అన్వేషించండి

Hindupuram YSRCP : హిందూపురం టార్గెట్‌గా మంత్రి పెద్దిరెడ్డి రాజకీయాలు - వారం రోజులు అక్కడే మకాం !

Minister Peddireddy : హిందూపురం నియోజకవర్గంలో ఆరు రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నారు. టీడీపీకి బలం ఉన్న 36 పంచాయతీలలో సభలు పెడుతున్నారు.

Hindupuram Peddireddy Ramachandra Reddy :  హిందూపురం నియోజకవర్గంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏకంగా ఆరు రోజుల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ నేతలను ఏకం చేయడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే వారు ఎవరైనా ఉంటే చేర్చుకోనున్నారు. ఆరు రోజుల పాటు హిందూపూర్ నియోజకవర్గం పరిధిలోని 36 పంచాయతీల్లో పర్యటించనున్నారు.   మొదటి రోజు చౌళూరు, తూముకుంట, గోళ్లాపురం, సంతేబిదనూరు, కోటిపి, కిరికెర, బేవినహళ్ళి పంచాయతీలో మంత్రి పర్యటన సాగుతుంది. చౌళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  పెద్దిరెడ్డి మాట్లాడారు. 

బీసీలకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి 
 
ఆరు రోజులపాటు నియోజవర్గం లో పర్యటిస్తానని..   ఎన్ని సార్లు హిందూపూర్ ప్రజలు ఒకే పార్టీని గెలిపించినా హిందూపూర్ ఏమి అభివృద్ధి చెందిందని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు.  బిసిలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి  జగన్ మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు.   బిసి మహిళలను హిందూపూర్ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలు గా నియమించారన్నారు.  ఎన్నికల ముందు చెప్పిన విధంగా పెన్షన్ మూడు వేలు చేశామన్నారు.  బటన్లు నొక్కుతారు కానీ  డబ్బులు ఇవ్వరు అని టిడిపి వారి విష ప్రచారం చేస్తున్నారని  డబ్బులు అకౌంట్ లో వేయడం ఏ రోజు ఆలస్యం కాలేదన్నారు.  తన  50 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఈ స్థాయిలో హామీలు అమలు చేసిన వారిని చూడలేదని చెప్పుకొచ్చారు.  ఇచ్చిన హామీలు అమలు చేసే వైఎస్ జగన్ ను ఆదరించాలా ? లేదా హామీలను మర్చిపోయే చంద్రబాబు చేతిలో మోసపోవాల అనేది ప్రజలు ఆలోచించాలన పిలుపునిచ్చారు.  

పందెం కోళ్లకు వయాగ్రా- సంక్రాంతి బరిలో గెలించేందుకు ప్రమాదకర ఆహారం పెడుతున్న యజమానులు

టీడీపీ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకూ హిందూపురంలో గెలవని మరో పార్టీ 
 
హిందూపురం టీడీపీ కంచుకోటగా ఉంది.  ఎలాగైనా ఈ సారి వైసీపీని గెలిపించాలన్న బాధ్యతను సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు.   ఆరు రోజుల పాటు నియోజకవర్గంలో పట్టణం నుంచి పంచాయితీ వరకు కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరినీ కలవనున్నారు. మండలానికి రెండు రోజుల చొప్పున కేటాయించి ఆరు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గత 20 రోజుల నుంచి మంత్రి వ్యక్తిగత కార్యదర్శి తో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు నియోజకవర్గంలో ఉన్న నేతలందరినీ కలిశారు. ఇటీవల దీపికారెడ్డి అనే నేతను ఇంచార్జుగా పెట్టారు. కానీ ఆమె పనితీరుపై నమ్మకం కుదరలేదు. దీంతో అందరితో మాట్లాడి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు పెద్దిరెడ్డి ఆరు రోజులు మకాం వేస్తున్నారు. 

సింగనమల ఎమ్మెల్యే తిరుగుబాటు- నియోజకవర్గానికి నీళ్ల కోసం పోరుబాట

ప్రస్తుత ఇంచార్జ్ దీపికకు టిక్కెట్ కష్టమేనా ?

నవీన్ నిశ్చల్ తో పాటు ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ప్రస్తుత సమన్వయకర్త దీపిక అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఇంద్రజ, వైస్‌ చైర్మన్‌ బలరాం రెడ్డి కూడా టికెట్‌ కోసం తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్‌ పోటీ చేస్తున్నట్లు స్పష్టం కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త దీపికకు ఇవ్వరని భావిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కూడా దీపికను గెలిపించాలని కోరడంలేదు.  నందమూరి బాలకృష్ణకు ఎవరు గట్టి పోటీ ఇస్తారన్న కోణంలో కూడా తాజాగా సర్వే చేస్తున్నారు. పెద్దిరెడ్డి ఏకంగా ఆరు రోజుల పాటు మకాం వేయాలని నిర్ణయించడంతో బాలకృష్ణ ముందుగానే నియోజకవర్గానికి వచ్చారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు హిందూపురం పురపాలక సంఘం, రూరల్‌ మండల వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
KTR News: ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న
ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
KTR News: ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న
ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న
Best Places for Sankranthi: ఫ్యామిలీతో సంక్రాంతి టైంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే - ఇక్కడో లుక్కేయండి
ఫ్యామిలీతో సంక్రాంతి టైంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే - ఇక్కడో లుక్కేయండి
Lions Enclosure: వీడెవడండీ బాబూ! - గర్ల్ ఫ్రెండ్ మెప్పు కోసం సింహాల బోనులోకి వెళ్లాడు, చివరకు!
వీడెవడండీ బాబూ! - గర్ల్ ఫ్రెండ్ మెప్పు కోసం సింహాల బోనులోకి వెళ్లాడు, చివరకు!
Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం - ఎగిసిపడిన మంటలు, పొగలతో స్థానికుల భయాందోళన
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం - ఎగిసిపడిన మంటలు, పొగలతో స్థానికుల భయాందోళన
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ యోజన పథకం నిధులు విడుదల- దరఖాస్తు చేసుకోనివారు త్వరపడండి
Embed widget