By: ABP Desam | Updated at : 11 Feb 2022 04:49 PM (IST)
అశోక్‌బాబుపై కేసు పెట్టాలని ఆదేశించిన లోకాయుక్తను కూడా పార్టీగా చేర్చిన హైకోర్టు
ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అశోక్‌బాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన లోకాయుక్తను కూడా పార్టీగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ధర్మానసం ఆదేశించింది. గురువారం అర్థరాత్రి అశోక్‌బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉదయం హైకోర్టులో బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు గతంలో ప్రభుత్వ ఉద్యోగి. ఏసీటీవోగా పని చేస్తూ రిటైరయ్యారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అయితే ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్‌బాబు ప్రమోషన్ల కోసం తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని ఓ ఉద్యోగినిలోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. లోకాయుక్త ఆదేశాలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేయాలని జనవరి 24వ తేదీన ఆదేశించింది.
తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, ఎన్నికల అఫిడవిట్‌లో కూడా డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. అశోక్ బాబు పైన సెక్షన్ 477A, 465,420 కింద కేసు నమోదు చేశారు. గురువారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. అయితే అశోక్‌బాబుపై ఈ ఆరోపణలు గతంలోనూ ఉన్నాయి. అయితే గత ప్రభుత్వాలు విచారణ జరిపాయి. విజిలెన్స్ కూడా నివేదిక ఇచ్చింది. క్లరికల్ తప్పు కారణంగానే అలా నమోదయిందని అశోక్ బాబు తాను డిగ్రీ చేశానని ఎక్కడా చెప్పలేదని.. ఆ పేరుతో ఆయన ప్రమోషన్లు కూడా పొందలేదని నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారు. దీంతో ఆయనకు ప్రభుత్వం 2018లోనే క్లీన్ చిట్ ఇచ్చింది.
ఆ తర్వాత ఆయన రిటైరయ్యారు. రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు అదే అభియోగాలతో ఓ ఉద్యోగిని లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయాలని ఆదేశించడం.. అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. అయితే ఇది తప్పుడు కేసు అని.. రాజకీయ ఉద్దేశాలతో పెట్టారని అశోక్ బాబు తప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించినట్లుగా ఒక్క ఆధారం కూడా ఎఫ్‌ఐఆర్ లోచూపించలేదని టీడీపీ మండిపడింది. ఎన్నికలఅఫిడవిట్‌లోనూ అశోక్ బాబు తన క్వాలిఫికేషన్ ఇంటర్ అనే చెప్పారంటోంది. ఈ కేసులో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
MP Raghurama Krishn Raju : ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై విచారణ, ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరు!
Revanth Reddy: ఇక్కడ ఫాంహౌస్ దాటరు! అటు వెళ్లి నష్ట పరిహారమా? రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న
Lokesh On Ysrcp Govt : తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!
Breaking News Live Updates జ్ఞానవాపి మసీదు కేసులో సివిల్ దావా విచారణ ప్రారంభించిన వారణాసి జిల్లా కోర్టు
MLC Anantha Udaya Bhaskar: డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు ! సాయంత్రం పోలీసుల ప్రెస్‌మీట్
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు
CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్ సదస్సులో సీఎం జగన్
Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్