అన్వేషించండి

YSRCP News : పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్యాత్నం కలకలం - అదేమి లేదని వివరణ

Andhra Politics : పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరానని డిశ్చార్జ్ అయ్యానని అదీప్ రాజ్ ప్రకటించారు.

Former Pendurthi MLA Adeep Raj  suicide attempt  : ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఆయన నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి వెళ్లడంతో ఉన్న పళంగా కుటుంబసభ్యులు మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అయితే కుటుంబసభ్యులు మాత్రం ఆయనది ఆత్మహత్యాయత్నం కాదని.. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఆస్పత్రిలో చేరారని అంటున్నారు. ఆయన డిశ్చార్జ్ అయ్యారని చెబుతున్నారు.                          

ఈ అంశంపై అదీప్ రాజ్  వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు. ఫుడ్ పాయిజన్ అయిందన్న అనుమానంతో తెల్లవారుజామున రెండున్నరకు ఆస్పత్రికి వెళ్లానని...అది గ్యాస్ట్రిక్ సమస్య మాత్రమేనని ఆరున్నరకే డిశ్చార్జ్ అయ్యానని తెలిపారు. చిన్న విషయాన్ని పెద్ద విషయంగా మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలకు అందుబాటులో ఉంటానని అదీప్ రాజ్ చెప్పుకొచ్చారు. 

అదీప్ రాజ్ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు . అయితే ఆయనకు ఆత్మహత్యాయత్నం చేయాల్సిన అవసరం ఏమిటన్నది స్పష్టత లేదు. అదీప్ రాజ్ కుటుంబం రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు. అందుకే 34 ఏళ్ల వయసులోనే ఆయనకు మొదటి సారిగా 2019లో టిక్కెట్ లభించింది. వైసీపీ అధినేత జగన్ అదీప్ రాజ్ ను ప్రోత్సహించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఇరవై ఎనిమిది  వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయిత గత ఎన్నికల్లో పెందుర్తి నుంచి జనసేన తరపున పంచకర్ల రమేష్ బాబు కూటమి తరపున పోటీ చేశారు. పంచకర్ల రమేష్ బాబు ఏకంగా 81వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఓటమి అదీప్ రాజ్ ను బాగా కుంగదీసిందని చెబుతున్నారు. మరో వైపు కుటుంబంలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. 

అదీప్ రాజ్ ఆత్మహత్యాయత్నం అంశంపై విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆయన వివరణ ఇచ్చారు.   తమపై తప్పుడు  ప్రచారం చేస్తున్నారని అదీప్ రాజ్ కు ఆత్మహత్యాయత్నం చేయాల్సిన అవసరం లేదని..  చిన్న గ్యాస్ట్రిక్ సమస్య వల్లనే ఆయన ఆస్పత్రిలో చేరారని అంటున్నారు.   

ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ఖర్చులతో పాటు.. బెట్టింగులు వంటివి కూడా వారికి పెద్ద సమస్యగా మారాయి. క్యాడర్ నుంచి కూడా వారిపై ఒత్తిళ్లుఉంటున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఇలాంటి సమయంలో అదీప్ రాజ్ ఆత్మహత్యాయత్నం వార్త వైరల్ అయింది. కానీ అలాంటిదేమీ లేదని స్వయంగా అదీప్ రాజ్ వీడియో విడుదల చేయడంతో అంతా తేలిపోయినట్లయింది.                                                                           

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
MEGA157: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
Venkaiah Naidu: మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP DesamGT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
MEGA157: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
Venkaiah Naidu: మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
TGPSC Group1 Results: గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
LRS In Telangana: సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
Happy Ugadi  Shubh Muhurat 2025: ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
Happy Ugadi Wishes in Telugu 2025: మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
Embed widget