News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kodela Sivaram : ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం - పట్టు వీడని కోడెల శివరాం !

ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కోడెల శివరాం ప్రకటించారు. తన తండ్రి పేరు నిలబెట్టేందుకు ఏ స్థాయి వ్యక్తినైనా ఎదిరిస్తానన్నారు.

FOLLOW US: 
Share:

Kodela Sivaram : తెలుగుదేశం పార్టీలో కోడెల శివరాం వివాదం కొనసాగుతోంది. పార్టీ నేతలు సర్ది చెప్పినా శివరాం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.  పల్నాటి గడ్డపై కోడెల పేరు తొలగించే ప్రయత్నం జరుగుతోందని..   ఆనేక మంది ఆ ప్రయత్నంలోనే ఉన్నారు ఇక వాళ్ళను ఉపేక్షంచనని కోడెల శివరాం స్పష్టం చేశారు.. ముప్పాళ్ళ మండలం రుద్రవరం గ్రామంలో డా.కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని గ్రామస్థులు సొంత నిధులతో ఏర్పటు చేశారు... ఆ విగ్రహ ఆవిష్కరణ  కోడెల కుమారుడు కోడెల శివరాం హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు... విగ్రహ ఆవిష్కరణ గురువారం రాత్రి జరిగింది.. ఆ ముందు రోజు నుంచి అదే గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కోడెల శివరాం ను అడ్డుకుంటానని తెలిపారు. .తన నుంచి కోడెల శివరాం 60 లక్షలు తీసుకొని ఎగ్గోట్టాడాని ఆ సొమ్ము తనకు ఇచ్చిన తర్వాతే కోడెల విగ్రహాన్ని ఆవిష్కరించు కోవాలని కోడెల విగ్రహం పక్కనే ప్లక్సీ ఏర్పటు చేశాడు. .కార్యక్రమానికి వస్తే నిలదీస్తామని బాధితుడు హడావిడి చేశారు.  ఇతనికి అండగా మరి కొందరు రావడంతో పరిస్తితి ఉద్రిక్తతంగా మారింది..ఈ పరిస్తితులల పోలీసులు రంగ ప్రవేశం చేశారు.  

కోడెల శివరాం గురువారం రాత్రి తన తండ్రి కోడెల శివప్రసాద్ విగ్రహ ఆవిష్కరణ. కార్యక్రంలో పాల్గొన్నారు. కోడెల లక్షల‌ మంది కార్యకర్తలను కుటుంబ సబ్యులుగా ఇచ్చారని వారి ఆకాక్షలకు అనుగుణంగా కోడెల పేరును నిలబెడతానని తెలిపారు...కోడెల అంటే పల్నాడు...పల్నాడు అంటే  కోడెల...కాని కోడెల   పేరును ఈ గడ్డపై నుంచి చెరిపేసేందుకు విశ్వప్రయత్నాలు జరుగు తున్నాయని అన్నారు...తన తండ్రి తనకు ఇచ్చిన బాధ్యత  నెరవేర్చేందుకు ఏ స్థాయి వ్యక్తితో అయిన తాను పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నానని నర్మగర్భంగా టీడీపీ అదిష్టానానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు శివరాం. తన తమ్ముడిని ఆక్సిడెంట్ రూపంలో కొల్పోయానని ఆ సందర్భంలో బాధ తట్టు లేక ఏడ్చానని తెలిపారు. ఆ పరిస్తితులలో తన తండ్రి తన వద్దకు వచ్చి ఎలాంటి బాధలనైనా మనలను నమ్ముకున్న వ్యక్తుల కోసం దిగమింగు కోవాలని. .మనం ఏడిస్తే క్యాడర్ మరింత దిగాలు పడతారని ఆనాడు కోడెల  చెప్పింది ఇప్పటి వరకు పాటిస్తున్నానని తెలిపారు. ఎన్నో విధాలుగా భయంకరమైన అవమానాలు ఫేస్ చేశానని అన్నారు...ఆనాడు తన తండ్రి చెప్పిన మాటలను తలచుకొంటు మౌనంగా భరిచానని చెప్పారు...
 
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి  టార్గెట్ తన తండ్రిని చేశారని...అనేక రకాలుగా అవమానించి, వేధించి మానసికంగా తీవ్రంగా గాయపరచడంతో తన తండ్రి శివైక్యం చేరారన్నారు తాను, తన తల్లి, తన బిడ్డలు కోడెల మరణంతో తీవ్రమనస్థాపానకు గురయ్యామని తెలిపారు... కాని తన తండ్రి అందించిన లక్షల మంది అబిమానులు తమకు తోడుగా ఉన్నారని చెప్పారు..కోడెల అభిమానుల ఆకాక్షలకు అనుగుణంగా తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు...తాను పోటీ చేయడం ఖయం..గెలవడం ఖాయమని తెలిపారు..కోెడెల గుర్తులు చెరిపివేయడం ఎవ్వరి  వల్ల కాదని పల్నాటి పులి జ్ణాపకాలు ఈ ప్రాంతంలో శాశ్వితంగా ఉంటాయని అన్నారు కోడెల శివరాం...

Published at : 09 Jun 2023 05:56 PM (IST) Tags: AP Politics TDP News Kodela Sivaram

ఇవి కూడా చూడండి

Nara Lokesh: రేపు విజయవాడకు నారా లోకేశ్, ఆ కేసులో సీఐడీ విచారణ కోసమే

Nara Lokesh: రేపు విజయవాడకు నారా లోకేశ్, ఆ కేసులో సీఐడీ విచారణ కోసమే

Bandaru Satyanarayana: గుంటూరు పీఎస్‌లో మాజీ మంత్రి బండారు - రోజాపై వ్యాఖ్యల కేసులో నేడు కోర్టు ఎదుటకు

Bandaru Satyanarayana: గుంటూరు పీఎస్‌లో మాజీ మంత్రి బండారు - రోజాపై వ్యాఖ్యల కేసులో నేడు కోర్టు ఎదుటకు

Supreme Court: నేడే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - వీరి బెంచ్ వద్ద లిస్టింగ్

Supreme Court: నేడే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - వీరి బెంచ్ వద్ద లిస్టింగ్

Amaravati Farmers : కౌలుకూ నోచుకోని అమరావతి రైతులు - వారిపై ప్రభుత్వానికి అంత పగ ఎందుకు ?

Amaravati Farmers :  కౌలుకూ నోచుకోని అమరావతి రైతులు -  వారిపై ప్రభుత్వానికి అంత పగ ఎందుకు ?

Top Headlines Today: బండారు అరెస్టుపై టీడీపీ నేతలు ఫైర్; తెలంగాణలో కొత్త పీఆర్సీ - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: బండారు అరెస్టుపై టీడీపీ నేతలు ఫైర్; తెలంగాణలో కొత్త పీఆర్సీ - నేటి టాప్ న్యూస్

టాప్ స్టోరీస్

Guntur Karam Movie : సంక్రాంతికే 'గుంటూరు కారం' - డౌట్స్‌కు చెక్ పెట్టిన మహేష్ ప్రొడ్యూసర్

Guntur Karam Movie : సంక్రాంతికే 'గుంటూరు కారం' - డౌట్స్‌కు చెక్ పెట్టిన మహేష్ ప్రొడ్యూసర్

Car At YSRCP Office: వైసీపీ వాళ్లు రూ.16 కోట్లు మోసం! జగనన్న న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతి- కారుకు స్టిక్కర్లు

Car At YSRCP Office: వైసీపీ వాళ్లు రూ.16 కోట్లు మోసం! జగనన్న న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతి- కారుకు స్టిక్కర్లు

Jithender Reddy Movie : 'జితేందర్ రెడ్డి' ఎవరో తెలిసింది - ఆయనతో పాటు శ్రియా శరణ్ కూడా!

Jithender Reddy Movie : 'జితేందర్ రెడ్డి' ఎవరో తెలిసింది - ఆయనతో పాటు శ్రియా శరణ్ కూడా!

Telangana PRC: ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ - పీఆర్సీ నియామకం, 5 శాతం మధ్యంతర భృతి

Telangana PRC: ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ - పీఆర్సీ  నియామకం, 5 శాతం మధ్యంతర భృతి