Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Social Media: సోషల్ మీడియాలో కుటుంబంలోని మహిళలపై అసభ్యంగా మాట్లాడేవారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు ప్రకటించారు. కొవ్వెక్కి నేరస్తులుగా మారుతున్నారని మండిపడ్డారు.
Andhra Social Media Cases: సోషల్ మీడియాలో కొంత మంది అంబోతుల్లా తయారయి కుటుంబంలో మహిళలపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మదం ఎక్కి, సోషల్ మీడియాలో ఆడ బిడ్డలపై ఇష్టం వచ్చినట్టు పోస్టింగులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇంట్లో పిల్లల గురించి కూడా నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మదం ఎక్కువై, కొవ్వు ఎక్కువై, నేరస్తులుగా తయారయ్యి, రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని వదిలేయాలా అని అడుగుతున్నానని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రశ్నించారు.
ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛా?
— Telugu Desam Party (@JaiTDP) November 7, 2024
అసత్యాలు, అశ్లీల పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛా?
సోషల్ మీడియాలో సైకోలు పెట్టే పోస్టులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. విచ్చలవిడితనంతో మదమెక్కిన ఆంబోతుల్లా తయారయ్యారు. ఆడబిడ్డల కన్నీటి కారకులపై చర్యలు ఎందుకు… pic.twitter.com/YxI2Do04Iv
మదం ఎక్కువైపోయి.. కొవ్వెక్కిపోయి నేరస్తులుగా మారుతున్నారు. మనుషులని మర్చిపోయి పిల్లలపైనా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వదిలి పెట్టాలా వీళ్లని అని ప్రశ్నించారు. తన కుటుబంంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితలపైనా జుగుప్సాకరమైన పోస్టింగులు పెడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు చూసి ఆయన ఇంట్లో చిన్న పిల్లలు కన్నీరు పెట్టుకున్నారని చంద్రబాబు తెలిపారు.
వైసీపీ వాళ్ల సొంత పత్రిక పెట్టి ప్రతి రోజు ఫేక్ కథనాలు రాస్తున్నారని విమర్శించారు. వైఎస్ వివేక హత్య జరిగిన రోజు.. సాక్షి పత్రికలో ఏ కథనం వచ్చిందో అందరికీ తెలుసునన్నారు. వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి హత్య చేసి.. తనపై వాళ్ల పత్రికలో నారా సుర రక్త చరిత్ర అంటూ రాశారని మమ్మల్ని మానసికంగా దెబ్బ తీసేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నారు. ఇలాంటి వారినెవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తనతో ఆడుకోవాలని చూస్తే ఎవరిని వదిలి పెట్టనని కొవ్వు ఎక్కిన వారి కొవ్వు తగ్గిస్తానని హెచ్చరించారు.
అధికారం పోయిన వెంటనే, ఈ సైకోలు సోషల్ మీడియాలో, ఇంట్లో ఆడవాళ్ళ పై ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, పోస్టులు పెడుతూ, కుంగతీసే ప్రయత్నం చేస్తున్నారు. దేనికైనా హద్దులు ఉంటాయి, హద్దులు దాటితే మాత్రం శిక్ష తప్పదు. దేశంలో, ప్రపంచంలో ఉండే చట్టాలు అన్నీ అధ్యయనం చేస్తున్నాం. ఆడ బిడ్డల పై… pic.twitter.com/lhoDtVSRWA
— Telugu Desam Party (@JaiTDP) November 7, 2024
పోలీస్ వ్యవస్థ సైతం ఆలోచించుకోవాలన్నారు. నేరస్తుల కంటే మీరు అప్పర్ హ్యాండ్లో ఉండాలని పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా ఉండాలని తాను మరోసారి చెబుతున్నానని పోలీసులకు స్పష్టం చేశారు. భావ వ్యక్తీకరణ పేరుతో ఎవరి పైనైనా పోస్టులు పెడతరా అని చంద్రబాబు ప్రశ్నించారు.
అమరావతిలో కార్యక్రమాల తర్వాత చంద్రబాబు సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితతో సమావేశం అయ్యారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సోషల్ మీడియాపై తీసుకునే చర్యలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది.