Murali Mohan : అరచేతిని అడ్డుపెట్టి చంద్రుడ్ని ఆపలేరు - త్వరలోనే గ్రహణం వీడుతుంది - మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్టుపై మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అరచేతిని అడ్డు పెట్టి చంద్రుడ్ని ఆపలేరన్నారు.
Murali Mohan : 74 సంవత్సరాలు ఉన్న ఒక మంచి ముఖ్య మంత్రిని జైల్లో పెట్టడం అన్యాయమని మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. వెంటనే ఆయన విడుదల కావాలన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఇంకా మంచి పనులు చేయాని ఆకాంక్ష వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి సుహాసిని నిరాహారదీక్షా శిబిరాన్ని సందర్శించారు. అరచేయితో సూర్యుని ఆపలేము గ్రహణం విడిచిన వెంటనే వచ్చే కాంతి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసన్నారు. చంద్రబాబు కూడా గ్రహణం విడిచి అలా బయటికి వచ్చి అద్భుతంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు.
గ్రామ స్వరాజ్యాన్ని వైసీపీ సర్కార్ చంపేసింది, 2 గంటల పాటు పవన్ కల్యాణ్ మౌన దీక్ష
ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని పోలవరం ప్రాజెక్టు అమరావతి నగరం ఇవన్నీ కూడా అద్భుతంగా ఆయన గ్రహణం విడిచి బయటికి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తారని తాను నమ్ముతున్నానన్నారు. సైబరాబాద్ నగరాన్ని అద్భుతంగా నిర్మించిన ఘనత చంద్రబాబుదన్నారు. తాను అమెరికా దాటి ఎక్కడ ఆఫీసు పెట్టలేదని.. ఒకవేళ ఇండియాకి వస్తే మొదటిసారి మీ దగ్గరికి వచ్చి ఆఫీసు పెడతాను అని ఆనాడు చంద్రబాబుతో బిల్ గేట్స్ అన్నాడన్నారు.
చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనకు 2 దశాబ్దాలు - అప్పుడేం జరిగిందంటే ?
హైదరాబాద్ కి ఐటి రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు దేనని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ రాగానే ఒకరితో ఒకరు అందరూ లైన్ కట్టి హైదరా బాద్ వచ్చారన్నారు. బిల్ గేట్స్ ని హైదరాబాద్ హైటెక్ సిటీ ఓపెనింగ్ కి చంద్రబాబు పిలిచారని.. 2000 సంవత్సరంలోనే విజన్ 20-20 అని ప్రారంభించిన మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని స్పష్టం చేశారు. హైటెక్ సిటీ పెరుగుతుంటే దానికి కావాల్సిన వసతులన్నీ ముందుగానే ఊహించి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. 20 20 లో ఎలాగో చేయలేకపోయారు దురదృష్టవశాత్తు కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉన్నా 40 వరకు తప్పకుండా చేస్తారు అని నేను నమ్ముతున్నానన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ పార్లమెంట్ దగ్గర దీని గురించి చర్చించామమని.. ఆయన తొందరగా బయటికి రావాలని .. దాంతో పాటు రాజ్ ఘాట్‌కు వెళ్లి అక్కడ ఒక అరగంట వేడుకున్నామన్నారు. చంద్రబాబుకు సన్నిహితుడిగా ముద్ర పడిన మురళీ మోహన్ రాజమండ్రి నుంచి ఓ సారి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.