అన్వేషించండి

Driver Subramaniam Murder Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పునర్విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్

MLC Ananthababu case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో పునర్విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దర్యాప్తు ఆపాలని అనంతబాబు వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది.

Driver Subramaniam murder case Investigation:  ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో  ఊరట దక్కలేదు.  డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో పునర్విచారణ వద్దని అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు.  ఈ కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు.  అనంతబాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.  హైకోర్టు స్టేకు నిరాకరించడంతో పునర్విచారణకు   అడ్డంకులు తొలగిపోయినట్లయింది. 

అనంతబాబు కేసులో ఇప్పటికే  ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని  నియమించింది. సిట్ అధికారులు విచారమ ప్రారంభించారు.  అనంతబాబుకు సహకరించినవారిపై SIT ఫోకస్ చేసింది.   90 రోజుల్లో విచారణ పూర్తి చేసి హత్య కేసులో ఉన్న కుట్ర అంతా బయట పెట్టాలని అనుకుంటున్నారు.  కేసు పూర్వాపరాలు తేల్చి, బాధితులకు న్యాయం చేసే విషయంలో సిట్ ఏ అవకాశాన్ని వదిలి  పెట్టకూడదని భావిస్తోంది. 
2022 మేలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి  వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారు. తానే హత్య చేసినట్లుగా  అనంతబాబు అంగీకరించారు. 

అయితే  ఈ  కేసులో తదుపరి విచారణ జరగలేదు.  కేసు విషయంలో న్యాయం చేస్తామని, నిందితులను శిక్షిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత  మృతుడి తల్లి ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక  న్యాయవాదిని నియమించి  మళ్లీ దర్యాప్తు కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.   కేసుపై లోతైన విచారణ చేయడంతోపాటు 90 రోజుల్లో సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేయాలని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.  ఈ కేసులో న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును న్యాయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. 

గతంలో విచారణలో లోపాలను గుర్తించి....90 రోజుల్లో పూర్తి విచారణ పూర్తి చేసే దిశగా సిట్  ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. అనంతబాబుకు నాడు గన్ మెన్లుగా ఉన్న వారిని ఇప్పటికే ప్రశ్నించింది.  నాడు ఏం జరిగింది..ఘటనలో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.  ఒక్కడే హత్య చేసి, డెడ్ బాడీని తరలించే అవకాశం లేదని...సహకరించిన వారు ఎవరనేది  సిట్  తేల్చాల్సి ఉంది.   కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చట్టబద్దంగా బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారం, ఆర్థిక సాయం ఇప్పటికే అందచేశారు.  ఎస్సీలపై జరిగిన నేరాల విషయంలో బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన పింఛను పెండింగ్ తో సహా చెల్లించింది.  కుటుంబ సభ్యులకు పింఛన్ తో పాటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడుకి సోషల్ వెల్ఫేర్ శాఖలో ఉద్యోగం ఇచ్చారు.   ఇంటి నిర్మాణం కోసం అనువైన చోట 3 సెంట్ల ఇంటి స్థలం, 2 ఎకరాల సాగుభూమి ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.                   

అనంతబాబు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ప్రయత్నించారు. ఇప్పుడు  జగన్ సమక్షంలో జరిగే సమావేశాలకు హాజరవుతున్నారు.                 

టాప్ హెడ్ లైన్స్

Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget