(Source: ECI/ABP News/ABP Majha)
AP Pensions: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ కీలక నిర్ణయం
పెన్షనర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఏడాదిలో వ్యద్ధాప్య పింఛన్లను రూ.2500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1 నుంచి వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పింఛన్ల మొత్తాన్ని రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పింఛను దారులకు రూ.2,250 అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం జనవరిలో ఈబీసీ నేస్తం, అగ్రవర్ణ నిరుపేద మహిళలకు మూడేళ్లలో రూ.45వేలు, రైతు భరోసా సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారు. కలెక్టర్లు, అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
Also Read: 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం... తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు... టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం
ప్రతీ నెల ఒకటో తేదీన పింఛన్లు అందజేత
రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇంటింటికీ గ్రామ, వార్డు వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఒకటో తేదీన వైఎస్సార్ సామాజిక పింఛన్లు, వికలాంగ పెన్షన్లు, దీర్ఘకాలిక రోగులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 61,72,964 మందికి పింఛన్లు అందిస్తున్నారు. ఇందుకు కోసం సుమారు రూ.1,420 కోట్లను ప్రతీ నెల ప్రభుత్వం విడుదల చేస్తుంది. వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారు. నెలలో మొదటి 5 రోజుల వ్యవధిలో నూరుశాతం పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతు, దీర్ఘకాలిక రోగులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందిస్తోంది. ఈ పథకం జులై1, 2019న ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతీ నెల ఒకటో తారీఖున పెన్షనర్ల చేతికే సొమ్ము అందిస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్ పింఛన్లను రూ. 3000లకు పెంచుతామని హామీ ఇచ్చారు.
Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !
గతంలో సీఎం జగన్ ప్రకటన
గతంలో సీఎం జగన్ అసెంబ్లీలో పింఛన్ల పెంపుపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.2250కు పెంచామన్నారు. తర్వాత 2,250 నుంచి రూ.2500, ఆ తర్వాత రూ.2,500 నుంచి రూ.2,750, మళ్లీ మళ్లీ రూ.2,750 నుంచి రూ.3 వేలకు పింఛన్ పెంచుతామని సీఎం తెలిపారు. మిగిలిన పథకాలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 21న సంపూర్ణ గృహ హక్కు పథకం, జనవరి 1 నుంచి రూ.2500 పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక, జనవరి 29న ఈబీసీ నేస్తం, జనవరిలోనే రైతు భరోసా అందించనున్నారు.
Also Read: జగన్ హామీ నెరవేరలేదు.. పైగా జైలు పాలయింది..! టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు రాధ దీన స్థితి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి