CM Jagan On Accident: జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో బస్సు ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం జగన్.. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో బస్సు పడిపోయిన ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
జల్లేరు వాగులో బస్సు బోల్తా ఘటనలో 9మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోడం బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విచారం వ్యక్తం చేశారు. తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఆయన జల్లేరు వాగులోబస్సు బోల్తా ఘటనలో మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లుగా ప్రకటించారు. బస్సు బోల్తాకు గల కారణాలపై ఆళ్ల నాని జిల్లా అధికారులను ఆరా తీశారు. సహాయక చర్యల కోసం జిల్లా యంత్రాంగాన్ని మంత్రి నాని అప్రమత్తం చేశారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. జంగారెడ్డి గూడెం నుండి అశ్వారావుపేట వైపు వెళ్తుండగా తెలుగు వెలుగు బస్సు వాగులో అదుపు తప్పి పడినట్టు జిల్లా యంత్రాంగం మంత్రి ఆళ్ల నానికి వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం కోసం జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్‌లో హుటాహుటిన ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులు వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.
Also Read: AP Bus Accident: ప.గో.జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది దుర్మరణం
Also Read: తెలుగు చదవలేరు.. ఇంగ్లీష్‌లో మాట్లడలేరు... కరోనాతో అటకెక్కిన చదువులు
Also Read: Balakrishna: దేవుడున్నాడు ! టిక్కెట్ల వివాదంపై జగన్ ఊతపదంతోనే కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ !
Also Read: తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ.. 2 కేసులు గుర్తింపు, మరో బాలుడికి కూడా.. డీహెచ్ వెల్లడి
Also Read: చాక్లెట్ ఇస్తానని మతిస్తిమితం లేని యువతిపై వృద్ధుడి లైంగిక దాడి.. మరో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి