Revant Audio Leak : శశిథరూర్‌పై రేవంత్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన శశిథరూర్‌ను రేవంత్ రెడ్డి దూషించినట్లుగా ఆడియో లీక్ కావడం కలకలం రేగింది. రేవంత్ రెడ్డి శశిథరూర్‌కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగినట్లయింది.
![Revant Audio Leak : శశిథరూర్‌పై రేవంత్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ ! Revant Audio Leak : Rewanth apologizes for insulting Shashitharur Revant Audio Leak : శశిథరూర్‌పై రేవంత్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/17/9fde47b4a3cf674d38cfeb90f60a6611_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని మరో ముఖ్య నేత శశిథరూర్‌ను ఉద్దేశించి ఆయన అనుచితంగా మాట్లాడిన ఆడియో ఒకటి రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఆడియోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా ట్యాగ్ చేశారు. రేవంత్ రెడ్డి ఒక థర్డ్ రేటెడ్ క్రిమినల్ అని కేటీఆర్ ట్వీట్‌లో మండిపడ్డారు. రాజకీయాల్లో ఇలాంటి నీచత్వాన్ని చెత్తను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తారా అని ప్రశ్నించారు.
While scumbags like @revanth_anumula need not be responded to; it’s important to expose filth
— KTR (@KTRTRS) September 16, 2021
Here’s his audio clip/comments on Tharoor. Sent to me by a reporter
I am sure if we send it to a forensic lab, it’ll match his infamous #Note4Vote voice
Any comments @RahulGandhi Ji? https://t.co/cdDHrAZ8QL pic.twitter.com/5Ly2mTOgpz
రేవంత్ రెడ్డి చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లోనూ చర్చనీయాశం అయ్యాయి. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారి డిమాండ్ చేశారు.
Dear Mr @revanth_anumula
— Manish Tewari (@ManishTewari) September 16, 2021
Dr @ShashiTharoor is a valued colleague of yours & mine It would have been better if you would have spoken to him if you had some misgivings about a purported statement of his.
Grace & Propriety demands you withdraw your words.
https://t.co/AL0GOdOusd
రేవంత్ రెడ్డి తనను దూషించారన్న వార్తలపై శశిథరూర్ కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి ఆయన మూలాలను గుర్తుంచుకొనే గాడిద అనే మాట మాట్లాడారేమో అని ఓ వార్తా పత్రికలో వచ్చిన వార్తను ట్వీట్ చేసి తనదైన శైలిలో సెటైరిక్‌గా స్పందించారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్కడ .. ఏ సందర్భంలో శశిధరూర్‌ను దూషించారన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఇటీవల శశిధరూర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ హోదాలో తెలంగాణలో పర్యటించారని.. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశసించారని చెబుతున్నారు. అలా ప్రశంసించినందుకే రేవంత్ రెడ్డికి శశిథరూర్‌పై కోపం వచ్చిందని అందుకే ఆయన దూషించారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. Also Read : ఫారెస్ట్ ఆఫీసర్‌పై పెట్రోల్‌తో దాడి.. భూపాలపల్లిలో షాకింగ్ ఘటన
ఈ వివాదం పెద్దది అవుతూడటం.. జాతీయ నేతలు కూడా స్పందించడంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆలస్యం చేయకుండా స్పందించారు. నేరుగా శశిథరూర్‌కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. [tw]
I spoke to shri @ShashiTharoor ji to convey that I hereby withdraw the remarks and reiterate that I hold my senior colleague in the highest regard. I regret any hurt that may have been caused to him by my words. We share our faith in the values and policies of the Congress Party.
— Revanth Reddy (@revanth_anumula) September 16, 2021
Also Read : 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ .. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
రేవంత్ రెడ్డి ఫోన్ చేసి క్షమాపణలు కోరిన విషయాన్ని శశిథరూర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ బలోపేతం కోసం కలసి పని చేస్తామని.. ఈ వివాదాన్ని మర్చిపోతామని ప్రకటించారు.
I received a gracious call from @revanth_anumula to apologise for what was said. I accept his expression of regret & am happy to put this unfortunate episode behind us. We must work together to strengthen @INCIndia in Telengana & across the country. https://t.co/pwIRmxpipn
— Shashi Tharoor (@ShashiTharoor) September 16, 2021
శశిథరూర్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ట్విట్టర్‌లో వారిద్దరూ తరచూ ట్వీట్లు చేసుకుంటూ ఉంటారు. శశిథరూర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశంపై కేటీఆర్ జోకులేస్తూంటారు. అంతే సరదాగా శశిథరూర్ సమాధానమిస్తూ ఉంటారు. ఇప్పుడు శశిథరూర్‌పై అంత కంటే ఎక్కువ అభిమానం చూపుతూ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో అంశంపై కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తున్నారు.
అయితే రేవంత్ రెడ్డి శశిథరూర్‌ను విమర్శిస్తున్న ఆడియోలు ఎలా బయటకు వచ్చాయి..? ఎవరితో ఆయన అలా మాట్లాడారన్నదానిపైనా క్లారిటీ లేదు. అయితే రేవంత్ రెడ్డి ఆడియోలను కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి టీఆర్ఎస్ నేతలు .. ఇతర పార్టీల కార్యకర్తలు పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. సమయానుకూలంగా స్పందించి రేవంత్ ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా సభకు ఒక్క రోజు ముందుగా ఈ వివాదం చెలరేగడం కుట్రలో భాగమేనని రేవంత్ రెడ్డి వర్గీయులు అనుమానిస్తున్నారు.
Also Read : సమంతకు లవర్ దొరికేశాడు! సామ్ పేరుతో చేతిపై టాటూ కూడా.. ఇవిగో ఫొటోలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)