట్లు గమనించి రాళ్లతో మోది హత్యచేశారు నిందితులు. అనంతరం వాహనాన్ని అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారని తెలిసిందే.
మాచర్లలో పోలీసుల ప్రక్షాళన జరగాలి: ఎమ్మెల్యే జూలకంటి
మాచర్ల: పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన జంట హత్యలపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పోలీసు శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఇప్పుటికి కింది స్థాయి పోలీసులు వైసిపి తొత్తులుగా పని చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీసు శాఖను ప్రక్షాలన చేయాలన్నారు.
‘సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా అరాచకాలు చేసిన వారిపై సరైన చర్యలు లేవు. గత ప్రభుత్వం లో తప్పులు చేసిన వారికి సరైన శిక్షలు లేవు. గ్రామాలలో చిన్నపాటి గొడవలను మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రెచ్చగొడుతున్నారు. వైసీపీ వారికి 7-0 చూపిస్తా. మృతుల కుటుంబాలకు టిడిపి అండగా ఉంటుందని’ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి భరోసా ఇచ్చారు.





















