News
News
X

Sajjala On CPS : జగన్ తెలియక హామీ ఇచ్చారు... సీపీఎస్‌ రద్దు చేయాలంటే స్టేట్‌ బడ్జెట్‌ కూడా సరిపోదు : సజ్జల

సీపీఎస్ రద్దు విషయంలో జగన్ తెలియక హామీ ఇచ్చారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. సీపీఎస్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయాలు చూస్తామన్నారు.

FOLLOW US: 

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయలేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా.., సుత్తి లేకుండా స్పష్టం చేశారు.  టెక్నికల్ ఇష్యూస్ తెలియక సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన ఉద్యోగసంఘాలతో భేటీ తర్వాత మీడియాతో వ్యాఖ్యానించారు. సీపీఎస్ రద్దు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెబుతున్నాయని స్పష్టం చేశారు.  సీపీఎస్‌ రద్దు చేయడం అసాధ్యం కాబట్టి...  వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామన్నారు.  

Also Read: పీఆర్సీ పెంపుపై ఉద్యోగ సంఘాలతో సజ్జల భేటీ... సీఎం జగన్ న్యాయం చేస్తారని హామీ.. రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ..!

సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఉద్యోగ సంఘాలలో సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో.. మేనిఫెస్టోలో ఉద్యోగును ఆకర్షించిన ప్రధానమైన హామీ సీపీఎస్ రద్దు. తాను అధికారంలోకి వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టగానే కమిటీ వేశారు. మొత్తంగా మూడు కమిటీలు సీపీఎస్ రద్దుపై పని  చేస్తున్నాయి. గత ప్రభుత్వంలోనూ ఓ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మూడు ప్రతిపాదనలు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే అవి అమలు చేయక ముందే ప్రభుత్వం మారింది. వాటినీ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పరిశీలించాయి. కానీ నిర్ణయం తీసుకోలేకపోయారు. 

Also Read: సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు జీవో సస్పెన్షన్.. పాత విధానంలోనే రేట్స్ ఖరారు చేయాలన్న హైకోర్టు !

ఇప్పుడు సీపీఎస్ రద్దు సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చినందునే సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా ఆ విషయం ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. అయితే సీపీఎస్ రద్దుకు బదులుగా ప్రత్యామ్నాయాలు చూస్తామంటున్నారు. అయితే సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఇప్పటికే రోడ్డెక్కారు. ఉద్యమలు చేస్తున్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల కిందట భారీ సభ నిర్వహించి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.  సీపీఎస్ రద్దు చేస్తారా.. గద్దె దిగుతారా అని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రద్దు చేయడం సాధ్యం కాదని  చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 

Also Read: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ కీలక నిర్ణయం

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కూడా సాధ్యం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి పరోక్షంగా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అవరోధంగా ఉందన్నారు. సీపీఎస్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏ ప్రభుత్వం ఉన్నాచేయాల్సిందేనని  .. ప్రత్యామ్నాయాలు చూసి అమలు చేస్తామన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై సజ్జల ప్రకటన రాజకీయ దుమారం కూడా రేపే అవకాశం ఉంది.

Also Read: జగన్ హామీ నెరవేరలేదు.. పైగా జైలు పాలయింది..! టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు రాధ దీన స్థితి...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Dec 2021 06:55 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan Sajjala Ramakrishnareddy CPS cancellation Jagan guarantee CPS cancellation employees Agitation

సంబంధిత కథనాలు

Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ

Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ

Salman Khan: వైజాగ్‌ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు

Salman Khan: వైజాగ్‌ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

Vruksha Bandhan: రక్షా బంధన్ కాదిది వృక్షా బంధన్- విశాఖలో మహిళల వినూత్న వేడుక

Vruksha Bandhan: రక్షా బంధన్ కాదిది వృక్షా బంధన్- విశాఖలో మహిళల వినూత్న వేడుక

AP Government : నాయీ బ్రాహ్మణలను అలా పిలిస్తే కేసులు - ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం !

AP Government : నాయీ బ్రాహ్మణలను అలా పిలిస్తే కేసులు - ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం !

టాప్ స్టోరీస్

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

Telangana Cabinet :  ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?