అన్వేషించండి

Chandrababu Amaravati Review: అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

Amaravati : అమరావతి నిర్మాణ పనులపై చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే కీలకమైన పునాది పనులు పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు.

Chandrababu reviews Amaravati works:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం అమరావతిలో  రూ. 57,821 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వీటిని యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడంలో ఎదురైన సవాళ్లను అధిగమించి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.                              

రాజధానిలో అత్యంత కీలకమైన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం  వంటి ఐకానిక్ భవనాల నిర్మాణంతో పాటు ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేవలం భవనాలే కాకుండా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రోడ్ల నెట్‌వర్క్, హౌసింగ్ ప్రాజెక్టులు వేగంగా సాగాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సుమారు  20 వేల మంది కార్మికులు , నిపుణులు పనిచేస్తున్నారని, వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే కీలకమైన పునాది పనులు పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు.                 

ఈ సమీక్షలో ముఖ్యమంత్రి నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ..  అమరావతి నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ పని కాదు, ఇది ఒక  చారిత్రక బాధ్యత . ఈ అద్భుత నగరాన్ని నిర్మించే ప్రతి ఒక్కరూ చరిత్రలో భాగస్వాములు అవుతున్నారు  అని ఉద్ఘాటించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, గ్రీన్ ఎనర్జీ ,అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అమరావతిని ప్రపంచస్థాయి ఫ్యూచర్ సిటీ గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి వారం, నెలవారీ ప్రణాళికలు  సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.   

ఇటీవలే పార్లమెంటులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇస్తున్న తరుణంలో, 2027 నాటికి ప్రధాన పరిపాలనా భవనాలన్నీ సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. అమరావతిని హైదరాబాద్ ప్లస్ నగరంగా, ఆర్థిక, పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని చంద్రబాబు నాయుడు  స్పష్టం చేశారు.                       

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget