అన్వేషించండి

Vijayawada Floods: వరద ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా - రంగంలోకి నేవీ హెలికాఫ్టర్లు, అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం

Vijayawada News: విజయవాడ వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఫుడ్ సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో ట్రయల్ రన్ నిర్వహించారు.

Food Supply Through Drones In Vijayawada: విజయవాడలోని (Vijayawada) వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితులకు సమీపంలోని కల్యాణ మండపాలు, స్కూళ్లల్లో పునరావాసం కల్పించారు. వారికి 3 పూటలా ఆహారం అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు రంగంలోకి దిగాయి. బోట్ల సాయంతో చిన్నారులు, వృద్ధులు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తమకు కనీసం ఆహారం అందడం లేదని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోట్లు సైతం వెళ్లలేని మారుమూల ప్రాంతాల్లోని బాధితులకు ఆహారం, తాగునీరు అందించడం కష్టంగా మారింది. దీనిపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో ఆహారం సరఫరా చేసేందుకు సన్నద్ధమవుతోంది. బోట్లు, హెలికాఫ్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రత్యామ్నాయంగా డ్రోన్ల వినియోగంపై ఫోకస్ చేసింది. అందుబాటులో ఉన్న 3 డ్రోన్లతో విజయవాడ కలెక్టరేట్ వేదికగా ట్రయల్ రన్‌ను అధికారులు నిర్వహించారు.

పర్యవేక్షించిన సీఎం

సీఎం చంద్రబాబు (CM ) స్వయంగా ఈ ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు. ఓ మినీ హెలికాఫ్టర్‌లా ఉండే ఈ డ్రోన్లు ఎంత బరువు మోయగలవు.? ఏయే ప్రదేశాల వరకూ వెళ్లగలవు.?, మార్గమధ్యలో ఏమైనా అడ్డంకులు వస్తే ఎలా తప్పించుకుని రాగలవు.? వంటి అంశాలను ఈ రన్‌లో పరిశీలించారు. ట్రయల్ రన్ తర్వాత దాదాపు 8 నుంచి 10 కిలోల వరకూ ఆహారం, మెడిసిన్, తాగునీరు వంటివి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిని ఏ మేరకు వినియోగించుకోవచ్చో పరిశీలించి ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ట్రయల్ రన్‌కు 3 ఫుడ్ డెలివరీ డ్రోన్లను వినియోగించగా.. మరో 5 డ్రోన్లు సిద్ధంగా ఉంచారు.

రంగంలోకి నేవీ హెలికాఫ్టర్లు

మరోవైపు, వరద సహాయక చర్యల కోసం ఇప్పటికే నేవీ హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నాయి. విజయవాడ నగరంలో 78, కృష్ణా జిల్లాలో 81 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

సీఎం ఆగ్రహం

అటు, విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలన అనంతరం సీఎం చంద్రబాబు మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాధితులకు సహాయం అందించడంలో ఇప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదని.. స్వయంగా తానే రంగంలోకి దిగినా ఇంకా మొద్దనిద్ర వీడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యం జరగడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని.. ప్రజలు బాధల్లో ఉంటే అండగా ఉండాల్సింది పోయి ఇలా ప్రవరిస్తే సహించేది లేదని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు - మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు, రంగంలోకి నిపుణులు కన్నయ్య నాయుడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad 144 Section: హైదరాబాద్‌లో మళ్లీ రజాకార్ల రాజ్యమంటూ హరీష్ రావు ఫైర్, 144 సెక్షన్‌పై సీవీ ఆనంద్ క్లారిటీ
హైదరాబాద్‌లో మళ్లీ రజాకార్ల రాజ్యమంటూ హరీష్ రావు ఫైర్, 144 సెక్షన్‌పై సీవీ ఆనంద్ క్లారిటీ
Venu Swamy: వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ - వారంలోగా చర్యలు తీసుకోమని ఆదేశాలు!
వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ - వారంలోగా చర్యలు తీసుకోమని ఆదేశాలు!
Pawan Kalyan: తమిళ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విషెష్, వైరల్ అవుతోన్న పోస్ట్
తమిళ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విషెష్, వైరల్ అవుతోన్న పోస్ట్
Who Is Raj Pakala :  సన్ బర్న్ ఫెస్టివల్స్ నుంచి ఫామ్ హౌస్ పార్టీల వరకూ ఆయన పేరు ఫేమస్ - రాజ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ పెద్దదే !
సన్ బర్న్ ఫెస్టివల్స్ నుంచి ఫామ్ హౌస్ పార్టీల వరకూ ఆయన పేరు ఫేమస్ - రాజ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ పెద్దదే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Crackers Fire Accident at Abids | అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో బాణాసంచా దుకాణంలో ప్రమాదం | ABPHyderabad Public on ABP Southern Rising Summit 2024 | ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ పై అభిప్రాయాలుVijay First Political Meeting Highlights | విల్లుపురంలో దమ్ము చూపించిన తలపతి విజయ్ | ABP Desamమతిపోగొట్టే రాయల్ వింటేజ్ కార్స్, కార్స్ 'ఎన్' కాఫీలో చూసేద్దామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad 144 Section: హైదరాబాద్‌లో మళ్లీ రజాకార్ల రాజ్యమంటూ హరీష్ రావు ఫైర్, 144 సెక్షన్‌పై సీవీ ఆనంద్ క్లారిటీ
హైదరాబాద్‌లో మళ్లీ రజాకార్ల రాజ్యమంటూ హరీష్ రావు ఫైర్, 144 సెక్షన్‌పై సీవీ ఆనంద్ క్లారిటీ
Venu Swamy: వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ - వారంలోగా చర్యలు తీసుకోమని ఆదేశాలు!
వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ - వారంలోగా చర్యలు తీసుకోమని ఆదేశాలు!
Pawan Kalyan: తమిళ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విషెష్, వైరల్ అవుతోన్న పోస్ట్
తమిళ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విషెష్, వైరల్ అవుతోన్న పోస్ట్
Who Is Raj Pakala :  సన్ బర్న్ ఫెస్టివల్స్ నుంచి ఫామ్ హౌస్ పార్టీల వరకూ ఆయన పేరు ఫేమస్ - రాజ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ పెద్దదే !
సన్ బర్న్ ఫెస్టివల్స్ నుంచి ఫామ్ హౌస్ పార్టీల వరకూ ఆయన పేరు ఫేమస్ - రాజ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ పెద్దదే !
Google : గూగుల్‌పై కోర్టుకెళ్లి రూ.26 వేల కోట్ల పరిహారం పొందుతున్నారు - ఈ యూకే జంట పంట పండినట్లే !
గూగుల్‌పై కోర్టుకెళ్లి రూ.26 వేల కోట్ల పరిహారం పొందుతున్నారు - ఈ యూకే జంట పంట పండినట్లే !
YS Jagana And YS Sharmila: జగన్, షర్మిల పంచాయితీకి జడ్జి విజయమ్మే- మాట్లాడే అర్హత వేరే వాళ్లకు లేదు: బాలినేని శ్రీనివాస రెడ్డి 
జగన్, షర్మిల పంచాయితీకి జడ్జి విజయమ్మే- మాట్లాడే అర్హత వేరే వాళ్లకు లేదు: బాలినేని శ్రీనివాస రెడ్డి 
Nara Lokesh America Tour: టెస్లా ప్రతినిధులతో లోకేష్‌ సమావేశం- ఏపీ రావాలని ఆహ్వానం 
టెస్లా ప్రతినిధులతో లోకేష్‌ సమావేశం- ఏపీ రావాలని ఆహ్వానం 
GHMC Permission:హైదరాబాద్‌లో ఎలాంటి పార్టీలకు అనుమతి తీసుకోవాలి? ఇంట్లో మందు వేడుక చేసుకున్నా చిక్కులు తప్పవా?
హైదరాబాద్‌లో ఎలాంటి పార్టీలకు అనుమతి తీసుకోవాలి? ఇంట్లో మందు వేడుక చేసుకున్నా చిక్కులు తప్పవా?
Embed widget