AP Bus Accident: ప.గో.జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది దుర్మరణం
బస్సులో 47 మందికి పైగా ప్రయాణికులు ఉండడం.. ఓవర్ లోడ్‌తో వెళుతుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పశ్చిమగోదావరి జిల్లా లోని జంగారెడ్డిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళుతుండగా తెలుగు వెలుగు బస్సు.. డివైడర్ ను ఢీ కొట్టి జిల్లేరు వాగులో బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారిని దగ్గర్లోని జాలర్లు, స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా అప్పటికే ఊపిరి ఆడక ఏడుగురు మరణించారు. గాయపడిన మిగతా వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సులో 47 మందికి పైగా ప్రయాణికులు ఉండడం.. ఓవర్ లోడ్‌తో వెళుతుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
సీఎం జగన్ దిగ్ర్భాంతి.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా..
బస్సు ప్రమాదం తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి
జల్లేరు వాగులో బస్సు బోల్తా ఘటనలో 9మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోడం బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విచారం వ్యక్తం చేశారు. తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఆయన జల్లేరు వాగులోబస్సు బోల్తా ఘటనలో మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లుగా ప్రకటించారు. బస్సు బోల్తాకు గల కారణాలపై ఆళ్ల నాని జిల్లా అధికారులను ఆరా తీశారు. సహాయక చర్యల కోసం జిల్లా యంత్రాంగాన్ని మంత్రి నాని అప్రమత్తం చేశారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. జంగారెడ్డి గూడెం నుండి అశ్వారావుపేట వైపు వెళ్తుండగా తెలుగు వెలుగు బస్సు వాగులో అదుపు తప్పి పడినట్టు జిల్లా యంత్రాంగం మంత్రి ఆళ్ల నానికి వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం కోసం జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్‌లో హుటాహుటిన ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులు వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని అదేశించారు.
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి