అన్వేషించండి

Paritala Sriram:యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అరచేయి కూడా ఆయుధం అవుతుంది-పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

Paritala Sriram:ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో పరిటాల శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 11 నెలలుగా జరుగుతున్న కొన్ని విషయాలు పట్టించుకోవద్దని కేడర్‌కు చూసించారు.

Paritala Sriram: యుద్ధం తప్పదన్నప్పుడు అరచేయి కూడా ఆయుధంగా మారుతుందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరంలో శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన మినీ మహానాడులో పార్లమెంట్ అధ్యక్షుడు అంజినప్ప, టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం గాంధీ నగర్‌లోని మారుతీ రాఘవేంద్ర స్వామి కళ్యాణమండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు పరిటాల శ్రీరామ్‌కి గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎన్టీఆర్, పరిటాల రవి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మరణించిన పహల్గామ్ మృతులకు, యుద్ధంలో అమరులైన సైనికులకు కూడా నివాళులర్పించారు. 


Paritala Sriram:యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అరచేయి కూడా ఆయుధం అవుతుంది-పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

మినీ మహానాడులో శ్రీరామ్ మాట్లాడుతూ పచ్చ కండువా అంటే వ్యసనం అని.. దానిని ఒక్కసారి పట్టుకుంటే వదల్లేని విధంగా బంధం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రం గురించి చెప్పాలంటే 1983కు ముందు తర్వాత అని చెప్పాలన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాతనే దేశంలో తెలుగోడి సత్తా తెలిసిందని.. చరిత్రలో పార్టీకి ఒక పేజీ వచ్చిందన్నారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో మెట్లు ఎక్కించారన్నారు. ప్రస్తుతం లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలంగా మారిందన్నారు. 


Paritala Sriram:యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అరచేయి కూడా ఆయుధం అవుతుంది-పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

ఐదేళ్ల పాటు వైసీపీ రాక్షస పాలనలో పార్టీ నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజల పక్షాన పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. మనం ధర్మవరం ఎమ్మెల్యే అవ్వాలని పోరాడలేదని.. వైసీపీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే పని చేశామన్నారు. అయితే గత 11నెలలుగా జరుగుతున్న ఘటనలను చూసి ఎవరు మైండ్ డైవర్ట్ చేసుకోవద్దని.. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసిన వాటికంటే ఇవి గొప్పవి, పెద్దవి కాదన్నారు. 


Paritala Sriram:యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అరచేయి కూడా ఆయుధం అవుతుంది-పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

నాలుగేళ్ల సమయం ఉందని.. అందరికీ మంచి జరిగే రోజు వస్తుందన్నారు శ్రీరామ్‌. అయితే కొందరు అడుగులకు మడుగులు ఒత్తుతూ.. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అన్నట్టు వ్యవహరిస్తుంటారని అలాంటి వారిని మర్చిపోమన్నారు. ప్రతి ఒక్కరూ ఓపిగ్గా ఉండాలన్నారు. ధర్మవరం ఓపికనిచ్చిందని.. కానీ ఉన్న ఒరిజనల్ మాత్రం అలానే ఉందన్నారు. అవసరమైతే అరచేయి కూడా ఆయుధంలా మారుతుందని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తప్పదన్నప్పుడు ఆ ఆయుధం వాడాల్సి ఉంటుందన్నారు. అప్పుడు డబుల్ గేమ్ ఆడేవాళ్ల దగ్గరి నుంచే మొదలు పెడతానన్నారు. 


Paritala Sriram:యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అరచేయి కూడా ఆయుధం అవుతుంది-పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

గ్రామాల్లో నాయకుడు మాట చెల్లుబాటు కాలేదంటే అది మరణంతో సమానమని.. మీరు గ్రామాల్లో స్వేచ్ఛగా కార్యాలయాలకు వెళ్లి ప్రజల కోసం పని చేయించుకోవాలన్నారు. పరిటాల రవి స్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని అన్నారు. అవసరమైతే ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తన కోసం పని చేసిన వారినెవర్నీ మర్చిపోలేదని.. తన గుణం అలాంటిది కాదన్నారు. మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా.. మీ వెంట ఉండాల్సింది నేనేనని శ్రీరామ్ వ్యాఖ్యానించారు. 


Paritala Sriram:యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అరచేయి కూడా ఆయుధం అవుతుంది-పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

ఎవరో మాట్లాడే మాటలకు ఢీలా పడవద్దని.. ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు శ్రీరాం. వైసీపీ నాయకులు అభివృద్ధి విషయంలో సలహాలు ఇస్తే తీసుకుంటాం కానీ.. ఇష్టమొచ్చినట్టు గతంలో లాగా చేస్తామంటే ఊరుకునేది లేదని శ్రీరామ్ హెచ్చరించారు. ఇటీవల పద్మభూషన్ అవార్డు దక్కించుకున్న ఎమ్మెల్యే బాలక్రిష్ణకు నియోజకవర్గం తరుఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు శ్రీరామ్ తెలిపారు. 


Paritala Sriram:యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అరచేయి కూడా ఆయుధం అవుతుంది-పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ అధ్యక్షుడు అంజినప్ప మాట్లాడుతూ ధర్మవరంలో కూటమి గెలుపు కోసం టీడీపీ కార్యకర్తలు చేసిన కష్టాన్ని ఎవరూ మరువలేరన్నారు. వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, పరిటాల శ్రీరామ్ అండగా ఉంటారన్నారు. ఆరోజు పరిటాల శ్రీరామ్ వైసీపీని ధైర్యంగా ఎదుర్కొని కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించారన్నారు. శ్రీరామ్ ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ మరింత బలంగా మారుతుందన్నారు.


Paritala Sriram:యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అరచేయి కూడా ఆయుధం అవుతుంది-పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget