అన్వేషించండి

అవినీతి ఆరోపణలతో ఎస్సై సస్పెండ్- అవమాన భారంతో వెంటనే రాజీనామా!

అవినీతి ఆరోపణలతో సస్పెండైన ఎస్సై రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. విధుల్లో కొనసాగుటకు తాను అనర్హుడినంటూ డీజీపీ లేఖ రాశారు. ప్రస్తుతం ఆ లేఖ నెట్టింట వైరల్ గా మారింది.

ఏలూరు జిల్లా ముసునురు ఎస్సై రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 10న నూజివీడు పరిధిలోని ముసునూరు స్టేషన్‌లో ఎస్సైగా లక్ష్మీ నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో కొవ్వూరు ఎస్సైగా పని చేసే వారు. అయితే తీవ్ర అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం ఆయనను వీఆర్ లో పెట్టింది. ఇటీవలే లక్ష్మీ నారాయణకు ముసునూరు మండల పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా పోలీసు ఉన్నత అధికారులు నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లేఖ..

అవినీతి ఆరోపణల కేసులో లక్ష్మీ నారాయణనను డీఐజీ ఉత్తర్వుల మేరకు సస్పెండ్ చేశారు. వీఆర్‌లో ఉండి శిక్ష అనుభవించి, మళ్లీ సస్పెండ్ కావడంతో లక్ష్మీ నారాయణ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. అందుకే ఇక పోలీసుగా కొనసాగలేనంటూ.. రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీకి లక్ష్మీ నారాయణ లేఖ రాశారు.

లక్ష్మీ నారాయణ 2009 బ్యాచ్ కు చెందిన అధికారి. 12 ఏళ్లుగా పోలీసు శాఖ విధులు నిర్వర్తిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో సస్పెండ్ కావడంతో మనోవేదన, అసహనంతో లక్ష్మీ నారాయణ రాజీనామా చేయడం ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీ నారాయణ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్సై ఉదంతం ప్రజలకు తెలియడంతో లక్ష్మీ నారాయణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 


అవినీతి ఆరోపణలతో ఎస్సై సస్పెండ్- అవమాన భారంతో వెంటనే రాజీనామా!
అవినీతి ఆరోపణలతో ఎస్సై సస్పెండ్- అవమాన భారంతో వెంటనే రాజీనామా!

 

లేఖలో ఏముందంటే..?

లక్ష్మీ నారాయణ రాసిన లేఖలో ఏముందంటే.. " 2009 సంవత్సరంలో సబ్ ఇన్ స్పెక్టర్ గా సివిల్ విభాగంలో సెలెక్ట్ అయ్యాను. నా పేరు యు. లక్ష్మీ నారాయణ. SI. NO. 2195. ఈ రోజున అనగా 16.09.2022వ తేదీన C.No. 10/P1/2022, P.O.No. 560/2022 ప్రకారం సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఆర్డర్ కాపీని అందుకున్నాను. గతంలో కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో G.No. 27/2022 కేసులో నేను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాను. అలానే డిపార్ట్‌మెంట్‌కు వచ్చేముందునే సస్పెన్షన్ ఆర్డర్స్ లాంటివి ఎదుర్కొనే పరిస్థితి నాకు ఎదురైంది. అందుకే డిపార్ట్‌మెంట్ నుంచి తప్పుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ రోజు రానే వచ్చింది. కాబట్టి అటు వంటి అవినీతి ఆరోపణలో భాగంగా నేను సస్పెన్షన్ ఆర్డర్స్ అందుకుని, ఇంకా డిపార్ట్‌మెంట్‌లో కొనసాగడానికి మనసు అంగీకరించటం లేదు. అలాగని ముందుగా నిర్ణయించుకున్న విధంగా నామనస్సాక్షి చంపుకుని ఈ ఉద్యోగంలో విధులు నిర్వర్తించలేను.

ఏది ఏమైనప్పటికీ నేను నైతిక బాధ్యతకు కట్టుబడి, నేను ముందుగా నా మనస్సును చెప్పినట్టు నిర్ణయించుకున్న విషయానికి కట్టుబడి ఉన్నాను. కావున నేను సస్పెండ్ అయిన తర్వాత భవిష్యత్‌లో విధులు నిర్వర్తించలేను. నా మనస్సు కూడా అంగీకరించదు. ఇక ఈ ఉద్యోగంలో కొనసాగటానికి నేను అనర్హుడను. నైతిక బాధ్యత వహిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను." అని ముసునురు ఎస్సై లక్ష్మీ నారాయణ డీజీపీ లేఖ రాసి రాజీనామా చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చంచల్‌గూడ జైలుకు కేటీఆర్‌- బాల్క సుమన్‌కు పరామర్శ
చంచల్‌గూడ జైలుకు కేటీఆర్‌- బాల్క సుమన్‌కు పరామర్శ
Janhvi Kapoor: 'పెద్ది'గాడి విజయం కోసం 3500 మెట్లు ఎక్కిన హీరోయిన్... తిరుమలలో జాన్వీ కపూర్
'పెద్ది'గాడి విజయం కోసం 3500 మెట్లు ఎక్కిన హీరోయిన్... తిరుమలలో జాన్వీ కపూర్
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
PV Sunil Kumar IPS Challenges Raghurama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు పోటీగా పీవీ సునీల్ కుమార్ - నెలాఖరులో రిటైర్ అవగానే ఇక రాజకీయమే ?
రఘురామకృష్ణరాజుకు పోటీగా పీవీ సునీల్ కుమార్ - నెలాఖరులో రిటైర్ అవగానే ఇక రాజకీయమే ?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
TDP Janasena BJP Seat Sharing Formula: ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
West Bengal TMC Political Crisis 2026: బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
Peddi Premiere Collections: రామ్ చరణ్ 'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్... ఇండియాలో ఓజీ, ధురంధర్ 2 తర్వాత
రామ్ చరణ్ 'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్... ఇండియాలో ఓజీ, ధురంధర్ 2 తర్వాత
Trump Iran War Powers: ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! ఇరాన్‌పై యుద్ధ అధికారులకు బ్రేక్‌! అమెరికా అధ్యక్షుడిపై సొంతపార్టీలోనే తిరుగుబాటు! 
ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! ఇరాన్‌పై యుద్ధ అధికారులకు బ్రేక్‌! అమెరికా అధ్యక్షుడిపై సొంతపార్టీలోనే తిరుగుబాటు! 
DK Shivakumar First Cabinet Meeting:డీకే శివకుమార్ మార్క్ పాలన! తొలి కేబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు!
డీకే శివకుమార్ మార్క్ పాలన! తొలి కేబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు!
Embed widget