By: ABP Desam | Updated at : 09 Mar 2023 11:53 PM (IST)
ఐపీఎస్ సునీల్ కుమార్
IPS Sunil Kumar appointed as DG of AP state Disaster response and Fire services of State
అమరావతి: ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డీజీగా పీవీ సునీల్ కుమార్ ను నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులతో రేపు (శుక్రవారం) విపత్తులు నిర్వహణ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీగా సునీల్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
జనవరిలో సునీల్ కుమార్ బదిలీ
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఇంకెక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సంజయ్‌కు బాధ్యతలు అప్పగించింది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పీవీ సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా ఉన్నారు. సీఐడీ అధికారులు ప్రతిపక్ష నేతల్ని తప్పుడు కేసులతో వేధిస్తున్నారని.. నిబంధనలకు విరుద్దంగా అరెస్టులు చేస్తున్నారని తీవ్ర విమర్శలు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయితే హఠాత్తుగా ఆయనను బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో సంచలనం రేపుతోంది. సాధారణం సీనియర్ అధికారులను బదిలీ చేస్తే.. పోస్టింగ్ ఇస్తారు. కానీ పీవీ సునీల్ ఒక్కరినే బదిలీ చేశారు.. పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దీనికి కారణం ఏమిటన్నదానిపై అధికారవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఆయనకు ప్రమోషన్ ఇచ్చింది. అడిషనల్ డీజీ హోదా ఉండే ఆయనకు డీజీపీ హోదా ఇచ్చింది. అడిషనల్ డీజీపీ హోదాతో సీఐడీ చీఫ్ గా కొనసాగేవారు. డీజీగా ప్రమోషనల్ ఇచ్చారు. సునీల్ కుమార్ 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. పదోన్నతి 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇలా డీజీగా ప్రమోషన్ ఇచ్చిన ఇరవై రోజుల్లోనే ఆయనను బదిలీ చేయడం.. అనూహ్యంగా మారింది. బదిలీకి కారణాలేమిటన్నది మాత్రం స్పష్టం కాలేదు కానీ.. ఉదయమే టీడీపీ యున నేత నారా లోకేష్.. సీఐడీ పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఓ స్థలం వివాదంలో సీఐడీ జోక్యం చేసుకుందని...విల్ కేసుల సెటిల్మెంట్లు, కబ్జాలకి సిఐడిని అడ్డా చేశారని లోకేష్ విమర్శించారు. సిఐడి పేరు వింటేనే జనం ఛీకొట్టేలా ఉందని మండిపడ్డారు.
గతంలో చాలా సార్లు సునీల్ కుమార్, సీఐడీ పని తీరుపై టీడీపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. ట్వీట్లు చేసింది. కేంద్రానికి.... రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేసింది. కానీ ఒక్క సారి కూడా సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోలేదు. సుదీర్ఘ కాలంగా సీఐడీ చీఫ్ గా కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడీ విషయంలో చర్యలు తీసుకుంటారని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారవర్గాలు కూడా భావించడం లేదు.
ఎందుకు బదిలీ చేస్తున్నారన్న కారణం అధికారవర్గాలు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ ఎప్పుడూ చెప్పవు. ఇలా ఒక్కరినే.. హఠాత్తుగా బదిలీ చేసేసి.. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయమంటే మాత్రం.. పనితీరుపై అసంతృప్తి లేదా ఆరోపణల వల్ల చేస్తూంటారన్న అభిప్రాయం ఉంటుంది.
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్
Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!
Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్
MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?