By: Harish | Updated at : 07 Dec 2022 06:06 PM (IST)
Edited By: Shankard
పవన్ కళ్యాణ్ ప్రచార రథం రెడీ (Photo: Twitter/ Pawan Kalyan)
Pawan Kalyan ‘Varahi’ is ready for Election Battle!: ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దం అవుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా వాహనాన్ని పవన్ తనకు కావాల్సినట్లుగా తయారు చేయించారు. ఏపీ వ్యాప్తంగా పర్యటించేందుకు ఇప్పటికే రెడీ అయిన పవన్ ఇక ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఇందులో భాగంగా తన ప్రత్యేక వాహనానికి సంబందించిన ఫోటోలు, వీడియోలను పవన్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. వారాహి రెడీ ఫర్ ద బ్యాటిల్ అని పవన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు... వారాహి
ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ గారు బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు పవన్ కళ్యాణ్. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు... ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.
ఏపీలో మొదలైన ఎన్నికల వేడి..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల వేడి మెదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పై ఫోకస్ పెట్టాయి. అయితే ఇదే సమయంలో పవన్ కూడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారంలో రెండు రోజులు మాత్రమే పవన్ పార్టీ కార్యకలాపాలకు అందుబాటులో ఉంటున్నారు. ఇదే అంశంపై అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకులు పలు సందర్భాలలో జనసేనాని పవన్ ను టార్గెట్ చేసి కామెంట్లు చేశారు, చేస్తూనే ఉన్నారు. దీంతో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్దం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రధానంగా ఇప్పటంలో ఇంటి నిర్మాణాలు కూల్చి వేసే అంశంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించటంతో రాజకీయం మెత్తం వైసీపీ, జనసేన మధ్యనే సాగింది. ఇదే సమయంలో పవన్ అధికార పార్టీ వైసీపీని, ఏపీ సీఎం జగన్ ను అదే స్దాయిలో టర్గెట్ చేసి విమర్శలు చేశారు.
రాష్ట్రంలో పవన్ పర్యటన...
వాస్తవానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాలతో పవన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆలస్యం అయినప్పటికీ ప్రత్యేకంగా పర్యటనకు అవసరం అయిన అన్ని అంశాల పై పవన్ ఫోకస్ పెట్టినట్లుగా జనసైనికులు చెబుతున్నారు. ప్రధానంగా అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించటం అంటే ఆషామాషీ వ్యవహరం కాదు. సెక్యూరిటీ సమస్యల తలెత్తుతుంది. అభిమానులు పవన్ ను చూసేందుకు ఎగబడుతుంటారు. పవన్ సెక్యూరిటీ అంశాన్ని వైసీపీ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడక తప్పదు. పవన్ పలుమార్లు అనేక ప్రాంతాలకు చెప్పకుండా, వివరాలను బయటకు రానీయకుండా పలు ప్రాంతాలకు వెళ్లిన ఘటనలు లేకపోలేదు. పవన్ తనకు ప్రత్యేకంగా వాహనాన్ని డిజైన్ చేయించుకున్నారు. ఈ వాహనానికి వారాహిగా పేరు పెట్టారు. వారాహి రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిన్ అని తన ఉద్దేశాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించారు. వాహనం చాలా ప్రత్యేకంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో కూడ పవన్ ఎన్నికల ప్రచారం వాహానానికి క్రేజ్ ఏర్పడింది.
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022
పవన్ తన వాహనానికి సంబందించిన ఫోటోలు, వీడియోలను ఆయనే స్వయంగా బయటకు విడుదలచేసేవారు. తన ప్రైవేట్ వెహికల్ తో పాటుగా భద్రతా సిబ్బందికి వాహనం చుట్టుపక్కల నడుస్తుండగా, వాహనం ముందుకు కదులుతున్న వీడియోను పవన్ విడుదల చేశారు. ఇదే వాహనంలో అవసరం అయితే పవన్ విశ్రాంతి తీసుకునేందుకు వీలుంటుంది. వాస్తవానికి ఇలాంటి వాహనాలు రాజకీయ నాయకులు అందుబాటులో ఉంచుకోవటం కొత్తేమి కాదు. పవన్ కు ఇలాంటి వాహనాలు అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ పై అభిమానులు ఎగబడుతుంటారు. ఆయన కింద పడిపోయిన సందర్బాలు ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ ఎన్నికల ప్రచార రథం హాట్ టాపిక్‌గా మారింది.
సంక్రాంతి నుంచి పవన్ పర్యటన...
పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పవన్ పర్యటన దసరా నాటికి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వలన పర్యటన వాయిదా వేసుకున్నారు. దీంతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని, సంక్రాంతి తరువాత పవన్ పర్యటనను ప్రారంభించేందుకు అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
AP RCET: ఫిబ్రవరి 9 నుంచి 'ఏపీఆర్‌సెట్' రెండో విడత కౌన్సెలింగ్! సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Minister Meruga Nagarjuna: మంత్రి మేరుగ నాగార్జున వల్ల తనకు ప్రాణహాని ఉందని మాజీ సర్పంచ్ భర్త ఆరోపణలు!
Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!
YSRCP Politics: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలు నెరవేర్చింది: మాజీ మంత్రి పార్థసారథి
Gunadala Mary Mata Festival: ఈ 9 నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు - అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
‘వసుమతి’కి పెళ్లైపోయింది - బాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌తో ఘనంగా కియారా వెడ్డింగ్, ఒక్కరోజుకు అంత ఖర్చా?
MLC Kavitha: ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత - 2024 ఎన్నికల చర్చకు హాజరు!
Kadiyam Srihari On Sharmila: జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !
Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!
YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన