News
News
వీడియోలు ఆటలు
X

AP News : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వరుసగా జీవోలు - అన్నీ పరిష్కరిస్తామన్న బొత్స !

ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘ నేతలతో సబ్ కమిటీ భేటీ అయింది.

FOLLOW US: 
Share:

AP News : ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘ నేతలతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.  సమావశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.  డీఏలు, గ్రామ గ్రామ  సచివాలయ  ఉద్యోగుల  ప్రొబేషన్ , ఏరియర్స్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ వాటిపై చర్చించారు. అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలుస్తోంది.  అన్ని  అంశాలను  టైం  బాండ్  ఉంది..వచ్చే  నెల  1  నుంచి  జీఓ  లు  వస్తాయని ఉద్యోగ సంఘనేతలకు మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. కొత్త  కొత్త  పీఆర్సీ పై  కూడా  చర్చ జరిగిందని... . సీఎం  తో  చర్చించిన  తర్వాత   కొత్త   పీఆర్సీ కమిటీ  పై  ప్రకటన  ఉంటుంది ఉంటుందని తెలిపారు. మాతో  ఉన్న  సంఘాలను  మాత్రమే  సమావేశం  జరిగిందని..  కొంతమంది  ఉద్యోగ సంఘ  నేతలు  బయట  మాట్లాడితే  తాను స్పందించనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్‌ స్కీమ్‌కు అంగీకరించామన్న వెంకట్రామిరెడ్డి !
 
ఉద్యోగులకు  సంబంధించి  డీఏ  జీఓ  త్వరలో  వస్తుందని ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి ప్రకటించారు.  సీపీఎస్  ఇంప్లిమెంట్  తర్వాత  జాయిన్  అయిన  వాళ్ళకి  ఓపిఎస్   వర్తించేలా  నిర్ణయం  తీసుకున్నారని తెలిపారు.  వచ్చే  కాబినెట్  సమావేశంలో   ఈ  ఉద్యోగులకు  ఓపిఎస్   ఇచ్చేలా నిర్ణయం  తీసుకుంటామని  ప్రకటించారు.  యూనివర్సిటీ  ఉద్యోగులు.. కార్పొరేష్షన్  ఉద్యోగులకు  పదవీవిరమణ  వయస్సు 62   ఉండాలని  కోరాము.. అన్ని   సంఘాలు  కలిసి  వినతి  పత్రం  ఇవ్వాలని  కాబినెట్  సబ్  కమిటీ  కోరిందన్నారు.  ఎంప్లాయ్  హెల్త్  కార్డ్  కు సంబంధించి  జూన్  1  నుంచి   ప్రభుత్వం  నుంచి  ఉద్యోగుల  నుంచి  కంట్రిబ్యూషన్  కట్  అయ్యేలా  నిర్ణయం  తీసుకుంటామని  చెప్పారు.  ప్రతి  అంశానికి  సమస్యకి  టైం  బాండ్  ఉంది..అన్ని  సమస్యలు  త్వరలో   పరిష్కారం  అవుతాయని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 

శుక్రవారం ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం 

 ఏపీలో ఉద్యోగులకు వైసీపీ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, జీత భత్యాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకపోవడం, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి హామీలు నెరవేర్చలేదు. దీంతో ఉద్యోగ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే మార్చి 9 నుంచి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం  చేస్తోంది.   ఇప్పటికైనా ఉద్యోగులందరూ నిర్లక్ష్యం వహించకుండా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమంలో పాలుపంచు కోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నామని, అందరూ హాజరు కావాలని కోరారు.   ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. ఉద్యమం తీవ్రమైతే తాము బాధ్యులం కాదని అన్నారు.  డిమాండ్ల పరిష్కారానికి 47 రోజులుగా నిరసనలు తెలుపుతున్నామని బొప్పరాజు వివరించారు. రెండుసార్లు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యామని, కానీ సమావేశాలతో ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఉద్యమ నేపథ్యంలో, ఈ నెల 28న ఏపీ ఎన్జీవోలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం అవుతున్నట్టు బొప్పరాజు వెల్లడించారు.  పీఆర్సీ, డీఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, పాత బకాయిలు ఎన్నేళ్లకు ఇస్తారో తెలియడంలేదని బొప్పరాజు వాపోతున్నారు.       

శుక్రవారం నుంచి మలి దశ ఉద్యమం 
  
ఈ నెల 28 నుంచి కార్మిక, టీచర్స్, సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామని బొప్పరాజు చెబుతున్నారు.  తాము చాలా ఓపికతో సహనంతో ఉద్యమాన్ని చేస్తున్నామన్నారు. తెలంగాణాలో ఒక్క డీఏ పెండింగ్‌లో లేదని, కానీ ఏపీ లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డీఏ ఊసే లేదన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అంశాలపై సమస్యలు పెంచే కొద్ది పెరుగుతూనే ఉంటాయని పరిష్కారం కావాలని ఆయనంటున్నారు.             

Published at : 27 Apr 2023 07:20 PM (IST) Tags: AP News AP EMPLOYEES Bopparaju Venkateshwarlu Botsa Satyanarayana

సంబంధిత కథనాలు

Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం

Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!