Lokesh : వాళ్లూ వీళ్లూ ఎందుకు జగన్.. నువ్వేరా..! టీ, స్నాక్స్ పెట్టి అభివృద్ధి నేర్పిస్తామ్ : లోకేష్ ట్వీట్
బ్లేడ్ బ్యాచ్‌లను కాకుండా నేరుగా జగనే చంద్రబాబు ఇంటి మీదకు రావాలని లోకేష్ సవాల్ చేశారు. చంద్రబాబు అభివృద్ధి ఎలా చేయాలో నేర్పి పంపుతారన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించడం, అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడటం వంటి పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆయన వరుస ట్వీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేత ఇంటిపైకి గూండాలను పంపావంటనే ఎంత భయపడుతున్నావో అర్థం అవుతోందని ... ఇంత కన్నా దిగజారడానికి ఏమీ లేదనుకున్న ప్రతీ సారి అంత కంటే దారుణంగా దిగజారిపోతున్నారని మండిపడ్డారు.
జనం తిరగబడే రోజు దగ్గరపడిందని, ఉలిక్కిపడి ప్రతిపక్షంపైకి వాళ్లనీ,వీళ్లనీ పంపడం ఎందుకు? నువ్వే ఓ సారి వచ్చిపోకూడదు. మా పెద్దాయన నీలాంటి క్రూర,నేరస్వభావం ఉన్నోడు కాదు. నువ్వు ముంచేయాలని నిత్యం తపించే కరకట్ట పక్క ఇంట్లో టీ, స్నాక్స్ పెట్టి..(3/4)
— Lokesh Nara (@naralokesh) September 17, 2021
తాడేపల్లిలోని జగన్ ఇంటి నుంచి చంద్రబాబు ఇంటికి ఎంత దూరమో... చంద్రబాబు ఇంటి నుంచి తాడేపల్లిలోని జగన్ ఇంటికి కూడా అంతే దూరమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అలా వచ్చే రోజు కూడా ఎంతో దూరంలో లేదని గుర్తుంచుకోవాలన్నారు.
బొత్తిగా నీకు తెలియని అభివృద్ధి అంటే ఏంటి?కొత్త పరిశ్రమలు ఎలా తీసుకురావాలి?ఉపాధి-ఉద్యోగావకాశాలు ఎలా పెంపొందించాలి?అనే అంశాలు చక్కగా వివరిస్తారు.కాదూ-కూడదు ఇలాగే బ్లేడ్ బ్లాచ్లను వేసుకొచ్చేస్తానంటే,నీ సరదాని మేమెందుకు కాదంటాం? ఒక్కొక్కళ్ళకి వడ్డీతో సహా వడ్డిస్తాం(4/4)
— Lokesh Nara (@naralokesh) September 17, 2021
Also Read : రౌడీయిజం మీదంటే మీది ! ఉండవల్లి ఘటనపై టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ పరస్పర విమర్శలు !
జనం తిరగబడే రోజులు వచ్చాయని జగన్‌కు లోకేష్ స్పష్టం చేశారు. ప్రతిపక్షంపైకి వాళ్లనూ వీళ్లను పంపడం ఎందుకని జగనే నేరుగా రావాలని నారా లోకేష్ సవాల్ చేశారు. చంద్రబాబు క్రూర స్వభావం ఉన్న వారు కాదని టీ, స్నాక్స్ పెట్టి అభివృద్ధి ఎలా చేయాలో నేర్పిస్తారన్నారు. Also Read: జేసీ వర్సెస్ కాల్వ ! అనంత టీడీపీలో పెరిగిపోతున్న గ్రూపుల గోల !
అలా కాదు బ్లేడ్ బ్యాచ్‌లను వేసుకుని వచ్సేస్తానంటే మీ సరదాను మేమేందుకు కాదంటామని.. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామని స్పష్టం చేశారు. నారా లోకేష్ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ అధ్యక్షుడి ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేసినట్లుగానే భావిస్తున్నారు. తెలుగుదేశం పార్ఏటీ నేతలందరూ ఈ అంశాన్ని ఏపీలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయన్న కోణంలో ప్రజల ముందు పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోణంలో నారా లోకేష్ ట్వీట్లను టీడీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. నేరుగా జగన్‌కు చాలెంజ్ చేయడంతో వైసీపీ నేతల స్పంద ఎలా ఉంటుదన్న ఆసక్తి ఏర్పడింది.
Also Read: తెలుగు రాష్ట్రాలకు కొత్త చీఫ్ జస్టిస్‌లు