అన్వేషించండి

YS Jagan On DGP: అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు

Andhra Pradeh: పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొొచ్చి శిక్షిస్తామన్నారు.

Jagan issued warnings to the police officers: వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు చేయకుండా అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు పేరు చెప్పి మరీ జగన్ హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఎండీ, చైర్మన్ గా మంచి పదవి ఇచ్చామన్నారు.  అయినా ఇప్పుడు డీజీపీ పదవి కోసం దిగజారిపోయారని ఆరోపించారు. ఇప్పుడు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రిటైరైపోతారని అనుకుంటున్నారేమో కానీ సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకు వచ్చి శిక్షిస్తామన్నారు. 

తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేరును  ప్రస్తావించి జగన్ వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ నుంచి వచ్చారని .. డిప్యూటేషన్ అయిపోయాక తెలంగాణకు వెళ్లిపోయినా తీసుకువచ్చి శిక్షిస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని జగన్ పోలీసులకు గుర్తు చేశారు. జమిలీ ఎన్నికలు అంటున్నారని తర్వాత తామే వస్తామని హెచ్చరించారు. చట్టం మీరి ప్రవర్తించిన ప్రతి పోలీసు అధికారులను తీసుకు వచ్చి చట్టం కింద నిలబడతామన్నారు. అలాగే ఇప్పుడు ప్రైవేటు కేసులు కూడా దాఖలు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన సోషల్ మీడియా కార్యకర్తల పేర్లను కొన్నింటిని జగన్ చదివారు. హైదరాబాద్ .. నల్లగొండ నుంచి కూడా కొంత మందిని అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు.             

మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్

ఏడేళ్లలోపు కేసుల్లో ప్రొసీజర్లు ఉన్నాయి. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. నిజంగా అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఉంటే.. వారెంట్‌ ఇవ్వాలి.  41ఏ కింద నోటీసులు ఇవ్వాలి. మెజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలి. ఇది సుప్రీం కోర్టు ఆర్డర్‌. కానీ, ఇవేవీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అరెస్టు చేస్తున్న వారందరూ యంగ్ స్టర్స్ అని జగన్ అన్నారు.  

సరస్వతి పవర్ భూముల విషయంపైనా జగన్ స్పందించారు. ఆ భూములను రైతులకు రెట్టింపు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశానన్నారు. కొనుగోలు చేసినప్పుడు గ్రామసభలు పెడితే రైతులు ఎకరానికి లక్షా 70వేల రూపాయలు అడిగారని .. తాను మూడు లక్షలు ఇచ్చానని.. అదీ జగన్ అంటే అని ఆయన చెప్పుకు వచ్చారు. సిమెంట్ పరిశ్రమకు నీరు, గనులు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. పరిశ్రమలు రాకుండా ఉండేందుకు పవన్ కల్యాణ్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు.        

'మీరు కుర్చీ లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు' - కడప మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం

జగన్ అనే వ్యక్తి చాలా మంచి వాడని రైతుల్ని సంంతోషంగా ఉంచేందుకు అడిగిన దాని కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చామన్నారు. అక్కడ సర్వే చేసిన అధికారులు కూడా ఎలాంటి ఉల్లంఘనలులేవని  సర్టిఫికెట్ ఇచ్చారని ఎమ్మార్వో బైట్ ను జగన్ మీడియాకు ప్రదర్శించారు.   
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Embed widget