By: ABP Desam | Updated at : 20 Sep 2022 10:04 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కృష్ణంరాజు విగ్రహం
Krishnam Raju Status : ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల కన్నుమూశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఆయన సజీవరూపం ఆవిష్కృతమైంది. కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డాక్టర్ వడయార్ చేతుల్లో కృష్ణంరాజు విగ్రహం రూపుదిద్దుకుంది. హైదరాబాద్ లో జరగనున్న కృష్ణంరాజు దశ దిన కర్మకు ఈ విగ్రహాన్ని పంపిస్తున్నట్లు వడియార్ తెలిపారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వగ్రామమైన మొగల్తూరులో జరగనున్న సంస్మరణ సభ కోసం కూడా ఓ విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు వడియార్ పేర్కొన్నారు.
నాలుగు రోజుల్లోనే విగ్రహం
కొత్తపేటలో రెబల్ స్టార్ కృష్ణంరాజు విగ్రహం రూపుదిద్దుకుంది. దివంగత కృష్ణంరాజు మరణాంతరం కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకాలను పదిలపర్చుకోవాలని ఉద్దేశంతో విగ్రహాన్ని చేయాలని కోరారు. కొత్తపేటలో ఫేమస్ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ను కృష్ణంరాజు కుటుంబ సభ్యులు సంప్రదించారు. దీంతో వడయార్ కృష్ణంరాజు విగ్రహాన్ని తీర్చిదిద్దారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వ్యాక్స్ విగ్రహాన్ని పూర్తిచేశారు. కృష్ణంరాజు దశదిన కార్యక్రమంలో శిల్పి వడయార్ కృష్ణంరాజు ప్రతిమను కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ఈ నెల 23న హైదరాబాద్ కృష్ణంరాజు దశదిన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శిల్పి రాజ్ కుమార్ వడయార్ మాట్లాడుతూ తనకు ఇష్టమైన నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. ఆయన మరణం తనను ఎంతో బాధించిందన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యుల కోరిక మేరకు కేవలం 4 రోజుల్లోనే ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు చెప్పారు.
మొగల్తూరుకు ప్రభాస్
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించి కొన్ని రోజులు గడిచిపోయింది. ఆయన మరణాన్ని ప్రభాస్ అండ్ ఫ్యామిలీ తట్టుకోలేకపోతున్నారు. దీని నుంచి కోలుకోవడానికి వారికి మరింత సమయం పడుతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రభాస్ సెప్టెంబర్ 28న మొగల్తూరుకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ కృష్ణంరాజు సంస్మరణ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు ఫ్యామిలీ కూడా మొగల్తూరుకి వెళ్లనుంది. వీరంతా కొన్నిరోజులు పాటు అక్కడే ఉండనున్నారు. అందుకే అక్కడ ఉన్న వారి ఇంటిని రెన్నోవేట్ చేయిస్తున్నారు. దాదాపు 50 మంది పనివాళ్లు ఇంటి కోసం పని చేస్తున్నారు. గత 12 ఏళ్లలో ప్రభాస్ తొలిసారి మొగల్తూరుకి వెళ్తున్నారు. 2010లో ప్రభాస్ తండ్రి మరణించినప్పుడు మొగల్తూరుకి వెళ్లారు. కృష్ణంరాజు మాత్రం ఏడాది కనీసం రెండుసార్లైనా.. తన సొంతూరికి వెళ్లేవారు. కోవిడ్ సమయంలో మాత్రం వెళ్లడానికి కుదరలేదు.
స్మారక సభ
ఇక మొగల్తూరులో కృష్ణంరాజు స్మారక సభ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. దాదాపు 70 వేల మందికి భోజనం ఏర్పాట్లు చేయిస్తున్నారు. ద్రాక్షారామంకి చెందిన కొందరు చెఫ్ లను ఈ టాస్క్ కోసం నియమించారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణంరాజు అంత్యక్రియల సమయంలో కూడా చివరిచూపు కోసం వచ్చిన అభిమానులందరికీ భోజనం పెట్టించి మరీ పంపించారు ప్రభాస్. ఇప్పుడు మరోసారి అభిమానుల కోసం భోజనం ఏర్పాట్లు చేయిస్తున్నారు.
Chandrababu: 'దుష్టులను శిక్షించాలని దుర్గమ్మను వేడుకున్నా' - మానవ సంకల్పానికి దైవ సహాయం అవసరమంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
Top Headlines Today: బీఆర్ఎస్ పై తెలంగాణ సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - సాగర్ జల వివాదంపై కేంద్రం కీలక సమావేశం - నేటి టాప్ హెడ్ లైన్స్
Nagarjuna Sagar Dispute: తెలంగాణ అభ్యర్థన - సాగర్ వివాదంపై ఈ నెల 6న మరోసారి కీలక సమావేశం
Train Ticket: కన్ఫర్మ్‌డ్ ట్రైన్ టిక్కెట్ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్ ప్రయత్నించండి
Bank Holidays: మీకు బ్యాంక్‌లో పనుందా?, అయితే జాగ్రత్త! - ఏ నెలలో లేనన్ని సెలవులు ఈ నెలలో ఉన్నాయ్
తెలంగాణలో రేపే కౌంటింగ్-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం
Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు
Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు
/body>