అన్వేషించండి

Uranium Digging: కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు జరపడం లేదు: కర్నూలు ఎస్పీ

Kurnool News | కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్టులో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయని ఎవరైనా దుష్ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు.

Kurnool District SP | దేవనకొండ: కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలు జరుపుతున్నారన్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు జరగడం లేదని, వదంతులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రజలకు సూచించారు. దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాలలో యురేనియం లభ్యత, పరిశోధన కోసం ఎలాంటి బోరు తవ్వకాలు జరగడం లేదని బుధవారం ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని రిజర్వు ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని,  సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు.  

దామగుండం ఫారెస్టులో రాడార్ స్టేషన్
ఇటీవల తెలంగాణలో ఇలాంటి సమస్యే ఎదురైంది. వికారాబాద్ జిల్లాలోని దామగుండం అడవిలో భారత నౌకాదళం రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంది. అయితే రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే సమీపం ప్రాంతాల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని, పర్యావరణం విషతుల్యం అవుతుందని ప్రజలు ఆందోళన చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సైతం కేంద్రానికి సహకరించడంతో దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో రాడార్ స్టేషన్ కు ఇబ్బందులు తలెత్తలేదు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణకు వచ్చి అక్టోబర్ 15న రాడార్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. 

ఇప్పుడు కర్నూలు జిల్లా ప్రజల్ని యురేనియం తవ్వకాల సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో 468.25 హెక్టార్లలో 68 బోర్లు వేసేందుకు అనుమతి ఇచ్చింది. యురేనియం తవ్వకాలు చేపడితే పర్యావరణం దెబ్బతినడంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని   ఆందోళన వ్యక్తం చేశారు. కప్పట్రాళ్ల రక్షిత అడవిలో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని చుట్టుపక్కల దాదాపు 12 గ్రామాల ప్రజలు ఇటీవల నిరసనకు దిగారు. కొన్ని గ్రామాల్లో అయితే ఇతర గ్రామాల నుంచి ఎవరూ తమ గ్రామంలోకి రాకుండా రోడ్డు మీద రాళ్లు, కంచెలు అడ్డుపెట్టి స్వీయ నిర్బంధం చేసుకున్నారు. 

Also Read: Pawan Kalyan: అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ - చర్చించిన అంశాలు ఇవే ! 

హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల చుట్టుపక్కల గ్రామాలు వ్యవసాయం చేస్తున్నాయి. కానీ యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల కప్పట్రాళ్ల గ్రామాల ప్రజలు స్వీయ నిర్భంధం చేసుకుని రోడ్డుపై నిరసన తెలపగా, అధికారులు వచ్చి నవంబర్ 4న కలెక్టర్ వచ్చి మాట్లాడతారని చెప్పడంతో శాంతించారు. కప్పట్రాళ్ల, బేతపల్లి, గుండ్లకొండ, నెల్లిబండ,  నేలతలమరి, పి.కోటకొండ, చెల్లెలచెలిమల,  జిల్లేడు బుడకల, ఈదులదేవరబండ, బంటుపల్లి, మాదాపురం, దుప్పనగుర్తి గ్రామాల ప్రజలతో చెప్పిన ప్రకారం కలెక్టర్, ఉన్నతాధికారులు వెళ్లి వారితో చర్చించారు. యురేనియం కోసం బోర్లు వేయడం ద్వారా పర్యావరణం, నీరు దెబ్బతింటాయని స్థానికులు తీవ్ర అనారోగ్యం పాలవుతారని ఆందోళన చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
RAPO22 Title: రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
Southern Stalin: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
Tirumala News: అమరావతిలో పెళ్లి చేసుకోనున్న తిరుమల శ్రీనివాసుడు- విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
అమరావతిలో పెళ్లి చేసుకోనున్న తిరుమల శ్రీనివాసుడు- విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ  
SLBC Tunnel News:కేరళ కెడావర్ డాగ్స్‌ రాకతో కీలక దశకు ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్
కేరళ కెడావర్ డాగ్స్‌ రాకతో కీలక దశకు ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్
Embed widget