Breaking News Telugu Live Updates: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ 5000 ప్రజా పోరు సభలు: సోము వీర్రాజు
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ, ఏపీ న్యూస్, తెలంగాణ న్యూస్, ఏపీ బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్
LIVE
Background
YSR 13th Vardhanthi: ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం నివాళులు అర్పించారు. వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు సైతం నివాళులర్పించిన అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తండ్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన తలుచుకుంటూ వైఎస్ జగన్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
నాన్నకు ప్రేమతో వైఎస్ జగన్ ట్వీట్..
‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ’ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Prakasam Fire Accident: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అగ్నిప్రమాదానికి గురైంది. లారీ ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే లారీకి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో లారీలో ఉన్న సిలిండర్లు ఒక్కొక్కటిగాద పేలిపోయాయి. భారీ శబ్ధంతో సిలిండర్లు పేలడంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
అసలేం జరిగిందంటే..
కర్నూలు నుంచి ఉలవపాడుకు నిండు సిలిండర్ లోడ్‌తో లారీ వెళ్తోంది. అయితే మార్గం మధ్యలో ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పెద్దవాడ వద్ద ఆ లారీ ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గ్రహించి అప్రమత్తమైన లారీ డ్రైవర్ వాహనం నుంచి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ నిమిషాల వ్యవధిలో మంటలు లారీ మొత్తానికి వ్యాపించడంతో.. అందులో ఉన్న వందల ఎల్పీజీ సిలిండర్లు భారీ శబ్ధంతో పేలిపోయాయి. లారీలో 300కు పైగా సిలిండర్లు ఉన్నట్లు సమాచారం.
Rains in Telangana AP: ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తమిళనాడు దాని పరసర ప్రాంతాలలో కొనసాగుతూ సముద్ర మట్టంపై 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని, ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం. వర్షం కురిసే ప్రాంతాల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న కామారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కొమురంభీమ్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసింది. నేడు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల వర్ష సూచన ఉంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
అస్వస్థతకు గురైన మంత్రి విశ్వరూప్
ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. అమలాపురంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని అస్వస్థతకు గురయ్యారు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ 5000 ప్రజా పోరు సభలు: సోము వీర్రాజు
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా 5000 చోట్ల బిజేపీ ప్రజా పోరు సభలు నిర్వహిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరులో భాగంగా రాష్ట్రంలోని 5000 గ్రామ స్థలాలలో ప్రజా బహిరంగసభలను నిర్వహించనున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలోనిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు..
Kamareddy District: బాన్సువాడలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో ఉద్రిక్తత
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి కాన్వాయ్ ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తోందని ఆరోపిస్తూ... గో బ్యాక్ నిర్మలా సీతారామన్ అంటూ నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పాఠాపోటీగా నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Jalsa Movie Release: నెల్లూరులో పవన్ ఫ్యాన్స్ సందడి, జల్సా థియేటర్ల వద్ద హంగామా
రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాని 4కె రిజల్యూషన్ లో మళ్లీ థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. గతం కంటే ఎక్కువగా నెల్లూరులో మొత్తం 13 థియేటర్స్ లో జల్సా మూవీ రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద హంగామా సృష్టించారు అభిమానులు. నెల్లూరులోని థియేటర్స్ వద్ద జనసేన నాయకులు కూడా సందడి చేశారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. పవన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు.
మహాత్మా గాంధీ వర్సీటీ మెయిన్ గేట్ కి తాళం వేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
నల్గొండ.... మహాత్మా గాంధీ వర్సీటీ మెయిన్ గేట్ కి తాళం వేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
యూనివర్సిటీ నుండి పానగల్ క్యాంపస్ కి బస్సు పెట్టాలని నాలుగు యేండ్లుగా విద్యార్థులు అడుగుతున్నా యూనివర్సిటీ యాజమాన్యం స్పందించడం లేదు
నిన్న యూనివర్సిటీ నుండి పానగల్ క్యాంపస్ కి స్టూడెంట్స్ ని దింపి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ కృష్ణ మృతి
బస్సు పెట్టకపోవడం వల్లే ఆటో డ్రైవర్ కృష్ణ మృతి చెందాదంటూ గేటుకు తాళం వేసి ఆందోళన
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్
పానగల్ క్యాంపస్ ను యూనివర్సిటీ కి తరలించాలని డిమాండ్