East Godavari Murder Case: కొడుకు గల్ఫ్‌లో ఉద్యోగం.. కోడలు మరో వ్యక్తితో సంబంధం.. పరువుతీస్తుందని దారుణం
తన కోడలికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మామ దారుణానికి ఒడిగట్టిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.
![East Godavari Murder Case: కొడుకు గల్ఫ్‌లో ఉద్యోగం.. కోడలు మరో వ్యక్తితో సంబంధం.. పరువుతీస్తుందని దారుణం Father in law murdered daughter in law because of illegal relationship with other person in East Godavari East Godavari Murder Case: కొడుకు గల్ఫ్‌లో ఉద్యోగం.. కోడలు మరో వ్యక్తితో సంబంధం.. పరువుతీస్తుందని దారుణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/31/a69d9c6e1db8e6a1e1b13a46c4a29d6c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబం పరువు తీసిందన్న కోపంతో కోడల్ని హత్య చేశాడు మామ. ఈ దారుణమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెంలో చోటుచేసుకుంది. మలికిపురం ఎస్సై నాగరాజు వెల్లడించిన వివరాలు ప్రకారం... మేడిచర్లపాలెం గ్రామానికి చెందిన చొప్పల సత్యనారాయణ తన కుమారుడు విజయకుమార్‌కు ప్రియమణి అనే యువతితో గతంలో వివాహం జరిపించాడు. అయితే విజయకుమార్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ కి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రియమణి స్థానికంగా ఉన్న వేరే సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
కోడలు పది రోజుల క్రితం ఏకంగా ఆ యువకుడితో వెళ్లిపోయింది. ఈ విషయంపై సత్యనారాయణ మలికిపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, వాళ్లిద్దరిని తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ప్రియమణిని సత్యనారాయణతో ఇంటికి పంపించారు. ఈ విషయంపై మామ, కోడలు మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరగడంతో కోపోద్రిత్తుడైన సత్యనారాయణ.. ప్రియమణిపై కత్తితో దాడి చేశాడు.
కోడలు తమ కుటుంబం పరువు తీసిందని మామ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తన కోడలు ప్రియమణి(25)ని శుక్రవారం కత్తితో పొడిచి హత్య చేసి, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడన్నారు. సత్యనారాయణ భార్య సోదరుడి కుమార్తె ప్రియమణితో కొడుకు విజయ్‌కుమార్‌కు ఏడేళ్ల క్రితం వివాహం చేశారు. ఈ దంపతులకు బాబు కూడా ఉన్నాడు. విజయ్‌కుమార్ ఖతార్‌లో ఉపాధి నిమిత్తం ఉంటున్నారు. ఆమె తల్లి, కుటుంబ సభ్యులు అండమాన్‌లో ఉంటున్నారు.
కోడలు ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటోందని.. ఆమె నడవడిక సరిగాలేదని కుటుంబంలో కలహాలు జరుగుతూ ఉండేవి. ఈ నెల 22న ప్రియమణి సదరు యువకుడితో కలిసి వెళ్లిపోయినట్లు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని వెతికి తీసుకువచ్చిన పోలీసులు ఆమెకి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రియమణి తల్లి మంజుల అండమాన్ నుంచి మేడిచర్లపాలెం వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో కోడలికి, మామకు ఘర్షణ జరగింది. ఈ ఘర్షణలో మామ కత్తితో ఆమెపై దాడిచేసి పొడిచాడు. ఆ సమయంలో తల్లి మంజుల అడ్డురాగా ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. రాజోలు సీఐ దుర్గాశేఖరరెడ్డి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Also Read: India Corona Cases, 31st July: దేశంలో తాజాగా 41 వేల కేసులు, 593 మరణాలు.. కేరళ నుంచే సగం కరోనా కేసులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)