News
News
X

MP Vijaya Saireddy: బీసీల తోకలు కత్తిరిస్తా అన్న చంద్రబాబు, ఇప్పుడు రూట్ మార్చేశారా !: విజయసాయిరెడ్డి

MP Vijaya Saireddy: టీడీపీ హయాంలో బీసీలను మోసం చేసిన చంద్రబాబు.. నేడు బీసీల ఓట్ల కోసం రోడ్ల మీద తిరుగుతున్నారని ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. 

FOLLOW US: 
Share:

MP Vijaya Saireddy: టీడీపీ హాయాంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హాయాంలో చంద్రబాబు బీసీల తోకల కత్తిరిస్తానంటూ అపహాస్యం చేసి, ఇప్పుడు బీసీల ఓట్లు కోసం రోడ్ల మీద తిరుగుతున్నాడని అన్నారు. రాష్ట్రంలో బీసీలు తెలుగు దేశం పార్టీని నమ్మే పరిస్థితి లేదని, చంద్రబాబు కోసం బలహీన వర్గాల వారు మరోసారి బలి పశువుల కాలేరని చెప్పారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కేవలం ఇద్దరు బీసీలనే రాజ్యసభకు పంపారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడేళ్లలోనే  మొత్తం ఐదుగురు బీసీలను రాజ్యసభ సభ్యులు చేశారని వెల్లడించారు. పలు అంశాలపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆదివారం స్పందించారు.

రాష్ట్ర ప్రజలకు ఎవరిని నమ్మాలో, ఎందుకు నమ్మాలో, ఏ పార్టీకి ఓటు వేయాలో బాగా తెలుసన్నారు. టీడీపీ అనుకూల మీడియాలో రాతలు బాగానే ఉంటాయని, అయితే జన సునామీలో అవి కొట్టుకుపోతాయని 'జగన్నా'థ రథ చక్రాల కింద పడి నలిగిపోతాయని విజయ సాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబుకు నిజంగానే ఇవి చివరి ఎన్నికలు అవుతాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన కేవలం తన సామాజిక వర్గం, తన కుటుంబం కోసమే పనిచేశారని, ఏనాడూ బీసీల కోసం పాటు పడని నేతగా చంద్రబాబు మిగిలిపోతారన్నారు. 2024 ఎన్నికల తరువాత చంద్రబాబుతో పాటు టీడీపీ కూడా రాజకీయాల్లో ఉండదంటూ సెటైర్లు వేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రైవేట్ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. కానీ సీఎంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రం బీసీలకు ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు మాత్రం బీసీలకు పెద్ద దిక్కు అనేలా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు..

"నీకు చిప్ పూర్తిగా పాడైపోయింది చంద్రం! వైసీపీ వాళ్లు మెడ మీద కత్తిపెట్టి టీడీపీలో చేరమని బెదిరిస్తున్నారా? నిన్ను బాగు చేయడం ఎవరి తరం కాదు. అందరూ నీలాగే వేరే పార్టీ వాళ్లను కొనుగోలు చేయరు. నిన్ను ఇలాగే వదిలేస్తే జనానికి పిచ్చెక్కిస్తావ్." అంటూ విజయసాయిరెడ్డి కామెంట్లు చేశారు.

Published at : 04 Dec 2022 11:26 PM (IST) Tags: AP Latest news AP Politics MP Vijaya Saireddy YCP MP Latest News Vijaya Saireddy Fires on TDP

సంబంధిత కథనాలు

Tarak Ratna Health Update : విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి, బెంగళూరు ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు

Tarak Ratna Health Update : విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి, బెంగళూరు ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు

Avinash Reddy :నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారన్న అవినాష్ రెడ్డి !

Avinash Reddy :నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారన్న అవినాష్ రెడ్డి !

సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్

సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్

Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు  

Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు  

Nagayalanka Ysrcp Clashes : వైసీపీలో రచ్చకెక్కిన వర్గవిభేదాలు, నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఫైట్

Nagayalanka Ysrcp Clashes : వైసీపీలో రచ్చకెక్కిన వర్గవిభేదాలు, నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఫైట్

టాప్ స్టోరీస్

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు

Waltair Veerayya Success Event :  వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు