News
News
X

Kurnool YSRCP: కర్నూలు వైసీపీలో మొదలైన టికెట్ల లొల్లి, హై కమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం

YSRCP Politics: 2024 లో జరగబోయే ఎన్నికల కోసం టికెట్ల గోల మొదలైందనే చెప్పవచ్చు. ఆ టికెట్ ఎవరికీ దక్కుతుంది అనే అంశం ఇప్పుడు కర్నూలు నగరవాసుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

FOLLOW US: 

Kurnool YSRCP Politics:  కర్నూలు నియోజకవర్గ టికెట్ కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా మీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి, ఆ టికెట్ ఎవరికీ దక్కుతుంది అనే అంశం ఇప్పుడు కర్నూలు నగరవాసుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. కర్నూల్ నగరంలో జరుగుతున్న రాజకీయం ఏమిటి...? 2024 లో జరగబోయే ఎన్నికల కోసం టికెట్ల గోల మొదలైందనే చెప్పవచ్చు. ఉన్నది ఒక్క సీటు పోటీ పడుతున్నది ముగ్గురు. ఆ సీటు దక్కేది ఎవరికీ అనే ఆసక్తి రేకెత్తిస్తోంది. పార్టీ హై కమాండ్ దృష్టిలో బెస్ట్ మార్క్స్ కోసం ఆ నాయకులు మూడు వర్గాలుగా విడిపోయి కేడర్ నూ బలపరుచుకుంటున్నరంటా అసలు ఆ నేతలెవరూ వివరాలపై ఓ లుక్కేయండి.

ఏ పార్టీ మారినా వరించని అవకాశం...
2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎస్ వి మోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందిన కర్నూల్ నగరంలో ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పనులను ఎస్వీ ట్రస్టు ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల నుండి మంచి మన్నున్నలు పొందారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఎస్వీ అధికార పార్టీలో చేరి నగరాన్ని అభివృద్ధి దిశగా నడపాలని అనుకున్నారు. అక్కడ కూడా అతనికి గుర్తింపు లభించక తీరా వైకాపా పార్టీని వీడి 2019లో తెదేపాలో చేరారు.

ఏ పార్టీలో చేరినా కొలిక్కి రాని పరిస్థితి...
ఎస్వీ పరిస్థితి ఎటు వెళ్లినా సీటు దొరకని పరిస్థితి. అందుకు చేసేదేం లేక గత కొన్ని సంవత్సరాలుగా సీటు కోసం వేచి చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 2019లో టీడీపీ పార్టీ టీజీ భరత్ కు టికెట్ ఇవ్వడంతో అసంతృప్తితో బయటకు వచ్చారు. తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అప్పటి వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ కు మద్దతు పలికి ప్రచారం చేశారు. కాగా గత కొంతకాలం నుంచి కేబుల్ నెట్వర్క్ విషయం ఇద్దరి మధ్య గొడవలకు దారితీసింది దీంతో క్యాడర్‌కు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.

2024 ఎన్నికల కోసం నేతల విశ్వప్రయత్నాలు..!
రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీలో టికెట్ల గోల మొదలైంది. టికెట్ దక్కించుకునేందుకు నువ్వంటే నేనా అంటూ కర్నూలు నియోజకవర్గంలో మూడు వర్గాలు పోటీ పడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు మరో ముస్లిం యువనేత బషీర్ రంగంలోకి దిగారు. గత కొంతకాలంగా హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య వర్గ విభేదాలు తలెత్తడంతో ఇరువురు మధ్య పోటీ ఏర్పడింది.

ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ హై కమాండ్ దృష్టిలో పడేలా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల కాలంలో కర్నూలుకు ముగ్గురు మంత్రులు కార్యక్రమాలకు హాజరు కావడంతో తమ వేరువేరు క్యాడర్ల ద్వారా తమ బలాబలాలను చూపించుకోవడం కోసం ఆ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తమ క్యాడర్‌ను తరలించే ప్రయత్నంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారని ఫ్యాన్ ఫాలోవర్స్ నుంచి వస్తున్న సమాచారం. మంత్రుల బస్సుయాత్ర సీఎం జగన్ పర్యటన సమయంలో కూడా తమ వ్యక్తిగత క్యాడర్ ని వేరు వేరు వాహనాలలో తరలించారని తమ శక్తి సామర్థ్యాలను చూపించుకుకున్నారని సమాచారం. 

ఇప్పటికే పార్టీలో ఉండే సీనియర్ నాయకులు వారిని కలిపి రాజీ చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారని విశ్వసనీయమైన వర్గాల సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ క్యాడర్ దెబ్బతిని ఇబ్బందులకు గురయ్యా అవకాశాలు ఉన్నాయని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.Published at : 28 Aug 2022 01:04 PM (IST) Tags: YS Jagan YSRCP AP News Telugu News Kurnool Kurnool YSRCP Candidate

సంబంధిత కథనాలు

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

నంద్యాల జిల్లాలో రామ్‌కో పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్

నంద్యాల జిల్లాలో రామ్‌కో పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

Nandyal News: వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లి విద్యార్థి మృతి, కాలుజారడం వల్లే!

Nandyal News: వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లి విద్యార్థి మృతి, కాలుజారడం వల్లే!

MRO Asking Bribe: ఓ ఎమ్మార్వో అరాచకం - 8 సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు, అయినా 25 లక్షలు లంచం డిమాండ్

MRO Asking Bribe: ఓ ఎమ్మార్వో అరాచకం - 8 సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు, అయినా 25 లక్షలు లంచం డిమాండ్

టాప్ స్టోరీస్

Balka Suman Followers : మంచిర్యాల జిల్లాలో తుపాకీ బుల్లెట్లతో వాట్సప్ స్టేటస్లు | DNN | ABP Desam

Balka Suman Followers : మంచిర్యాల జిల్లాలో తుపాకీ బుల్లెట్లతో వాట్సప్ స్టేటస్లు | DNN | ABP Desam

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!