అన్వేషించండి

Dharmana Prasada Rao : ప్రజల కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - వివాదాస్పద చట్టంపై మంత్రి ధర్మాన కీలక ప్రకటన

Andhra News : భూ వివాదాలు లేకుండా చేయడం కోసమే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చామని మంత్రి ధర్మాన చెప్పారు. అభ్యంతరాలను పరిష్కరిస్తామన్నారు.


AP Land Title Act Controversy :  ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  (AP land titling Act 2023) వివాదంపై రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భూ వివాదాలను లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని తెలిపారు.  సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సర్వే పూర్తి అయిన తర్వాత నోటిఫైడ్ చేస్తామన్నారు.  స్టేక్ హోల్డర్స్ ఇచ్చిన అభిప్రాయాలను తీసుకొని రూల్స్ తెస్తాం అన్నారు. ఇది వరకే పలు పిల్స్ హైకోర్టులో పడ్డాయి. హైకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ కూడా అమలు చేస్తామని ప్రకటించారు. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.  రెవిన్యూ అధికార వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, అవినీతి ఉందని ఇలాగే వుండిపోతే ఎలా ? అని ప్రశ్నించారు. దేశంలో, ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ టెక్నాలజీని ఉపయెగించుకొని సమగ్రంగా సర్వే చేస్తాం అని స్పష్టం చేశారు.  ఈ చట్టం పై ఆరోపణలు చేస్తున్నవారు.. చట్టాన్ని ఎందుకు తెస్తున్నామో తెలుసుకోవాలని సూచించారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం 14 శాతం హత్యలు, 60 శాతం నేరాలు కేవలం భూ వివాదాల వల్లే జరుగుతున్నాయని.. అందుకే  భూ వివాదాలు లేకుండా చేయడానికే ఈ చట్టం తెస్తున్నామని చెప్పారు. 

కోర్టుకు వెళ్లే అవకాశం లేదని ప్రచారం చేస్తున్నారని కానీ.. రాష్ట్ర స్థాయి రెవెన్యూ ట్రిబునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని ధర్మాన ప్రసాదరావు చెప్పారు.  ఏపీ భూ హక్కుల చట్టం    అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దీంతో ఏపీ భూహక్కుల చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ద్వారా భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఉంటుందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి . కానీ ఈ చట్టంలో ఉన్న అంశాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని భూములను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయడాన్ని తప్పనిసరి చేసింది .  ప్రస్తుతం దాని అన్ని జిల్లాల్లో రీసర్వేలు చేపడుతోంది. స్థిరాస్తులకు శాశ్వత హక్కు కల్పించేందుకు ,  మరింత సమర్థవంతమైన వివాద పరిష్కారానికి కొత్త వ్యవస్థను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నామని సర్కార్ చెబుతోంది.  ఈ చట్టం అమలుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టిడిపి), న్యాయవాదులు మరియు ఇతర కార్యకర్తల నుండి విస్తృత విమర్శలు వచ్చాయి. వాస్తవానికి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే దానిని రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ చట్టం కీలక ఎన్నికల అంశంగా మారుతోంది. భూ వివాదాలు ఏర్పడితే కోర్టుకు పోయే అవకాశం లేదన్న క్లాజ్ ఉండంతోనే సమస్యలు వస్తున్నాయి.                           

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Daaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP DesamAus vs Ind Sydney Test Day 3 Highlights | సిడ్నీ టెస్టులో భారత్ కు పరాభవం | ABP Desm

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Unstoppable With NBK : క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
Police Notice To Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
Human Metapneumovirus : శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
Embed widget