Lokesh Sindhanur Tour: తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా అండగా ఉంటాం - సింధనూరులో నారా లోకేష్ భరోసా
Nara Lokesh: లోకేష్ సింధనూర్ టూర్ భారీ హంగామా మధ్య జరిగింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు కాలేజీని ప్రారంభించారు.

Lokesh Sindhanur tour కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన హంగామా మధ్య సాగింది. శనివారం సింధనూరు చేరుకున్న లోకేష్‌కు తెలుగు ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రులు హెచ్.డి. కుమారస్వామి, సంజయ్ సేథ్‌లతో కలిసి లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింధనూరు వీధులన్నీ జై ఎన్టీఆర్ , జై లోకేష్ నినాదాలతో హోరెత్తాయి.
ఈ పర్యటనలో లోకేష్ కేవలం విగ్రహావిష్కరణతో పాటు, శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ , నూతన వసతి గృహాన్ని కూడా ప్రారంభించారు. అంతకుముందు ఎంజీ సర్కిల్ నుంచి హోసళ్లీ క్యాంపు వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో లోకేష్ స్వయంగా ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. జేడీఎస్ నేత వెంకటరావు నాడగౌడ, స్థానిక ఎమ్మెల్యే హంపన్న గౌడ , ఇతర బీజేపీ నేతలు పార్టీలకతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కర్ణాటక రాయచూర్ జిల్లా సింధనూరులోని హోసళ్లీ క్యాంపులో తెలుగు సంఘం కళ్యాణమండపంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రులు హెచ్.డీ కుమారస్వామి గారు, సంజయ్ సేథ్ గారితో కలిసి ఆవిష్కరించాను. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు సింధనూరు, రాయచూర్ లో… pic.twitter.com/8XOgpCHSsR
— Lokesh Nara (@naralokesh) April 4, 2026
బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు ని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు , పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా మీరు చూపిన అభిమానం మరువలేనిది. సుమారు 53 రోజుల పాటు సింధనూరులో 10 వేల మందితో ర్యాలీలు తీసి మాకు అండగా నిలిచారు. ఆ కష్టకాలంలో మీరు చూపిన ప్రేమే నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది అని పేర్కొన్నారు. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా, వారికి ఆపద వస్తే తెలుగుదేశం పార్టీ ముందుండి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కర్ణాటక తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
కర్ణాటకలోని సింధనూరు పర్యటన సందర్భంగా అక్కడి తెలుగువారి ఘనస్వాగతం జీవితంలో మర్చిపోలేను. ఎంజీ సర్కిల్ నుంచి హోసళ్లీ క్యాంప్ వరకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి గారు, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ గారితో కలిసి ర్యాలీలో పాల్గొనడం గొప్ప అనుభవం.@hd_kumaraswamy… pic.twitter.com/BnAGlIGI2h
— Lokesh Nara (@naralokesh) April 4, 2026
కేంద్ర మంత్రి కుమారస్వామి తెలుగు, కన్నడ ప్రజల మధ్య ఉన్న విడదీయలేని బంధాన్ని కొనియాడారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడి విగ్రహాన్ని తమ ప్రాంతంలో ఆవిష్కరించుకోవడం గర్వకారణమని చెప్పారు. కార్యక్రమం ముగిసే వరకు వేలాది మంది ప్రజలు ఎండను సైతం లెక్కచేయకుండా వేచి ఉండి లోకేష్‌కు వీడ్కోలు పలికారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















