X

Supreme Court : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్‌ జస్టిస్‌లు !?

తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లను నియమిస్తే సుప్రీంకోర్టు కొలిజీయం రాష్ట్రపతికి సిఫార్సు చేసినట్లుగా సమాచారం. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడే ్వకాశం ఉంది.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు రానున్నారు. తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా ఉన్న హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లారు. ఈ కారణంగా యాక్టింగ్ సీజేగా జస్టిస్ రామచంద్రరావు వ్యవహరిస్తున్నారు. ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఉన్నారు. ఆయనను చత్తీస్‌ఘడ్ బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫార్సులను పంపినట్లుగా సమాచారం. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను నియమించాలని సూచించింది. ప్రస్తుతం ఆయన చత్తీస్‌ఘడ్  హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు.  అంటే ఏపీ, చత్తీస్ ఘడ్ చీఫ్‌జస్టిస్‌లనూ అటూ ఇటూ మార్చేందుకు సిఫార్సు చేశారు. Also Read : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు ఖాయమా ? అధికార పార్టీల కసరత్తు అదే చెబుతోందా ?

ప్రస్తుతం దేశంలో ఎనిమిది హైకోర్టులకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌లు ఉన్నారు. అలహాబాద్, కలకత్తా, చత్తీస్ ఘడ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక , సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌ల పదవీ కాలం ముగియడమో సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వెళ్లడమో జరిగింది. ఈ కారణంగా ఆయా హైకోర్టులకు సీనియర్ న్యాయమూర్తులను సీజేలుగా తాత్కాలికంగా నియమించారు. ఇప్పుడు అన్ని హైకోర్టులకు చీఫ్‌జస్టిస్‌లను నియమించడంతో పాటు మరికొన్ని హైకోర్టుల సీజేలను కూడా మార్పు చేయాలని సిఫార్సు చేశారు . Also Read : శశిథరూర్‌పై రేవంత్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !

ప్రస్తుతం ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఉన్నారు. 2018లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అక్టోబర్ 15, 2019 నుంచి సిక్కిం హైకోర్టు సీజేగా వ్యహరించారు. గత జనవరిలోనే ఆయన ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు. తొమ్మిది నెలల్లోనే మరోసారి బదిలీపై చత్తీస్‌ఘడ్ వెళ్తున్నారు. ఆయనతో పాటు తెలంగాణ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వచ్చిన హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. Also Read : జగన్ గెలుస్తారా..? రఘురామ వదులుతారా.. ?

సుప్రీంకోర్టు కొలిజీయం ఇటీవలి కాలంలో న్యాయవ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి వీలైనంతగా మానవ వనరులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. శరవేగంగా న్యాయమూర్తులను నియమిస్తున్నారు. ట్రైబ్యూనల్స్ విషయంలోనూ సీజేఐ ఎన్వీ రమణ కఠినంగా ఉంటున్నారు. వాటిలో నియామకాలపై ఆయన కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్రం దిగి వస్తోంది. Also Read : రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి

Tags: supreme court CJI Andhra Telangana High Court New highcourt cj

సంబంధిత కథనాలు

Republic Day 2022 Wishes: సంపూర్ణ స్వేచ్ఛను సాధించుకున్నాం.. నేతల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Republic Day 2022 Wishes: సంపూర్ణ స్వేచ్ఛను సాధించుకున్నాం.. నేతల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Republic Day 2022 Live Updates: ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు.. రాజ్ పథ్‌లో ఆకట్టుకుంటున్న ప్రదర్శన

Republic Day 2022 Live Updates: ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు.. రాజ్ పథ్‌లో ఆకట్టుకుంటున్న ప్రదర్శన

Chiranjeevi Tested Covid Positive: చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్...

Chiranjeevi Tested Covid Positive: చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్...

New Districts: నెల్లూరు జిల్లా రెండు ముక్కలు.. అందరికీ న్యాయం జరిగేనా..?

New Districts: నెల్లూరు జిల్లా రెండు ముక్కలు.. అందరికీ న్యాయం జరిగేనా..?

Weather Updates: నైరుతి గాలుల ప్రభావంతో ఏపీలో నేడు సైతం వర్షాలు.. తెలంగాణలో తగ్గుతున్న చలి తీవ్రత

Weather Updates: నైరుతి గాలుల ప్రభావంతో ఏపీలో నేడు సైతం వర్షాలు.. తెలంగాణలో తగ్గుతున్న చలి తీవ్రత
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. హ్యాపీ రిపబ్లిక్ డే 2022

Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. హ్యాపీ రిపబ్లిక్ డే 2022

Republic Day 2022: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?

Republic Day 2022: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?

AP New District List: ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాలకు నెల గడువు

AP New District List: ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాలకు నెల గడువు

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..