News
News
X

Gudivada Amarnath : ఏపీ భవిష్యత్తును విశాఖ మార్చబోతోంది- మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath : త్వరలో రాజధాని అవుతున్న విశాఖలో పెట్టుబడులు పెట్టాలని సీఎం జగన్ ఇన్వెస్టర్లను కోరారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

FOLLOW US: 
Share:

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు విశాఖ వేదిక కాబోతోందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్, మార్చి 28,29 తేదీల్లో జీ20 సదస్సులు జరగబోతున్నాయన్నారు. త్వరలో వైజాగ్ రాజధాని కాబోతోందని, ముఖ్యమంత్రి కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్టు ఆయనే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా విశాఖ ఎగ్జిక్యూటివ్, అమరావతి లెజిస్లేటివ్, కర్నూలు న్యాయ రాజధానులుగా కొనసాగుతాయని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. డిసెంట్రలైజేషన్ కు కట్టుబడి ఉన్నామని, ఏ ప్రాంతాన్ని చిన్నచూపు చూసే ప్రసక్తి లేదని తెలిపారు. విశాఖపట్నం రాజధాని నిర్ణయం ఇప్పుడు తీసుకుందని కాదన్నారు. ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిలో కనీసం సచివాలయం కూడా సరిగ్గా కట్టలేదని ఎద్దేవాచేశారు.  వర్షం వస్తే సచివాలయంలో తడిసిపోయేపరిస్థితి ఉందని గతంలో తానుచేసిన కామెంట్లు గుర్తు చేశారు. 

దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ అతిపెద్ద రాష్ట్రంగా ఎదిగిందన్నారు. 974కిలమీటర్ల సముద్రతీర్ ఉన్న రెండో అతిపెద్ద రాష్ట్రమని గుర్తు చేశారు. జీఎస్డీపీలో 11.43శాతంతో మూడేళ్లుగా మొదటిస్థానంలో ఉందన్నారు. నీతి ఆయోగ్ కూడా ఏపీ చేపడుతున్న సంస్కరణలను కీర్తిందని తెలిపారు. దేశంలో 11ఇండస్ట్రీయల్ కారిడార్స్ తీసుకొస్తుంటే అందులో మూడు క్లస్టర్లు ఏపీ నుంచి వస్తున్నాయన్నారు అమర్నాథ్. విశా నుంచి చెన్నై.  చెన్నై నుంచి బెంళూరు, బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఇలా మూడు కారిడార్లు రాబోతున్నాయన్నారు. ప్రభుత్వం దగ్గర 49వేల ఎకరాలు భూములున్నాయని, పరిశ్రమలకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం స్కిల్ ఫోర్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

త్వరలో రాజధాని అవుతున్న విశాఖకు రావాలని పెట్టుబడిదారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో ఆహ్వానించారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. తాను కూడా త్వరలో విశాఖ రాజధానికి మారుతున్నానని స్పష్టం చేశారు.  మార్చి 3, 4న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతోందని, అందరూ రావాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ ఎంత ఈజీగా చేయొచ్చో అక్కడికి వచ్చి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. దేశంలో వేగంగా వృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టేందుకు మీ సహకారం కావాలని వ్యాపారవేత్తలను జగన్ ను కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి చాలా ప్రత్యేకతలున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టర్లకు వివరించారు.  భారత్ ను కూడా అంతర్జాతీయంగా ప్రత్యేక స్ధానంలో నిలబెట్టినందుకు ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

ఏపీ వరుసగా మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పెట్టుబడిదారులకు వివరించారు. పరిశ్రమల స్థాపనకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే టాప్ ప్లేసులో ఉన్నామని జగన్ చెప్పారు. ఇప్పటికే ఆరు పోర్టులున్నాయని జగన్ వారికి తెలిపారు. మరో నాలుగు త్వరలో మొదలుపెడతామన్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ప్రారంభించబోతున్నట్లు జగన్ వెల్లడించారు. కేంద్రం దేశంలో మొదలుపెడుతున్న 11 కారిడార్లలో మూడు ఏపీకే రావడం శుభపరిణామం అన్నారు. 48 ఖనిజ నిక్షేపాలకు ఏపీ కేంద్రమని ఇన్వెస్టర్లకు వివరించారు ముఖ్యమంత్రి. ఎలక్ట్రానిక్, తయారీ క్లస్టర్లు ఇప్పటికే ఎన్నో పనిచేస్తున్నాయని పెట్టుబడిదారులకు తెలిపారు. టెక్స్ టైల్, ఫార్మా, ఆటోమొబైల్ క్లస్టర్లు ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయన్నారు

Published at : 01 Feb 2023 09:33 PM (IST) Tags: AP News Gudivada Amarnath CM Jagan Visakhka Investors Summit

సంబంధిత కథనాలు

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడ్రోజులు వానలు -  వాతావరణ కేంద్రం ఇంకా ఏం చెప్పిందంటే?

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడ్రోజులు వానలు - వాతావరణ కేంద్రం ఇంకా ఏం చెప్పిందంటే?

Tiger in Mahabubnagar: ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన తల్లిపులి - నల్లమలలో తిరుగుతున్నట్టు గుర్తింపు! 

Tiger in Mahabubnagar: ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన తల్లిపులి - నల్లమలలో తిరుగుతున్నట్టు గుర్తింపు! 

విధేయ‌త‌+స‌మ‌ర్థ‌త‌= పంచుమ‌ర్తి అనూరాధ, స్ఫూర్తిదాయ‌క ప్ర‌స్థానం

విధేయ‌త‌+స‌మ‌ర్థ‌త‌= పంచుమ‌ర్తి అనూరాధ, స్ఫూర్తిదాయ‌క ప్ర‌స్థానం

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆ రెండు సీట్లు కూడా రావు- మంత్రి రోజా విమర్శలు

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆ రెండు సీట్లు కూడా రావు- మంత్రి రోజా విమర్శలు

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

టాప్ స్టోరీస్

Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు

Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు

దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ

పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ

OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే

OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే