TDP Mahanadu 2025: నారా లోకేష్ మార్క్ మహానాడు.. టీడీపీలో ఇక అంతా చిన్న బాసే!
Nara Lokesh mark TDPs Mahanadu | టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ మహానాడు నుంచి టీడీపీ బాస్‌గా బాధ్యతలు చేపడతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కడప: తెలుగు తమ్ముళ్ల పండుగగా చెప్పుకునే టిడిపి మహానాడు (TDP Mahanadu) మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారి కడపలో జరగబోతున్న మహానాడు కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది పార్టీ అధికారం పూర్తిస్థాయిలో లోకేష్ చేతులకి అప్పగించడం అంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్ లు. మే 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు జరగనుంది.
నిజానికి గత జగన్ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినప్పటి నుంచి పార్టీలో కీలక నిర్ణయాలన్నీ లోకేష్ తీసుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్ చేయడం జన సేనతోపొత్తు ఏర్పడినప్పుడు మాటల్లోనూ చేతల్లోనూ ఎక్కడ ఆ పొత్తు డిస్టర్బ్ కాకుండా వ్యవహరించడం ప్రసంగాల్లో పదును పెంచడం కార్యకర్తల విశ్వాసం పొందడం ఇలా అన్ని విధాల పార్టీలో పట్టు సాధించారు లోకేష్. ఇప్పుడు ఏకంగా మహానాడు వేదికగా ఇకపై పార్టీలో కీలక నిర్ణయాలు తానే తీసుకుంటూ అధినేత చంద్రబాబు నాయుడు పై భారం తగ్గేలా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ప్రచారం బలంగా సాగుతోంది. ఆ సంకేతం కూడా ప్రత్యర్థి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటగా చెప్పుకునే కడప నుండి రాజకీయ వర్గాలకు పంపించడం లోకేష్ వ్యూహం గా చెబుతున్నారు. ఇక లోకేష్ కూడా చాలా కీలకమైన ఆరు ప్రతిపాదనలను మహానాడు వేదికగా స్వయంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది.
1) తెలుగు జాతి - విశ్వఖ్యాతి
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోని కీలకమైన పాయింట్ తెలుగువారి ఆత్మగౌరవం. ఇప్పుడు దానిని మరింత ముందుకు తీసుకుని వెళ్లలా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు యువతను ఏకతాటి పైకి తీసుకుని రావడం ప్రజెంట్ జనరేషన్ లోనూ టిడిపిని బలోపేతం చేయడం వంటి యాక్షన్ ప్లాన్ తో " తెలుగుజాతి విశ్వఖ్యాతి" అనే ప్రతిపాదన లోకేష్ స్వయంగా చేయబోతున్నారు
27, 28, 29 తేదీలలో కడపలో
— Telugu Desam Party (@JaiTDP) May 25, 2025
నిర్వహిస్తున్న మహానాడుకు
కదలి రండి..కలిసి రండి..
మహా పండగలో పాల్గొనండి..#Mahanadu2025#TeluguDesamParty#AndhraPradesh pic.twitter.com/ATnNlnzNQJ
2) స్త్రీ శక్తి
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి మహిళలు టిడిపికి పెద్ద సపోర్టుగా ఉంటూ వచ్చారు. క్షేత్రస్థాయిలో అంటే పల్లెల్లోనూ గ్రామాల్లోనూ టిడిపి పాతుకు పోయిందంటే దానిలో మహిళల పాత్ర చాలా ఉంది. మారిన జనరేషన్ దృష్ట్యా మళ్లీ అదే స్థాయిలో మహిళల మద్దతు పొందేలా టిడిపిని వారిలోకి తీసుకుని వెళ్లేందుకు పార్టీలో మహిళల పాత్ర మహిళల నాయకత్వం మరింత పెరిగేలా కొన్ని కీలకమైన నిర్ణయాలను మహానాడు వేదికగా లోకేష్ ప్రతిపాదించబోతున్నారు.
3) పేదలకు సేవ
ఆర్థికంగా అట్టడుగు వర్గాలకు చేయూత అందించే విధంగా పార్టీపరంగా 'పేదలకు సేవ ' అనే పేరుతో సోషల్ రీ -ఇంజనీరింగ్ కాన్సెప్ట్ను నారా లోకేష్ మహానాడులో ప్రతిపాదించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి బలహీన వర్గాలకు టిడిపి హయంలో రాజకీయంగా ఆర్థికంగా పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది అని టిడిపి క్లైమ్ చేసుకుంటూ ఉంటుంది. ఎన్టీఆర్ హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గాలకు 33% రిజర్వేషన్ ఇచ్చామనేది టిడిపి మాట. అరె గా ప్రస్తుతం ఎస్సీ సామాజిక వర్గీకరణలో ముందుగా స్టెప్ తీసుకుంది కూడా టిడిపినే. వీటన్నిటినీ వీలైనంత ఎక్కువగా ప్రచారం చేస్తూ బలహీన వర్గాల్లోకి మరింత గట్టిగా పార్టీని తీసుకునే వెళ్లేలా ఈ ప్రతిపాదన చేయబోతున్నారు.
4) యువగళం
ఈసారి ఎన్నికల్లో సీట్ల కేటాయింపు దగ్గర నుంచి పవర్ లోకి వచ్చాక మంత్రి పదవుల భర్టీ వరకూ యువతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు టిడిపి ప్రయత్నించింది. దీనిలో లోకేష్ మార్కు బలంగా కనిపించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పార్టీలో యువ నాయకత్వం, యువకుల ప్రాతినిత్యం పెంచే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. లోకేష్ చుట్టూ ఉన్న టీం కూడా యువకులతో నిండిపోయి ఉంది. ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులోనూ సీనియర్ నేతలను నిర్మూహమాటంగా పక్కన పెట్టారు. వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ లాంటి యువకులు క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు యువకుల ప్రాతినిద్యం మరింత పెంచేలా పార్టీలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ "యువ గళం " ప్రతిపాదన మహానాడు లో లోకేష్ చేయబోతున్నారు.
5) అన్నదాతకు అండ
వ్యవసాయంలో ఆధునికత పెంచడం, రైతులకు టెక్నాలజీని. అందుబాటులోకి తేవడం, నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేసి వ్యవసాయానికి పెద్దపీట వేయడం వంటి కార్యక్రమాలు ఎజెండాగా " అన్నదాతకు అండ " అరె ప్రతిపాదన లోకేష్ చేయబోతున్నారు.
6) కార్యకర్తే అధినేత
2014 -19 టైం నుండి లోకేష్ కార్యకర్తలకు అండగా ఉండే ప్రయత్నం చేశారు. అప్పట్లో అదంత ఫలించలేదు. కాని గత ఐదేళ్లు ఆయన బాగా నలిగారు. కార్యకర్తలతో పూర్తిస్థాయిలో మమేకమయ్యారు. నిజానికి ఎన్టీఆర్ హయాం నుండి కార్యకర్తలకు పెద్దపీట వేయడం టిడిపికి ఆనవాయితీ గా వస్తోంది. అయితే చంద్రబాబు హయాంలో డెవలప్మెంట్ కి, అడ్మినిస్ట్రేషన్ కు పెద్దపేట వేస్తూ కార్యకర్తల సంక్షేమం పట్ల దృష్టి పెట్టలేదు అనే విమర్శ పార్టీలో ఉన్న మాట వాస్తవం. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చాలామంది కీలక నాయకులు సైలెంట్ అయిపోయిన సమయంలో కార్యకర్తలే ఆయనకండగా ఉంటూ పార్టీని బతికించారు అనేది పార్టీ హై కమాండ్ మనసులో మాట. అందుకనే ఈసారి కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి తగిన కార్యక్రమాలు రూపకల్పన చేసేలా " కార్యకర్తే అధినేత " అనే ప్రతిపాదనను లోకేష్ తెరపైకి తీసుకురాపోతున్నారు.
పూర్తిగా లోకేష్ మార్క్ -మహానాడు
కడపలో మహానాడు జరపాలని నిర్ణయించినప్పటి నుంచీ లోకేష్ మార్కు కనపడేలా టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఆదినాయకత్వం ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లోనే ఉన్నా పార్టీ ఎగ్జిక్యూషన్ మొత్తం ఇకపై చిన్న బాసు లోకేష్ చేతుల్లోనే ఉండబోతుంది అనేది ఇప్పటికే పార్టీలో అందరికీ తెలిసినా ఆ విషయం బహిరంగంగా ప్రజల్లోకి కడప మహానాడు తీసుకెళ్లబోతోంది. అది ఎంత ఎఫెక్టివ్ గా ఉండబోతుంది అనేది ఈ మూడు రోజుల పసుపు పండుగ తర్వాత తెలియబోతోంది.





















