Uravakonda YSRCP : ఉరవకొండలో వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ ... పయ్యావులకు టెన్షన్ లేకుండా చేస్తున్న అధికార పార్టీ నేతలు!
ఉరవకొండ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీలో గ్రూపుల గోల వినిపిస్తోంది. వైఎస్ఆర్‌సీపీ నేతలు తమలో తామే పోట్లాడుకుంటున్నారు. టీడీపీ సీనియర్ నేత పయ్యావులకు ఈ పరిస్థితి కలసి వస్తోంది.
![Uravakonda YSRCP : ఉరవకొండలో వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ ... పయ్యావులకు టెన్షన్ లేకుండా చేస్తున్న అధికార పార్టీ నేతలు! Group sphere in Uravakonda constituency YSRCP - YSRCP leaders fighting among themselves Uravakonda YSRCP : ఉరవకొండలో వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ ... పయ్యావులకు టెన్షన్ లేకుండా చేస్తున్న అధికార పార్టీ నేతలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/30/3d556d00e365b489d12d7781cfa217a1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వర్గ విభేధాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. టీడీపీకి చెందిన కీలక నేతలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ఏకతాటిపైకి నిలవలేకపోతున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్‌సీపీ నేతలు గ్రూపులుగా విడిపోయారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శివరాంరెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. శివరామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే పరిస్థితి సద్దుమణుగుతుందని పార్టీ హైకమాండ్ అనుకుంది. కానీ పరిస్థితి మరింత దిగజారింది. అధికారంలో ఉన్నందున తమ మాటే వినాలని ఎవరికి వారు పట్టుబడుతున్నారు. దీంతో ఆధిపత్య పోరాటం ఊపందుకుంది.
Also Read: టీడీపీ వర్సెస్ టీడీపీ ! నేతల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రతిపక్షానికి అసలు సమస్యా..!?
ఉరవకొండలో వైఎస్ హయాం నుంచి విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండు సార్లు ఓడిపోయారు. ఓ సారి గెలిచారు. వైఎస్ఆర్‌సీపీలో చేరిన తర్వాత ఆయనకు శివరామిరెడ్డి వర్గం సహకరించడం లేదుగత ఎన్నికల్లో కూడా తమకు సహకరంచనప్పటికి పయ్యావుల కేశవ్ చేతిలోకేవలం రెండువేల ఓట్ల తేడాతోనే ఓడిపోయామని గుర్తు చేస్తున్నారు. ఆ వర్గం సహకరించి ఉంటే ఖచ్చితంగా గెలిచే వారిమని విశ్వేశ్వర్రెడ్డి వర్గీయులు అంటున్నారు. శివరామిరెడ్డి వర్గాన్ని కంట్రోల్‌లో పెడతారని అనుకుంటే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రోత్సహించారని ఇప్పుడు విశ్వేశ్వర్ రెడ్డి వర్గీయులు అసంతృప్తికి గురవుతున్నారు.
విశ్వేశ్వరరెడ్డికి శివరాంరెడ్డి ఒక్కరే కాదు ఆయన కుటుంబంలో కూడా వర్గపోరు నడుస్తోంది. ఆయన సోదరుడు మదుసూదన్ రెడ్డి కూడా విశ్వేశ్వర రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీంతో నియోజకవర్గ ఇంచార్జ్ గా విశ్వేశ్వర రెడ్డి వున్నప్పటికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఆయన పార్టీలోనే ప్రత్యర్థులు. ఇన్నాళ్లు అంతర్గతంగా వున్న విభేదాలు కాస్తా నేడు ఆయా వర్గాల నేతల మధ్య గ్రామాల్లో కొట్టుకొనే స్థాయికి వెళ్లాయి. వీటితో నియోజకవర్గంలో ఇద్దరు అధికారపార్టీ నేతల మద్య పోరు పోలీసులకు తలనొప్పిగా మారింది.ఏ ఒక్కరిని అదపులొకి తీసుకొన్నా.. పోలీసు కేసులు నమోదు చేసినా నేతల నుంచి వచ్చే ఒత్తిడికి తట్టుకోలేక సతమతమవుతున్నారు.
Also Read: తెలంగాణలోనూ ఏపీ తరహా మార్పులు... త్వరలో ఆన్‌లైన్ ప్రక్రియ: తలసాని
అదిష్ఠానం మాత్రం సమస్యను తగ్గిస్తారు అనుకొంటూ శివరాంరెడ్డికి ఎంఎల్సీ ఇచ్చి మరీ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యిందన్నది విశ్వేశ్వరరెడ్డి వర్గీయుల భావన.వీటన్నిటికి తోడు తమ్ముడు మదుసూదన్ రెడ్డి కూడా అన్న పై కారాలు మిరియాలు నూరుతున్నారు...ఇక్కడ అన్నపై కోపం కంటే ఆయన కొడుకు ప్రణయ్ పైనే మదుసూదన్ మండిపడుతున్నారు. ఇటీవల ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడిన సందర్బంలో కూడా కొట్టుకొనే వరకు పరిస్థితులు దారితీశాయి. తమ పార్టీలోనే నేతల వైఖరి పయ్యావులకు ప్లస్ అవుతోందని ఇతర వైసీపీ నేతలు మథనపడుతున్నారు.
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)