ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్ చేసే ముఠా అరెస్టు.. కర్నూలులో కలకలం
సినిమాలు చూస్తున్నారు అప్‌డేట్ అవుతున్నారు. నకిలీ కరెన్సీ చేస్తున్న ఓ ముఠా ఏకంగా ఏటీఎంలలో నింపేసింది.
జనాలకు మాయమాటలు దొంగనోట్లు చెలామణి చేసే రోజులు పోయాయి. ఇప్పుడు ఏకంగా ఏటీఎంల్లోనే నింపేస్తున్నారు. ఇదేదో మెట్రో సిటీల్లో జరుగుతోంది కాదు. కర్నూలులో జరిగిందీ సంఘటన.
నిమాలు ఎంత మందిపై ప్రభావం చూపిస్తాయో తెలియదు కానీ కర్నూలుకకు చెందిన ఓ ఏడు మంది మాత్రం బాగానే ఎఫెక్ట్ అయ్యారు. ఆర్బిఐను కాదని, బ్యాంకులను కాదని సొంతంగా తామే 500, 100 నోట్లు ముద్రించి చలామణి చేసేందుకు ప్రయత్నించి ఉసాలు లెక్క పెడుతున్నారు.
పుట్టపాశం ఆదమ్ తన అతి తెలివితేటల్ని ఉపయోగించి ఓ సాఫ్టువేర్ తయారు చేశాడు. ఒరిజినల్ కరెన్సీ లాంటి నకిలీ నోట్లు తయారు చేసేవాడు. జిల్లాలో టీంలను ఏర్పాటు చేసుకొని చెలామణి చేసేవాడు. కొంతమందికి డబ్బులు ఇచ్చి ప్రజల్లో దొంగనోట్లు పంపిణీ చేయించేవాడు.
ఎక్కువ మొత్తంలో కమీషన్లు ఎర చూపించి నకిలీ కరెన్సీని ఏకంగా ఏటీఎంలో పెట్టేంచేవాడు. బ్యాంక్ డిపాజిట్ మిషన్ లో డిపాజిట్ చెయించేవాడు. ఇది కొన్ని రోజులు బాగానే నడిచింది. అయితే దీనికి అలవాటు పడిన నకిలీ కరెన్సీ గ్యాంగ్‌లు మరింతగా రెచ్చిపోయాయి.
ఆదమ్ ఇస్తున్న అమౌంట్ సరిపోలేదో ఏమో మఠా సభ్యులు సొంతంగా నోట్లను ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇష్టారీతిన డిపాజిట్ చేశారు. ఎటీఎంలలో చాలా ఎక్కువ నోట్లు వచ్చేశాయి.
కర్నూలు నగరంలోని బుధవార పేట ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎంలో 7500 రూపాయలు దొంగ నోట్లు వచ్చాయి. దీనిపై సదరు ఖాతాదారు బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విషయాన్ని నిజమేనని గుర్తించారు బ్యాంక్ అధికారులు.
గత ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన ఎస్బీఐ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అంతే దెబ్బకు ఠా దొంగల ముఠా. మొత్తానికి తీవ్రంగా గాలించి ముఠా సభ్యులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లక్ష రూపాయల నకిలీ కరెన్సీ, ప్రింటర్, కంప్యూటర్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసలో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు అసలు సూత్రధారిని మాత్రం పట్టుకోలేకపోయారు. మెయిన్ నిందితుడు ఆదమ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. ఇతనిపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యాయని డి.ఎస్.పి వెంకటరామయ్య తెలిపారు.
పుట్టపాశం ఆదమ్ దొంగ నోట్లు తయారు చేసి చలామణి చేయడంలో దిట్ట. ఇతనిపై ఇతర జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు నమోదు అయ్యాయి. కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ దందాను కొనసాగిస్తున్నాడు. ఎవ్వరికీ అనుమానం కలుగకుండా బ్యాంక్ డిపాజిట్ మిషన్ లో నకిలీ కరెన్సీని డిపాజిట్ చేసేవారు. అయతే ఆదమ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. త్వరలోనే ఆదమ్ ను అరెస్ట్ చేస్తామని ఇలాంటి వారు సమాజంలో ఉండటం ప్రమాదకరం అని డీఎస్పీ అన్నారు.
Also Read: కార్వీ ఆఫీసు, ఆస్తులపై పలుచోట్ల ఈడీ దాడులు.. బెంగళూరు పోలీసుల కస్టడీకి మాజీ ఎండీ పార్థసారధి