News
News
X

GVL : న్యాయపరంగా మూడు రాజధానులు అసాధ్యం - వైఎస్ఆర్‌సీపీకి క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ !

న్యాయపరంగా మూడు రాజధానులు సాధ్యం కావని ఏపీ ప్రభుత్వానికి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టవద్దని సూచించారు.

FOLLOW US: 

GVL :   మూడు రాజధానులు ఏర్పాటు చేసుకునే చట్టం చేసుకునే అవకాశం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అలా పిటిషన్ దాఖలు చేయగానే .. ఇలా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. న్యాయపరంగా మూడు రాజధానులు సాధ్యం కావని స్పష్టం చేశారు. మూడు రాజాధానుల ప్రతిపాదన రాజకీయ ఎత్తుగడ అని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని విమర్శించారు. మూడు రాజధానులు దేవుడెరుగు.. మూడేళ్లలో మూడు బిల్డింగ్‌లైనా కట్టారా? అని ప్రశ్నించారు. ఏ అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులు ఎందుకని ఆయన ప్రశ్నించారు.    

రాజధానుల అంశం కేంద్రం జోక్యం చేసుకునేది కాదు !

రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని జీవీఎల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అంశం కాదన్నారు. అమరావతి రైతుల ఎప్పుడూ అండగానే ఉంటుందని ఎంపీ జీవీఎల్‌ అన్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని.. వారు భూములు ఇచ్చింది ఒక రాజకీయ పార్టీకి కాదు..ప్రభుత్వానికికని జీవీఎల్ గుర్తు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు న్యాయం కోం వారు యాత్ర చేయడంలో తప్పు లేదని..  వారి యాత్రకు తమ  మద్దతు ఉంటుందని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. అసలేమీ చేయకుండానే  మూడు రాజధానులు కడతామంటున్నారు ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా అని ప్రశ్నించారు. 

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే శ్వేత పత్రం విడుదల చేయాలన్న జీవీఎల్ 

ఏపీలో  స్వచ్చమైన రాజకీయాలు రావాలని అందుకోసం  బీజేపి - జనసేన కూటమి అధికారంలోకి తీసుకురావాలని ఆయన  ప్రజలకు పిలుపునిచ్చారు. ఛిన్నభిన్న మైన అర్థిక పరిస్ధితి జగన్ కి కనిపించటం లేదు...ఆదాయంలేదు, అభివృద్ధి లేదన్నారు.  జిఎస్టీ లో రాష్ట్ర వాటా కింద  41 శాతం ఏపికి ఇవ్వడంలో ఎక్కడా ఆలస్యం జరగడంలేదని..  కేంద్రం కంటే తమ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అసెంబ్లీ సాక్షిగా  తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం సిగ్గుచేటని జీవీఎల్ మండిపడ్డారు. బలీయమైన అర్థిక వ్యవస్ధ ఏపిలో వుందని  చెప్పుకోడానికి మీదగ్గర ఏముందని ప్రశ్నించారు.  151 సీట్లు గెలుచుకున్న వైసిపి ఏపిని పతనావస్ధకు తీసుకు వెళ్లిందన్నారు. ఉమ్మడి జాబితాలో పథకాలకు రాష్ట్ర వాటా చెల్లింపులు ఎందుకు ఇవ్వడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు. 

కేంద్ర ప్రాజెక్టులకు ఏపీ సహకారం శూన్యం : జీవీఎల్ నరసింహారావు

కోటిపల్లి నర్సాపూర్ , బెంగళూరు కడప రైల్వే ప్రాజెక్టులకు ఏపి నుంచి సహకారం శూన్యం అని మండిపడ్డారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి పై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని సవాల్ చేసారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఓట్లు పడవని స్పష్టం చేశారు.  రాజధానుల విషయంలో ప్రజలను మభ్య పెట్టవద్దని వైఎస్ఆర్‌సీపీకి సహకరించారు. ఇటీవలి కాలంలో ఏపీలో అమరావతి రాజధానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో జీవీఎల్ ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 

Published at : 17 Sep 2022 03:27 PM (IST) Tags: AP Three Capitals GVL Narasiha Rao

సంబంధిత కథనాలు

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Kotakonda Durgamma : శ్రీకాకుళం జిల్లాలో దొరల దసరా, వేపచెట్టు వద్ద తురాయి పువ్వు ఎటుపడితే అటు సుభిక్షం!

Kotakonda Durgamma : శ్రీకాకుళం జిల్లాలో దొరల దసరా, వేపచెట్టు వద్ద తురాయి పువ్వు ఎటుపడితే అటు సుభిక్షం!

Vijayawada Teppotsavam : కృష్ణానదిలో దుర్గా మ‌ల్లేశ్వర‌స్వామి న‌దీ విహారానికి బ్రేక్, వరుసగా మూడో ఏడాది!

Vijayawada Teppotsavam  : కృష్ణానదిలో దుర్గా మ‌ల్లేశ్వర‌స్వామి న‌దీ విహారానికి బ్రేక్, వరుసగా మూడో ఏడాది!

Srikakulam: రజకుల్ని బహిష్కరించిన సర్పంచ్! రెండ్రోజులుగా తిండి తిప్పల్లేకుండా అవస్థలు

Srikakulam: రజకుల్ని బహిష్కరించిన సర్పంచ్! రెండ్రోజులుగా తిండి తిప్పల్లేకుండా అవస్థలు

God Father No Politics : గాడ్‌ఫాదర్ డైలాగులతో భుజాలు తడుముకుంటే నేనేం చేయలేను - ఏపీ నేతలకు ముందుగానే చిరంజీవి క్లారిటీ !

God Father No Politics : గాడ్‌ఫాదర్ డైలాగులతో భుజాలు తడుముకుంటే నేనేం చేయలేను -  ఏపీ నేతలకు ముందుగానే చిరంజీవి క్లారిటీ !

టాప్ స్టోరీస్

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!